STOCKS

News


ఈ సమయంలో ఏ ఫండ్స్‌ బెటర్‌?

Thursday 28th February 2019
personal-finance_main1551376809.png-24383

మార్కెట్లు తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తున్న ఈ సమయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లలో ఏ ఫండ్స్‌ను ఆశ్రయించాలన్న సందేహం రావొచ్చు. అయితే, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయదలిచిన ఇన్వెస్టర్లు ఈ సందేహాలను పక్కన పెట్టేసి సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసుకుంటూ వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఏ ఫండ్స్‌ను నమ్ముకోవచ్చన్న ప్రశ్నకు... ఇండెక్స్‌ ఫండ్స్‌, మల్టీక్యాప్‌ ఫండ్స్‌ సమ్మిళితంగా ఎంపిక ఉంటే బావుంటుందని సూచిస్తున్నారు. 

 

ఇన్వెస్టర్లు మల్టీక్యాప్‌ పథకాలను ఎంచుకుంటే... ప్రత్యేకంగా ఓ సైజు కంపెనీలకే పరిమితం కాకుండా ఉండొచ్చని, అన్ని రకాల సైజుల కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసుకునే సానుకూలత వీటిల్లో ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా దేశ, విదేశీ ప్రతికూలతల అంశాలు, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండెక్స్‌, మల్టీక్యాప్‌ ఫండ్స్‌ ఒకింత సురక్షితంగా చెబుతున్నారు. ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్‌ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. ఇతర ఈక్విటీ పథకాలతో పోలిస్తే ఎక్స్‌పెన్స్‌ రేషియో కేవలం ఒక వంతే ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో రాబడులు అధికంగా పొందొచ్చు. గత 5, 10 ఏళ్ల కాలంలో నిఫ్టీ-50 ఇండెక్స్‌ 11.6 శాతం, 14.5 శాతం చొప్పున రాబడులు ఇచ్చింది. అదే లార్జ్‌ సైజు ఈక్విటీ ఫండ్ష్‌ 13 శాతం, 15 శాతం చొప్పున రాబడులు పంచాయి. రాబడులు ఇంచుమించు ఒకే విధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మల్టీక్యాప్‌ ఫండ్స్‌లో అయితే, స్మాల్‌క్యాప్‌ లేదా మిడ్‌క్యాప్‌ లేదా లార్జ్‌క్యాప్‌లో ఏదో ఒకదానికే పరిమితం కాకుండా, అన్ని రకాల కంపెనీల్లో పెట్టుబడి అవకాశాలు మల్టీక్యాప్‌ ఫండ్స్‌ ద్వారా లభిస్తాయి.

 

మల్టీక్యాప్‌ పథకాల్లో... ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఈక్విటీ ఫండ్‌ మూడేళ్లలో 18 శాతం, ఐదేళ్లలో 18 శాతం, పదేళ్లలో 19 శాతం చొప్పున వార్షిక రాబడులు ఇచ్చింది. కోటక్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ మూడేళ్లలో 17.5 శాతం, ఐదేళ్లలో 18.5 శాతం చొప్పున వార్షిక రిటర్నులు ఇచ్చింది. ఎస్‌బీఐ మ్యాగ్నం మల్టీక్యాప్‌ పథకం మూడేళ్లలో 16 శాతం, ఐదేళ్లలో 18 శాతం, పదేళ్లలో 17 శాతం మేర రాబడులు పంచింది. మిరే అస్సెట్‌ ఇండియా ఈక్విటీ ఫండ్‌ ఇవే కాలాల్లో 19 శాతం, 18 శాతం, 23 శాతం చొప్పున వార్షిక రాబడులు ఇచ్చింది. ఇండెక్స్‌ ఫండ్స్‌లో  ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఫండ్‌ ఏడాదిలో మూడేళ్లలో 15.69 శాతం, ఐదేళ్లలో 16.80 శాతం వార్షిక రాబడులు ఇచ్చింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ నాస్‌డాక్‌ 100 ఈటీఎఫ్‌ ఏడాదిలో 12 శాతం, మూడేళ్లలో 19 శాతం, ఐదేళ్లలో 16.65 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్ని అందించింది. 



You may be interested

మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ గరిష్టాలకు చాలా సమయముంది!

Thursday 28th February 2019

మార్కెట్‌ బోటమ్డ్‌ అవుట్‌ అయిందని, అయితే, ఈ ప్రక్రియ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుందని యస్‌ సెక్యూరిటీస్‌ ప్రెసిడెంట్‌ అమర్‌ అంబానీ తెలిపారు. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ తిరిగి వాటి గరిష్ట స్థాయిలకు ఇప్పుడప్పుడే వెళ్లవని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఓ వార్తా పత్రికకు ఆయన పలు అంశాలపై ఇంటర్వ్యూ ఇచ్చారు.    ఈక్విటీ మార్కెట్లలో ఆటు పోట్లు సహజమేనని, మార్కెట్లను ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయని అమర్‌ అంబానీ తెలిపారు.

మళ్లీ మోది వస్తే 7 శాతం అప్‌..రాహుల్‌ అయితే 2 శాతం

Thursday 28th February 2019

ఎన్నికల ఫలితాల అనంతరం సెన్సెక్స్‌పై అంచనాలు మే నెలలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని, నరేంద్ర మోది ప్రభుత్వం తిరిగి అధికారం చేపడితే ఈక్విటీలకు అత్యంత అనుకూలంగా వుంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఆగస్టు 29 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,989 పాయింట్ల రికార్డు గరిష్టస్థాయిని తాకిన తర్వాత ఇప్పటివరకూ 8 శాతం నష్టపోయింది. 2018లో కనిష్టస్థాయి నుంచి వేగంగా కోలుకుని, కొత్త గరిష్టస్థాయికి చేరిన తీరు

Most from this category