STOCKS

News


ఫండ్స్‌లో పెట్టుబడులను ఎప్పుడు తీసేసుకోవచ్చు?

Friday 28th December 2018
Markets_main1546021478.png-23294

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడిపై కేవలం మూడు నెలల్లోనే 20 శాతం రాబడి వచ్చింది... వెంటనే బుక్‌ చేసుకోవాలా? నెల క్రితం ఇన్వెస్ట్‌ చేస్తే దానిపై నష్టాలు చూపిస్తున్నాయి... అమ్మేసేస్తే పోదూ...? సాధారణంగా మ్యూచువల్‌ పండ్స్‌ ఇన్వెస్టర్లలో ఎక్కువ మందికి ఇవే తరహా సందేహాలు ఎదురవుతుంటాయి. దీంతో ఏదో ఒక సందర్భంలో వారు తోచినట్టు నిర్ణయాలను అమలు చేస్తుంటారు. కానీ, దీర్ఘకాలంలో సంపద పోగుబడాలంటే ఈ తరహా ఆలోచనలకు దూరంగా ఉండాలి. నిజానికి మ్యూచువల్‌ ఫండ్స్‌లో లాభాలు కనిపించినప్పుడల్లా, నష్టాలు వచ్చినప్పుడల్లా అమ్మేసే ఆలోచన సరైనది కాదు. ఎంత దీర్ఘకాలం పాటు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ కొనసాగిస్తే... రాబడులు అంత మెరుగ్గా, గణనీయంగా ఉంటాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. మరి మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను ఎప్పుడు తీసేసుకోవచ్చు? అంటే...

 

అత్యవసరాల్లో...
నిజానికి ప్రతీ ఒక్కరికీ ఆరు నెలల నుంచి ఏడాది అవసరాలకు సరిపడా బడ్జెట్‌ను అత్యవసర నిధిగా ఉంచుకోవడం ఎంతో అవసరమని నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. అయినా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోని వారు, వెంటనే డబ్బులు అవసరపడితే, ఇతర మార్గాల్లో అవసరాలు తీరే పరిస్థితి లేకపోతే, మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల ఉపసంహరణను పరిశీలించొచ్చు. 

 

ప్రణాళికకు అనుగుణంగా...
సెలవుల్లో విహార యాత్ర కోసం, ఓ కారు కొనుగోలు చేయాలన్న తలంపుతో లేదా ఓ ఇంటి నిర్మాణం కోసమని ఓ ప్రణాళిక పెట్టుకుని ఇన్వెస్ట్‌ చేస్తుంటే... లక్ష్యానికి చేరువైన వారు తమ పెట్టుబడులను వెనక్కి తీసేసుకోవచ్చు. అయితే, లక్ష్య వ్యవధికి ముందే కావాల్సినంత ఫండ్స్‌లో సమకూరిందనుకోండి... అప్పుడు ఈక్విటీ ఫండ్స్‌ నుంచి లిక్విడ్‌ ఫండ్స్‌లోకి మార్చుకోవాలి. అంతేకానీ, అసలు లక్ష్యానికి సమయం ఆసన్నం కాకముందే డబ్బులను వెనక్కి తీసేసుకుంటే, అవి దుబారా అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే, మీ పాప లేదా బాబు ఉన్నత విద్య కోసమని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటే... లక్ష్యానికి రెండేళ్ల ముందు నుంచే షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ లేదా లిక్విడ్‌ పండ్స్‌లోకి మళ్లడం మంచిది. 

 

పనితీరు బాలేకపోతే...
మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొన్ని అంశాల కారణంగా స్వల్పకాలం పాటు అస్థిరతలు ఉంటుంటాయి. ఆ సమయంలో వెనక్కి తీసుకోవడం సూచనీయం కాదు. రెండు నుంచి మూడేళ్ల పాటు అదే పనిగా మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న పథకం రాబడులు ఇవ్వకపోయినా, మార్కెట్‌తో పోలిస్తే రాబడుల్లో వెనుకబడినా దాన్నుంచి తప్పుకోవచ్చు. అయితే, ఏ సందర్భంలో అయినా ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసేసుకునేవారు... మూలధన లాభాలపై పన్ను, ఏడాది లోపు విక్రయిస్తే ఎగ్జిట్‌ లోడ్‌ వంటి భారాన్ని భరించాల్సి ఉంటుందని మర్చిపోవద్దు. 



You may be interested

85 శాతం స్టాక్స్‌లో ఈ ఏడాది నష్టాలే

Friday 28th December 2018

నష్టాల సంవత్సరంగా 2018 స్థిరపడిపోతుంది. ఎందుకంటే 85 శాతం స్టాక్స్‌ ఈ ఏడాది ప్రతికూల రాబడులు (నష్టాలు) ఇచ్చాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. చురుగ్గా ట్రేడయ్యే 2,371 స్టాక్స్‌లో 2,011 స్టాక్స్‌ నష్టాలనే మిగిల్చాయి. కొన్నింటిలో నష్టాలు నామమాత్రంగా ఉంటే, కొన్నింటిలో మోస్తరు, కొన్నింటిలో భారీగాను ఉన్నాయి. 90 శాతం వరకూ పతనమైన మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ పదుల సంఖ్యలో ఉన్నాయి.    గీతాంజలి జెమ్స్‌ ఇన్వెస్టర్లకు కన్నీరే మిగిలింది. నీరవ్‌మోదీ భారీ స్కామ్‌

రెండు రంగాలపై మోతీలాల్‌ఓస్వాల్‌ పాజిటివ్‌

Friday 28th December 2018

కొత్త సంవత్సరం పీఎస్‌యూ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ రంగాలపై పాజిటివ్‌గా ఉన్నట్లు మోతీలాల్‌ఓస్వాల్‌ ప్రతినిధి యోగేశ్‌ మెహతా చెప్పారు. ప్రభుత్వం మరోమారు పీఎస్‌బీలకు రీక్యాప్‌ సాయం అందిస్తోందని, దీంతో లిక్విడిటీ సమస్యలు గట్టెక్కుతాయని అభిప్రాయపడ్డారు. పీఎస్‌యూ బ్యాంకుల ఆస్తుల నాణ్యత సైతం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందన్నారు. వచ్చే రెండు మూడు త్రైమాసికాల్లో ఈ మెరుగుదల మరింత పెరుగుతుందన్నారు. ప్రస్తుతం చాలా బ్యాంకుల షేర్లు వాటి బుక్‌వాల్యూ కన్నా తక్కువ వాల్యూషన్ల వద్ద డిస్కౌంట్‌కు

Most from this category