STOCKS

News


ఈఎల్‌ఎస్‌ఎస్‌ మెరుగైన ఆప్షన్‌... ఎందుకంటే?

Friday 19th October 2018
personal-finance_main1539972494.png-21296

పన్ను ఆదా చేసే పథకాల్లో ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎఎస్‌ఎస్‌) మెరుగైన ఆప్షన్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపునకు పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌, యులిప్‌లు, ఎన్‌ఎస్‌సీ, ఐదేళ్ల బ్యాంకు ఎఫ్‌డీ తదితర సాధనాలున్న విషయం తెలిసిందే. వీటన్నింటలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఎందుకు మెరుగైనదన్న దానికి నిపుణులు పేర్కొంటున్న అంశాలు ఇవి...

 

తక్కువ లాకిన్‌ పీరియడ్‌
అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత నిర్ణీత కాలం పాటు తిరిగి వెనక్కి తీసుకునేందుకు అవకాశం లేని కాల వ్యవధి. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇది మూడేళ్లుగా ఉంది. పీపీఎఫ్‌లో 15 ఏళ్లు, ఎన్‌ఎస్‌సీలో ఇది ఐదేళ్లుగా ఉంది. ఇతర సాధనాలతోనూ చూసినా పన్ను ఆదా చేసే వాటిల్లో తక్కువ లాకిన్‌ ఉన్నది ఈఎల్‌ఎస్‌ఎస్‌లోనే. అయినప్పటికీ దీర్ఘకాలం పాటు ఇందులో పెట్టుబడులు కొనసాగించాలన్నది నిపుణుల సూచన. ఈక్విటీ పెట్టుబడులపై పూర్తి ప్రయోజనాలు అందుకోవాలంటే దీర్ఘకాలం పాటు కొనసాగాలి. 

 

ఈక్విటీల్లో అధిక రాబడులు
రిస్క్‌ తీసుకునే వారే ఈక్విటీలవైపు చూస్తారు. ఈ విధంగా చూస్తే రిస్క్‌ తీసుకునే వారికి ఈఎల్‌ఎస్‌ఎస్‌ మంచి ఆప్షన్‌ అవుతుంది. ఎన్‌పీఎస్‌, యులిప్‌లు కూడా ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తాయి. అయితే, ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ ఎక్స్‌పోజర్‌పై పరిమితులు ఉన్నాయి. యులిప్‌ల విషయానికొస్తే బీమా మోర్టాలిటీ చార్జీలు, అలోకేషన్‌, అడ్మినిస్ట్రేషన్‌ ఇలా తదితర చార్జీలు పోను ఈక్విటీలకు వెళ్లేది సగమే ఉంటుంది. అదే ఈఎల్‌ఎస్‌లో 80-100 శాతం ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్‌ చేయడం జరుగుతుంది. దీంతో దీర్ఘకాలంలో మంచి నిధి సమకూరుతుంది. ఈక్విటీల్లో దీర్ఘకాలంలో మంచి రాబడులు ఉంటాయని తెలిసిందే. ద్రవ్యోల్బణ ప్రభావానికి మించి చక్కని రాబడులను ఈక్విటీలు ఇస్తాయని ఇప్పటికే నిరూపితమైన విషయం. కానీ, పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, ఇతర 80సీ సాధనాల్లో రాబడులు 7-8 శాతం వరకే ఉన్న విషయం గమనార్హం. అయితే, ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఎంచుకునే ఫండ్‌ పనితీరే రాబడులను నిర్దేశిస్తుందన్న సూక్ష్మాన్ని మర్చిపోరాదు. కనుక పథకం ఎంపికకు నిపుణుల సలహా తప్పక తీసుకోవాలి. 

 

ఆర్థిక క్రమశిక్షణ
ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేయడం మంచి ఆలోచన. ప్రతీ నెలా నిర్ణీత మొత్తం సిప్‌ రూపంలో ఎంచుకున్న పథకాల్లోకి వెళ్లే ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో ఉన్న మరో మంచి విషయం... ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ఆర్థిక సంవత్సరం చివర్లో ఒకేసారి రూ.60వేలు ఇన్వెస్ట్‌ చేయడం కంటే, ప్రతీ నెలా వేతనం బ్యాంకు ఖాతాలో పడిన వెంటనే, రూ.5వేలు సిప్‌ రూపంలో వెళ్లే ఏర్పాటు చేసుకోవడం ఎంత సౌకర్యమో ఆలోచించండి.You may be interested

సీఈఎస్‌సీ డీమెర్జర్‌తో ఇన్వెస్టర్‌కు లాభమెంత?

Friday 19th October 2018

సీఈఎస్‌సీ డీమెర్జర్‌ ఎట్టకేలకు తుది అంకానికి చేరింది. పలు అంశాల కారణంగా ఏడాదికిపైగా ఇది జాప్యం అవుతూ వచ్చింది. అక్టోబర్‌ 31 తేదీని డీమెర్జర్‌కు రికార్డు తేదీగా కంపెనీ ఖరారు చేసింది. అంటే ఆ రోజు నాటికి డీమ్యాట్‌ అకౌంట్లో షేర్లు కలిగిన వారికి కంపెనీ నుంచి డీమెర్జ్‌ చేసి లిస్ట్‌ చేసే కొత్త కంపెనీల షేర్లు లభిస్తాయి. తొలుత ప్రస్తుత కంపెనీని నాలుగు వ్యాపారాలుగా వేరు చేసి లిస్ట్‌

పడుతున్న కత్తులను పట్టుకున్న రిటైల్‌ ఇన్వెస్టర్లు!

Friday 19th October 2018

ఇటీవలి కాలంలో బాగా పతనమవుతున్న స్టాక్స్‌ను రిస్క్‌ చేసి మరీ రిటైల్‌ ఇన్వెస్టర్లు కొంటున్నట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అధిక పెట్టుబడులు పెట్టే హెచ్‌ఎన్‌ఐలతోపాటు రిటైల్‌ ఇన్వెస్టర్లు నష్ట జాతక స్టాక్స్‌ వెంట అడుగులు వేస్తుండడాన్ని గమనించొచ్చు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇలాంటి స్టాక్స్‌ చాలానే కొన్నారు. ఆ షేర్లు ఒక్క సెప్టెంబర్‌ త్రైమాసికంలోనే 45 శాతం వరకు పడిపోయాయి.    మన్‌పసంద్‌ బెవరేజెస్‌ ఇందులో ఒకటి. ఈ కంపెనీలో రిటైల్‌ ఇన్వెస్టర్ల

Most from this category