STOCKS

News


‘ఎప్పుడూ అవుట్‌పెర్‌ఫార్మర్ల కోసమే చూడక్కర్లేదు...’

Sunday 17th March 2019
personal-finance_main1552845665.png-24651

ఇన్వెస్టర్లు అయినా, వెల్త్‌ అడ్వైజర్లు అయినా ఇన్వెస్ట్‌ చేసేందుకు మార్కెట్‌ను మించిన పనితీరు (అవుట్‌ పెర్‌ఫార్మింగ్‌)ను పరిగణనలోకి తీసుకుంటుంటారు. పోటీ పథకాలతో పనితీరు ఎలా ఉంది లేదా బెంచ్‌మార్క్‌ సూచీలతో మూడు నెలలు, ఏడాది, మూడు సంవత్సరాలు, ఐదు సంవత్సరాల పనితీరును పోల్చి చూస్తుంటారు. ఇది ముఖ్యమైన విధానమే. కానీ, అద్భుత ప్రదర్శన ఒక్కడే కాకుండా చూడాల్సిన ఇతర అంశాలు కూడా ఉన్నాయంటున్నారు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా అస్సెట్‌ మేనేజర్స్‌ సీఐవో ఈఏ సుందరం. ఎప్పుడూ అవుట్‌పెర్‌ఫార్నింగ్‌ను మాత్రమే చూడడాన్ని సరికాదని పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలను వివరంగా తెలియజేశారు. 

 

మార్కెట్లో లార్జ్‌క్యాప్‌ ఆధారిత, మిడ్‌క్యాప్‌ ఆధారిత ఇలా పలు పథకాలు ఉంటాయి. కొన్ని గ్రోత్‌ విధానాన్ని అనుసరిస్తుంటాయి. కొన్ని మూమెంటమ్‌ ఆధారితంగా పనిచేస్తుంటాయి. కొన్ని వ్యాల్యూ ఆధారితంగా పెట్టుబడులు చేస్తుంటాయి. కనుక ఎటువంటి తరహా పోర్ట్‌ఫోలియో అన్నది చూడాలి. అప్పుడే తమ ప్రాధాన్యతలకు సరిగ్గా సరిపోయే పథకాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ భిన్నమైన విధానమే రాబడులను నిర్దేశిస్తుంది. కనుక ఈ విధానంలో నంబర్‌ 1 పథకాన్నే అన్నివేళలా చూడాల్సిన అవసరం లేదు. ఒక ఇన్వెస్టర్‌ తన పోర్ట్‌ఫోలియోలో భిన్నకలయికలతో కూడిన సాధనాలు ఉండేలా చూసుకోవాలి. ఇవి ఒకదానికొకటి సాయపడేలా ఉండాలి. ఎందుకంటే వీటి కలయికే రిస్క్‌ను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌ల్లో స్టాక్స్‌ సంఖ్య వేర్వేరుగా ఉంటుంది. నిఫ్టీ-50లో 50 స్టాక్స్‌, నిఫ్టీ500లో 500 స్టాక్స్‌ ఉంటాయి. ప్రతీ కంపెనీ ఆర్థిక పనితీరు, స్టాక్‌ ధరల కదలిక వందలాది అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఫండ్‌ మేనేజర్‌ ఈ అంశాలన్నీ ముందుగానే గ్రహించి, షేర్ల ధరలపై పడే ప్రభావాన్ని ఊహించి అందుకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేయాలని ఆశించడం అత్యాశే అవుతుంది.  అవుట్‌పెర్‌ఫార్మ్‌ ఆందోళనతో కొన్ని సందర్భాల్లో చాలా పోర్ట్‌ఫోలియో రాబడులు ప్రభావితం అవుతాయి. దీంతో పోర్ట్‌ఫోలియో రిస్క్‌ పెరిగిపోతుంది. ఒక ఇన్వెస్టర్‌ ఒకే తరహా పథకాల్లో అన్ని పెట్టుబడులు కలిగి ఉండకుండా, భిన్నమైన సాధనాలను ఎంచుకోవాలి. దాంతో రిస్క్‌ను తట్టుకుని మెరుగైన రాబడులు పొందొచ్చు. ఇన్వెస్టర్లు ఎప్పుడూ ఆందోళన చెందే మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించడమే ఫండ్‌ మేనేజర్ల టాస్క్‌. వ్యాపార రిస్క్‌, మేనేజ్‌మెంట్‌ రిస్క్‌, ప్రైస్‌ రిస్క్‌పై ఫండ్‌ మేనేజర్లు ప్రధానంగా దృష్టి పెడుతుంటారు.You may be interested

పది స్టాక్స్‌లో రూ.1,294 కోట్ల పెట్టుబడులు

Sunday 17th March 2019

అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ వాన్‌గార్డ్‌ గ్రూపు ఒకే రోజు భారత ఈక్విటీ మార్కెట్లో ఏకంగా రూ.1,294 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేసి ఆశ్చర్యపరిచింది. ఈ నెల 15న నిఫ్టీ ఆరు నెలల గరిష్ట స్థాయి వద్ద ముగిసిన రోజే ఈ భారీ పెట్టుబడులకు వాన్‌గార్డ్‌ గ్రూపు దిగడం గమనార్హం. గత నెల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే.

నెక్ట్స్‌ ర్యాలీ ఈ రంగ కంపెనీల నుంచే!

Sunday 17th March 2019

బ్యాంకుల రుణ వృద్ధి 14.4 శాతానికి మెరుగుపడడం, ఆర్‌బీఐ వృద్ధికి అనుకూల ధోరణి, బ్యాంకింగ్‌ రీక్యాపిటలైజేషన్‌, లిక్విడిటీ మెరుగుదల, రిస్క్‌ ఆధారిత వ్యాల్యూషన్లు తదితర అంశాలన్నీ బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ గత గరిష్టాలను దాటేందుకు ట్రిగ్గర్‌గా పనిచేశాయని, ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌, ఎండీ డీకే అగర్వాల్‌ పేర్కొన్నారు. తదుపరి మార్కెట్‌ ర్యాలీల్లో ఈ రంగం ముందుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో ఆయన తన అభిప్రాయాలను

Most from this category