STOCKS

News


మూడేళ్లలో 15 శాతం... పదేళ్లలో 25 శాతం...?

Saturday 1st December 2018
personal-finance_main1543602991.png-22535

వార్షికంగా 15 శాతం రాబడులను పదేళ్ల కాలంలో ఇచ్చిన మ్యూచువల్‌ ఫండ్‌ పథకం ఒకటి. వార్షికంగా 25 శాతం చొప్పున రాబడులను అందించినది మరో పథకం. మరి ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి? అన్న సందేహం ఇన్వెస్టర్లకు రావడం సహజం. నిజానికి ఈ రెండింటిలో రెండో పథకం పనితీరు ఆచరణ సాధ్యమే. కానీ, మొదటి పథకం పనితీరు దీర్ఘకాలానికి చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు వార్షికంగా 15 శాతం రాబడులు కూడా ఆకర్షణీయమేనని నిపుణుల అభిప్రాయం. అయినా సరే ఈ రెండింటిలో ఎంపిక ఏది? అని ప్రశ్నిస్తే... అసలు ఓ పథకం ఎంపికకు పనితీరు ఒక్కటే ప్రామాణికం కాదన్నది తెలుసుకోవాలి. 


ఓ పథకం పదేళ్ల కాలం నుంచీ ఉందంటే అది ఒక పూర్తి మార్కెట్‌ సైకిల్‌ను చూసినట్టుగా భావించాలి. అదే మూడేళ్ల నుంచి ఉన్న పథకం అయితే, మార్కెట్ల ర్యాలీలో పనితీరే కనిపిస్తుంది. కనుక రెండో పథకం పనితీరు మెరుగ్గా కనిపించొచ్చు. కానీ, సమీప భవిష్యత్తులోనూ ఇదే పనితీరు చూపిస్తుందన్న గ్యారంటీ లేదు. అందుకే కచ్చితంగా ఓ రెండు పథకాల్లో ఏది ఎంచుకోవాలన్నది తేల్చుకోవాలంటే... రెండింటి పనితీరు నిర్ణీత కాలంలో ఏ విధంగా ఉందీ చూడాల్సి ఉంటుంది. అంటే రెండు పథకాల పనితీరు మూడేళ్ల కాలంలో ఏ విధంగా ఉందో గమనించాలి.  ఇక రెండో అంశం రాబడుల పరంగా ఉన్న ఆటుపోట్లు. నిజానికి దీన్ని దాదాపు అందరు ఇన్వెస్టర్లు పట్టించుకోరు. ఉదాహరణకు ఫండ్‌ ఏ (పదేళ్ల కాలంలో వార్షికంగా 15 శాతం రాబడి) ఒక ఏడాది అత్యధికంగా 35 శాతం రాబడులను ఇచ్చి, ఒక ఏడాది 12 శాతం ప్రతికూల రాబడి (నష్టం) ఇచ్చిందనుకోండి. ఇక, ఫండ్‌ బి (మూడేళ్లలో వార్షికంగా 25 శాతం రాబడి) ఒక ఏడాది అత్యుత్తమంగా 52 శాతం రాబడి ఇచ్చి, ఒక ఏడాది దారుణంగా 27 శాతం నష్టాలను ఇచ్చిందనుకోండి. అప్పుడు ఫండ్‌ బి మరింత ఒడిదుడుకులతో కూడిన రిస్క్‌ ఫండ్‌గా భావించాల్సి ఉంటుంది. ఒక ఏడాదిలో అధిక రాబడులు ఇచ్చినా గానీ, అదే సమయంలో భారీ వోలటాలిటీ అన్నది అందరు ఇన్వెస్టర్లకు సరిపడదు. అందుకే ఓ పథకం ఎంపికకు కేవలం గత పనితీరునే కాకుండా ఇతర అంశాలను కూడా చూడాలన్నది నిపుణుల సూచన. రెండు పథకాల మధ్య ఒకే కాలంలో పనితీరుతోపాటు, లంప్‌సమ్‌, సిప్‌ రాబడులు ఎలా ఉన్నాయి, కేటగిరీతో పోలిస్తే సంబంధిత పథకం రాబడులు మెరుగ్గా ఉన్నాయా? అన్నవి కూడా చూడాల్సి ఉంటుంది.



You may be interested

జీఎస్‌టీ రిటర్న్స్‌ ఫైలింగ్‌ గడువు పెంపు

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టాలకు సంబంధించి అక్టోబర్‌ - డిసెంబర్‌ కాలానికి టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత) రిటర్న్స్‌ ఫైలింగ్‌కు గడువును కేం‍ద్రం పెంచింది. 2019 జనవరి 31 వరకూ రిటర్న్స్‌ దాఖలు చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.జీఎస్‌టీ కింద టీడీఎస్‌ ప్రొవిజన్స్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చాయి. సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) చట్టం ప్రకారం- రూ.2.5

ఒక్కసారి మార్కెట్‌ను వీడితే అంతే!: శంకర్‌ శర్మ

Saturday 1st December 2018

గత రెండు నెలల్లో ఈక్విటీల్లో అమ్మకాల ఒరవడి కొనసాగుతున్న తరుణంలో తన బ్యాంకు బ్యాలన్స్‌కు భారీ చిల్లు పడిందని, అటువంటి సందర్భాల్లో స్టాక్‌ మార్కెట్‌ను విడిచిపెడదామన్న ఆలోచన ప్రతీ ఒక్కరికీ వస్తుందని, తనకు సైతం వచ్చిందని ఏస్‌ ఇన్వెస్టర్‌, మార్కెట్‌ నిపుణుడు శంకర్‌ శర్మ అన్నారు. అయితే, కఠిన సందర్భాలు వచ్చి, పోతుండడం సహజమేనన్నారు. ఒక్కసారి మార్కెట్‌ను వీడితే తిరిగి రావడానికి మార్గం ఉండదన్నారు. ముంబైలో జరిగిన ఈటీ మార్కెట్స్‌

Most from this category