News


భారీ నిధులు...ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి ? 

Monday 17th December 2018
personal-finance_main1545034537.png-22991

ప్ర: భూమి అమ్మకం వల్ల ఒకేసారి భారీగా రూ.5 కోట్లు వచ్చాయి. దీనిని దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఎన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయమంటారు ? ఎన్ని నెలల్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేస్తే బావుంటుంది ?
-నవకాంత్‌, హైదరాబాద్‌ 

జ: మీరు అడిగిన రెండు ప్రశ్నల్లో రెండో ప్రశ్న ముఖ్యమైనది.రూ. 5 కోట్ల పెట్టుబడి అంటే పెద్ద మొత్తమే. ఇది మీ రెండేళ్ల ఆదాయమైతే, ఈ మొత్తాన్ని ఒక ఏడాది కాలంలో ఇన్వెస్ట్‌ చేయండి. ఇది మీ జీవితంలోనే అతి పెద్ద ఆదాయమనుకోండి. ఈ మొత్తాన్ని మూడేళ్ల కాలంలో ఇన్వెస్ట్‌ చేయండి. మార్కెట్‌ గమనం  పూర్తి సైకిల్‌కు సాధారణంగా మూడేళ్ల కాలం పడుతుందని అంచనా. మూడేళ్ల కాలంలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల  మార్కెట్‌ పై స్థాయిల్లో ఉన్నా, పతన స్థాయిల్లో ఉన్నా యావరేజింగ్‌ ప్రయోజనాలు దక్కుతాయి. ఇక మీ మొదటి ప్రశ్న విషయానికొస్తే, భూమి విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయడానికి రెండు, లేదా మూడు బ్యాలన్స్‌డ్‌ ఫం‍డ్స్‌ను ఎంచుకోండి. మల్టీక్యాప్‌ ఫండ్స్‌ను కూడా పరిశీలించవచ్చు. బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌కు ఉన్న ఒక ముఖ్యమైన ప్రయోజనమేమిటంటే, ఇన్వెస్టర్‌ జోక్యం లేకుండానే ఆటోమేటిక్‌గా రీబ్యాలన్స్‌ చేసుకుంటుంది. ఒక ఇన్వెస్టర్‌గా మీరు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మినహా మరేమీ చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ తమ నిధుల్లో 70 శాతం మొత్తాన్ని ఈక్విటీల్లోనూ, మిగిలిన 30 శాతం మొత్తాన్ని స్థిరాదాయ సాధనాల్లోనూ ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇక మల్టీక్యాప్‌ ఫం‍డ్స్‌ విషయానికొస్తే, బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌తో పోల్చితే ఇవి ఒకింత ఒడిదుడుకులమయంగా సాగుతాయి. అయితే బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ కంటే మల్టీక్యాప్‌ ఫం‍డ్స్‌ల్లో రాబడులు అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే మీ పోర్ట్‌ఫోలియోను మరొక విధంగా కూడా డిజైన్‌ చేసుకోవచ్చు. రెండు మల్టీక్యాప్‌ ఫండ్స్‌, ఒక మిడ్‌ క్యాప్‌, మరొక స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయండి. ఇలా ఇన్వెస్ట్‌ చేస్తే, మార్కెట్‌ పెరిగినప్పుడు రాబడులు అధికంగా ఉంటాయి. అయితే మార్కెట్‌ పడిపోయినప్పుడు మీ రాబడుల్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉంటాయి. కంగారు పడకుండా మీ పోర్ట్‌ఫోలియోను అలాగే కొనసాగించండి. ఇలా 7 నుంచి 8 సంవత్సరాలు ఈ పోర్ట్‌ఫోలియోను కొనసాగిస్తే, మీకు ఖచ్చితంగా మంచి రాబడులే వస్తాయి. 

ప్ర: పదేళ్లపాటు ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించే ఉద్దేశంతో ఒక ఈక్విటీ ఫండ్‌లో రెండేళ్ల నుంచి సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అయితే ఈ ఫండ్‌ పనితీరు బాగాలేదు. దీంతో ఈ ఫండ్‌ను మార్చాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా సమకూరిన మొత్తాన్ని ఒకేసారి ఈ ఫండ్‌ నుంచి వెనక్కి తీసుకొని వేరే ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా ? లేక వేరే ఫండ్‌లో మళ్లీ సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేయాలా ?
-సుధారాణి, విశాఖపట్టణం 
జ: మీరు రెండేళ్ల నుంచి ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫండ్‌ రాబడులు సంతృప్తికరంగా లేని పక్షంలో ఆ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)లు ఆపేయండి. అంతే కాకుండా ఇప్పటిదాకా ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన మొత్తాన్ని ఒకేసారి వేరే కొత్త ఫండ్‌లోకి మార్చుకోవచ్చు. సాధరణంగా సిప్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేస్తే యావరేజింగ్‌ ప్రయోజనాలు లభిస్తాయి. కానీ మీరు ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం మీకు సంతృప్తికరమైన రాబడులను ఇవ్వలేకపోయింది కాబట్టి, మీ ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. ఇలా ఒకేసారి మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకున్నప్పుడు, ఎగ్జిట్‌ లోడ్‌, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను తదితర వ్యయాలు ఉంటాయి. వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 

ప్ర: పెర్‌పెట్యువల్‌ సిప్‌ అంటే ఏమిటి ? ఈ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదేనా ?
-ఇషాన్‌, విజయవాడ 
జ: సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌-సిప్‌ విధానంలో నెలకు లేదా నిర్దేశిత కాలానికి కొంత మొత్తం చొప్పున కొన్నేళ్లు పాటు ఇన్వెస్ట్‌ చేయడం మనందరికీ తెలిసిందే. సాధారణంగా సిప్‌ల కాలపరిమితి 3 లేదా 5 లేదా 8 లేదా పదేళ్లుగా ఉంటుంది. కానీ నిర్దేశిత కాలపరిమితి లేకుండా సిప్‌లను కొనసాగించడాన్ని పెర్‌పెట్యువల్‌ సిప్‌గా పరిగణిస్తారు. ఈ పెర్‌పెట్యువల్‌ సిప్‌ను ఎంచుకున్నప్పటికీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్‌ చేసుకోవచ్చు. ప్రతీ ఏడాది 5 లేదా 10 శాతం మేర సిప్‌ మొత్తాన్ని పెంచుకుంటే మరీ మంచిది. ఈ పెర్‌పెట్యువల్‌ సిప్‌...చిన్న వయస్సు ఇన్వెస్టర్లకు అత్యంత ఉపయోగకరం. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి ఉన్నాడనుకుందాం. ఆ వ్యక్తి పెర్‌పెట్యువల్‌ సిప్‌ను ప్రారంభిస్తే, కనీసం 30-35 ఏళ్ల పాటు ఎలాంటి బ్రేక్‌ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించవచ్చు. అలాగే 55 ఏళ్లు దాటిన వ్యక్తికి పెర్‌పెట్యువల్‌ సిప్‌ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కారు కొనుగోలు చేయడం, విదేశీ యాత్రలు చేయడం వంటి స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం 3 లేదా ఐదేళ్ల సిప్‌లు ఉపయోగకరం. అలాగే రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు చేసుకోవడం, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత విద్య కోసం డబ్బు సమకూర్చుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం పెర్‌పెట్యువల్‌ సిప్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఒక వేళ మీరు పెర్‌పెట్యువల్‌ సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫండ్‌ పనితీరు మీకు సంతృప్తికరంగా లేని పక్షంలో దానిని క్యా‍న్సిల్‌ చేసుకోవచ్చు. 


 



You may be interested

ఇక ఫ్లయిట్‌లోనూ మొబైల్‌ సర్వీసులు

Monday 17th December 2018

న్యూఢిల్లీ: ఇకపై విమాన ప్రయాణాలు, నౌకా ప్రయాణాల్లో కూడా మొబైల్ కాల్స్‌కు, ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశ విదేశ ఎయిర్‌లైన్స్‌, షిప్పింగ్ కంపెనీలు ఇక నుంచి ఇన్‌ఫ్లయిట్‌, మారిటైమ్ వాయిస్.. డేటా సర్వీసులు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం అవి దేశీ టెలికం సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇన్‌-ఫ్లయిట్ అండ్ మారిటైమ్‌ కనెక్టివిటీ

ఈ షేర్లపై కన్నేయండి..

Monday 17th December 2018

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.293 టార్గెట్ ధర: రూ.366 ఎందుకంటే: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 18 మిలియన్‌ టన్నులు.  మూడేళ్లలో  వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని  25 మిలియన్‌ టన్నులకు పెంచుకోవాలని కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం రూ.44,400 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ కంపెనీకి చెందిన 12 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల విజయనగర్‌ స్టీల్‌ ప్లాంట్‌ అన్ని

Most from this category