STOCKS

News


విద్యుత్‌, బ్యాంకు స్టాక్స్‌ను కొంటున్నదెవరు? 

Thursday 10th January 2019
personal-finance_main1547059149.png-23490

బ్యాంకు, విద్యుత్‌స్టాక్స్‌కు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. దేశంలో ఆస్తుల పరంగా అతిపెద్ద అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థ) హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కొన్ని విద్యుత్‌, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, ప్రైవేటు బ్యాంకుల స్టాక్స్‌ను డిసెంబర్‌ నెలలో కొనుగోలు చేసింది. ఆర్‌ఈసీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. 2.05 కోట్ల ఆర్‌ఈసీ షేర్లను హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కొనుగోలు చేసింది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ)కు సంబంధించి కూడా 1.62 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఈ రెండూ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలే. విద్యుత్‌ రంగ కంపెనీలకు రుణాలను ఇచ్చే వ్యాపారంలో ఉన్నాయి. ఆర్‌ఈసీలో కేంద్ర ప్రభుత్వ వాటాలను పీఎఫ్‌సీ కొనుగోలు చేస్తున్న విషయం విదితమే. ఇక ఎన్‌టీపీసీలో 1.19 కోట్ల షేర్లు, కోల్‌ ఇండియాలో 80 లక్షల షేర్లను, టాటా పవర్‌లో 2.61 కోట్ల షేర్లను కూడా ఈ సంస్థ కొనుగోలు చేసింది. ఎన్‌హెచ్‌పీసీ, కల్పతరు పవర్‌ షేర్లను కూడా కొనుగోలు చేసింది. గత కొన్నేళ్లుగా విద్యుత్‌ రంగ కంపెనీలు ర్యాలీ చేయలేదు. అగ్ర స్థాయి మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ ఇంత పెద్ద ఎత్తున విద్యుత్‌ రంగ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందంటే భవిష్యత్తులో ఇవి ర్యాలీ చేయనున్నాయని అర్థం చేసుకోవచ్చు. 

 

బ్యాంకింగ్‌ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ... ఫెడరల్‌ బ్యాంకులో 26.29 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. అలాగే, 13.38 లక్షల యస్‌ బ్యాంకు షేర్లు, 6.78 లక్షల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లను సొంతం చేసుకుంది. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టింది. అలాగే, 8.89 లక్షల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లను కొనుగోలు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ నిర్వహణలోని ఆస్తులు డిసెంబర్‌ ఆఖరుకు రూ.3,35,748 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ సంస్థ ఇతర పెట్టుబడులను గమనిస్తే... ఎస్‌హెచ్‌ కేల్కర్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌, జీఈ షిప్పింగ్‌, ఎల్‌అండ్‌టీ, టాటా మెటాలిక్స్‌, ఇండియన్‌ హోటల్స్‌, టీసీఎస్‌, సెంచురీ ప్లైబోర్డ్స్‌ స్టాక్స్‌లోనూ పెట్టుబడులు పెట్టింది. ఇక సెయిల్‌ కౌంటర్లో 92.76 లక్షల షేర్లు, గెయిల్‌ ఇండియా 73.49 లక్షల షేర్లు, అంబుజా సిమెంట్‌ 31 లక్షల షేర్లు, టాటా స్టీల్‌ 16.82 లక్షల షేర్లు, అలహాబాద్‌ బ్యాంకుకు సంబంధించి 15.68 లక్షల షేర్ల చొప్పున విక్రయించింది. ర్యాలీస్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌లోనూ అమ్మకాలు జరిపింది. 



You may be interested

మార్కెట్లోకి నిధుల రాక తగ్గుతోందా?

Thursday 10th January 2019

దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వస్తున్న పెట్టుబడులే ఈ మధ్య కాలంలో మన దేశ ఈక్విటీ మార్కెట్లను బలంగా ముందుకు తీసుకెళుతున్నాయి. ఒకవైపు విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నా ఆ ప్రభావం పెద్దగా పడడం లేదంటే ఇదే కారణం. దేశీయ ఇన్వెస్టర్ల నుంచి ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో... దేశీయ మార్కెట్లు విదేశీ నిధుల ప్రవాహాలపై ఇంకెంత మాత్రం ఆధారపడడం లేదు. కానీ, డిసెంబర్‌ నెలలో మ్యూచువల్‌

నాలుగో రోజూ లాభాలే..!

Wednesday 9th January 2019

36వేలపైన సెన్సెక్స్‌ 10850పైన నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ ఆర్థిక రంగ షేర్ల అండతో మార్కెట్‌ నాలుగో రోజూ లాభాలతో ముగిసింది. మిడ్‌సెషన్‌ తరువాత సాగిన ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో చివరకు సెన్సెక్స్‌ 36వేల పైన, నిఫ్టీ 10850 పాయింట్లపై ముగిశాయి. ఇటీవల ప్రపంచ వాణిజ్యరంగాన్ని కలవరపెడుతున్న అమెరికా-చైనా దేశాల వాణిజ్య యుద్ధ నివారణ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో నేడు సూచీలు భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లు పెరిగి 36,180 వద్ద, నిఫ్టీ

Most from this category