STOCKS

News


రూ.20లక్షలు ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి

Monday 26th November 2018
personal-finance_main1543213793.png-22383

ప్ర: నా వయస్సు 77 సంవత్సరాలు. నేను అధిక పన్ను స్లాబ్‌లో ఉన్నాను. ఇటీవలే నేను తీసుకున్న కొన్ని పాలసీల్లో ఒకటి మెచ్యూర్‌ అయింది.రూ.20 లక్షలు వచ్చాయి. ఈ మొత్తా‍న్ని దేంట్లో ఇన్వెస్ట్‌ చేస్తే బావుంటుంది. నేను నష్ట భయాన్ని ఓ మోస్తరుగా భరించగలను. తగిన సలహా ఇవ్వండి.
-షణ్ముఖ రావు, హైదరాబాద్‌
జ: మీ ఆర్థిక అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయండి. ద్రవ్యోల్బణం కంటే కూడా అధిక రాబడులు వచ్చే విధంగా ఈ మొత్తాన్ని ఇన్వెస్‌ చేయాలి. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆధారంగా వచ్చే ఆదాయం మీకు తక్షణం అవసరం లేని పక్షంలో, సముచిత రీతిలో రాబడులు ఇచ్చే విధంగా ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టండి. మీ వయస్సు దృష్టా​‍్య మీరు ఎక్కువ నష్టభయం లేని సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. దీని కోసం మీరు ఈక్విటీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ను పరిశీలించవచ్చు. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కంటే అధిక రాబడులు ఈక్విటీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ద్వారా పొందవచ్చు. ఈ స్కీమ్‌ రాబడులపై మీకు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఒక వేళ ఈ ఇన్వెస్ట్‌మెంట్‌(రూ.20 లక్షలు) ఆధారంగా వచ్చే ఆదాయం మీకు అవసరమైన పక్షంలో రెండు స్కీమ్‌లను పరిశీలించవచ్చు. ఒకటి సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌, రెండోది ప్రధానమంత్రి వ్యాయ్‌ వందన యోజన (పీఎమ్‌వీవీవై). ఇవి సురక్షితమైన పెట్టుబడి సాధనాలే కానీ, వీటిల్లో రాబడులు పెద్దగా ఉండవు. అందుకని మీ ఆర్థిక అవసరాలు, మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాలు తీసుకోండి.

ప్ర: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ గురించి ఎప్పుడూ చెబుతుంటారు కదా! అలా కాకుండా ఒక ఫండ్‌ నుంచి ఏయే సందర్భాల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలో కూడా వివరించండి.
-సుందర్‌, విజయవాడ
జ: మీరు ఇన్వెస్ట్‌ చేసిన మ్యూచువల్‌ ఫండ్‌ సుదీర్ఘకాలం పాటు సరైన రాబడులు ఇవ్వని పక్షంలో ఆ ఫండ్‌ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవచ్చు. సాపేక్ష పనితీరు అధారంగా కూడా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవాలి. ఉదాహరణకు ఏడాది కాలంలో మార్కెట్‌ 15 శాతం క్షీణించిందనుకోండి. మీ ఫండ్‌ 10 శాతమే పడిపోతే, మీ ఫండ్‌ పనితీరు బాగానే ఉన్నట్లు లెక్క. మీ ఫండ్‌ రాబడులు మిమ్మల్ని నిరాశపరిచినా, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించవచ్చు. అలా కాకుండా మార్కెట్‌ 15 శాతం క్షీణించి, మీ ఫండ్‌​ 25 శాతం పతనమైందనుకోండి. ఇదే కేటగిరీలోని ఇతర ఫండ్స్‌ పనితీరు కూడా ఎలా ఉందో పరిశీలించాలి. ఇతర ఫండ్స్‌ పనితీరు మెరుగ్గా ఉన్న పక్షంలో ఈ ఫండ్‌ నుంచి వైదొలగడమే ఉత్తమం. మరోవైపు మీరు ఏ ఆర్థిక లక్ష్యాల కోసం మదుపు చేస్తున్నారో, ఈ లక్ష్యం సమయం ఆసన్నమైనప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఉదాహరణకు సొంత ఇల్లు సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత చదువులు, రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు వంటి ఆర్థిక లక్ష్యాల కోసం మదుపు చేయడం ఆర​ంభించారనుకుందాం. మీ పాప లేదా బాటు ఉన్నత విద్యావసరాల కోసం మరో రెండేళ్లలో సొమ్ములు అవసరమయ్యాయనుకోండి. అప్పుడు ఫండ్స్‌ నుంచి పెట్టుబడులను స్థిరాదాయ సాధనాల్లోకి బదిలీ చేసుకోవాలి. అవసరమైనప్పుడు ఈ స్థిరాదాయ సాధనాల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవాలి.

ప్ర: జీవిత బీమా పాలసీ కోసం  సింగిల్‌ ప్రీమియమ్‌ పాలసీ తీసుకోవాలా? లేకుంటే వార్షికంగా ప్రీమియమ్‌లు చెల్లించే రెగ్యులర్‌ పాలసీ తీసుకోవాలా?
-శారద, విశాఖ పట్టణం
జ: సింగిల్‌ ప్రీమియమ్‌ పాలసీలో కొన్ని ప్రయోజనాలు, రెగ్యులర్‌ ప్రీమియమ్‌ పాలసీలో మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఏ రకమైన పాలసీ తీసుకోవాలనే నిర్ణయం తీసుకోవడానికి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సింగిల్‌ ప్రీమియమ్‌లో అయితే ప్రీమియమ్‌ మొత్తం ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. అదే రెగ్యులర్‌ ప్రీమియమ్‌లో అయితే ఏడాదికి కొంత చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. ఇలా ఏడాదికి కొంత చొప్పున చెల్లించడం వల్ల సాధారణంగా ప్రీమియమ్‌ తక్కువగానే ఉంటుంది. సింగిల్‌ ప్రీమియమ్‌ ప్లాన్‌ల్లో కనీస బీమా కవరేజ్‌.. ప్రీమియమ్‌నకు 125 శాతంగా ఉంటుంది. మీ వయస్సు 45 సంవత్సరాల లోపు ఉంటే సింగిల్‌ ప్రీమియమ్‌ పాలసీ వల్ల మీకు పన్ను ప్రయోజనాలు లభించవు. రెగ్యులర్‌ ప్రీమియమ్‌ పాలసీలకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. సింగిల్‌ ప్రీమియమ్‌లో అయితే ఏజంట్‌కు కమీషన్‌ 2 శాతానికి (ప్రీమియమ్‌పై) మించి రాదు. రెగ్యులర్‌ ప్రీమియమ్‌ పాలసీలకైతే, తొలి ఏడాది ప్రీమియమ్‌పై 35 శాతం వరకూ ఏజంట్‌కు కమీషన్‌గా వస్తుంది. కనీసం పదేళ్ల కాల వ్యవధి పాలసీలకు ఇది వర్తిస్తుంది. రెండో ఏడాది ఇది 7.5 శాతంగా ఉంటుంది. నాలుగో ఏడాది నుంచి 5 శాతం వరకూ కమీషన్‌ లభిస్తుంది. కొంతమంది ఏజెంట్లు ఈ కమీషన్‌ను కొంత మినహాయించుకొని పాలసీలను ఆఫర్‌ చేస్తున్నారు. సింగిల్‌ ప్రీమియమ్‌లో ఆ వెసులుబాటు ఉండదు. సింగిల్‌ ప్రీమియమ్‌ పాలసీలో మీకు అవసరం లేని టర్మ్‌కు కూడా పాలసీ చెల్లించాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తూ పాలసీ తీసుకున్న ఐదే ఏటే మరణం సంభవిస్తే, పూర్తి కాలానికి ప్రీమియమ్‌ను సింగిల్‌ ప్రీమియమ్‌లో ముందుగానే చెల్లింపు ఉంటుంది. రెగ్యులర్‌ ప్రీమియమ్‌ పాలసీలో ఈ ప్రతికూలత ఉండదు.  ద్రవ్యానికి సంబంధించిన కాల విలువ (టైమ్‌ వేల్యూ ఆఫ్‌ మనీ) పరంగా చూసినా.. ద్రవ్యోల్బణం, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నా, రెగ్యులర్‌ ప్రీమియమ్‌లే చౌక.



You may be interested

మొండిబకాయిల విక్రయంలో ఆంధ్రాబ్యాంక్‌

Monday 26th November 2018

- రూ. 1,553 కోట్ల ఎన్‌పీఏలు వేలానికి - లిస్టులో ట్రాన్స్‌ట్రాయ్ పద్దులు కూడా న్యూఢిల్లీ: సుమారు 50 ఖాతాల నుంచి రావాల్సిన మొండిబాకీలను రికవర్ చేసుకోవడంపై ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ దృష్టి సారించింది. దాదాపు రూ. 1,553 కోట్ల మేర మొండిబాకీలను (ఎన్‌పీఏ) వేలం వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ‍రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీల (ఏఆర్‌సీ) నుంచి బిడ్లను ఆహ్వానించింది. నవంబర్ 30లోగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) సమర్పించాల్సిందని టెండర్

టీవీ, గృహోపకరణాల ధరలకు రెక్కలు

Monday 26th November 2018

7-8 శాతం మేర పెంపు పండుగలు ముగియడంతో అమల్లోకి న్యూఢిల్లీ: టీవీలు, ఇతర గృహోపకరణాల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తయారీ వ్యయాలు పెరిగినప్పటికీ ఇటీవల పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు రేట్ల పెంపును కాస్తంత వాయిదా వేసుకున్నాయి. దీంతో వాటి మార్జిన్లపై ప్రభావం ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం కంపెనీలపై భారం పెరిగేలా చేసింది. ఈ పరిస్థితులను అధిగమించి, తమ మార్జిన్లను బలోపేం చేసుకునేందుకు కంపెనీలు ధరల

Most from this category