STOCKS

News


మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎప్పుడు అమ్మాలి?

Wednesday 5th September 2018
personal-finance_main1536148275.png-19987

పెట్టుబడులు పెట్టేందుకు వందల సంఖ్యలో ఉన్న ఫండ్స్‌ నుంచి ఏ పథకాలను ఎంచుకోవాలన్నది క్లిష్టమైన పనే. చాలా మంది ఆన్‌లైన్‌ పోర్టళ్లు, రికమండేషన్ల ఆధారంగా అడుగులు వేస్తుంటారు. కొందరు అడ్వైజర్ల సూచనలు తీసుకుంటుంటారు. కానీ, కొనడం కంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ను విక్రయించడమే అతిపెద్ద టాస్క్‌ అంటున్నారు వ్యాల్యూ రీసెర్చ్‌ అధినేత ధీరేంద్ర కుమార్‌. ఎప్పుడు విక్రయించాలనే విషయమై పలు అంశాలను ఆయన ఇన్వెస్టర్లకు తెలియజేశారు. 

 

‘‘ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ విక్రయించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ, అవన్నీ మంచివేమీ కాదు. కొన్నింటికి మినహాయింపులు ఉన్నాయి. ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల విక్రయానికి మూడు కారణాలు పేర్కొంటారు. ఒకటి లాభాలు వచ్చాయని. రెండు నష్టాలు వచ్చాయని. మూడు లాభాలు కానీ, నష్టాలు కానీ రాలేదని. పెట్టిన పెట్టబడి వృద్ధి చెందింది, లాభాలు స్వీకరించాలా?... లేదా ఫలానా పథకంలో నష్టాలు వచ్చాయి విక్రయించాలా...? లేక పెట్టబడి పెట్టిన పథకంలో లాభాల్లేవు, నష్టాల్లేవు అమ్మేయాలా? అంటూ ప్రశ్నలు వేస్తుంటారు. మరి ఫండ్‌లో పెట్టుబడుల విక్రయానికి వీటిలో సరైన కారణం ఏంటంటే... ఏదీ కాదు. 

 

లాభాలు స్వీకరించాలన్న ధోరణి మొదటి కారణంలో కనిపిస్తుంది. కానీ, లాభాల స్వీకరణ అన్నది స్టాక్స్‌ విషయంలోనూ అర్థవంతం అనిపించుకోదు. అలాగే, మ్యూచువల్‌ ఫండ్స్‌ విషయంలోనూ ఇది సమంజసం కాదు. ఈ విధమైన ఆలోచనతో ఇన్వెస్టర్లు తమ దగ్గరుండే విజేతలను విక్రయిస్తారు. నష్ట కారకాలను అట్టిపెట్టుకుంటుంటారు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఏ స్టాక్స్‌ కొనుగోలు చేయాలి, ఏది అమ్మాలన్నది ఫండ్‌ మేనేజర్‌ నిర్ణయిస్తారు. ఈ బాధ్యతను ఫండ్‌ మేనేజర్‌ చక్కగా నిర్వహిస్తే మంచి రాబడులు వస్తాయి. మరి మంచి రాబడులను ఇస్తున్న ఫండ్‌ను అమ్మడం అన్నది, చేయాల్సిన దానికి విరుద్ధమైనది.  

 

ఇక రెండో కారణాన్ని చూస్తే... నష్టాల్లో ఉన్న వాటిని అమ్మడం అన్నది మంచి ఐడియా. ఎంత మేర నష్టాలు, ఎంత కాలం పాటు అన్నది పరిశీలించాలి. సాధారణంగా ఇన్వెస్టర్లు పనితీరులో మంచిగా ఉన్నవి విక్రయించి, నష్టాల్లో ఉన్న వాటిని కొనసాగిస్తుంటారు. ‘నా పథకం 25 శాతం రాబడులను ఇచ్చింది. వేరే ఐదు పథకాల్లో రాబడులు 30 శాతంగా ఉన్నాయి. వాటిల్లోకి మారిపోవాలా?’ అన్న ప్రశ్న ఎవరో ఒకరు అడుగుతుంటారు. కానీ, స్వల్ప కాల పనితీరు ఆధారంగా, భవిష్యత్తులో రాబడులు మెరుగుపడవు. ఏదైనా ఒక పథకం రెండు అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు నష్టాల్లో కొనసాగితే వాటి నుంచి బయటకు వచ్చేయాలి. 

 

ఎప్పుడు ఫండ్స్‌ పెట్టుబడులను విక్రయించాలన్న ప‍్రశ్నకు సరైన సమాధానం... తమ ఆర్థిక లక్ష్యాల ఆధారంగానే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. 10-15 ఏళ్ల కాలం కోసం ఇన్వెస్ట్‌ చేస్తే సిప్‌ను కొనసాగించాలి. మీ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడుల వృద్ధి ఉంటుంది. లక్ష్యానికి సమీపంలోకి వచ్చినప్పుడు మార్కెట్లతో సంబంధం లేకుండా పెట్టుబడులను వెనక్కి తీసేసుకోవాలి. మరీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటే తప్ప వాయిదా వేసుకోనక్కర్లేదు. పెట్టుబడులను ఉపసంహరించుకుని లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుకోవాలి’’ అని ధీరేంద్ర కుమార్‌ వివరించారు.You may be interested

స్మాల్‌ జెమ్స్‌ పట్టుకునే సరైన సమయం!

Wednesday 5th September 2018

స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ 2017లో కొత్త పుంతలు తొక్కాయి. రాబడులతో కిక్కెక్కించాయి. స్వల్ప కాలంలోనే విపరీతంగా ర్యాలీ చేస్తుండడంతో ఇన్వెస్టర్లు వాటికి ఆకర్షితులయ్యారు. 2018లో దృశ్యం తిరగబడింది. ఈ ఏడాది స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో చాలా స్టాక్స్‌ భారీ నష్టాల పాలు చేసినవే. కొన్ని కొద్ది మేర కోలుకోగా, ఇంకొన్ని కింద పడి లేచే శక్తి కోసం చూస్తున్న స్థితిలో ఉండిపోయాయి. ఈ పరిణామంతో చాలా మంది ఇన్వెస్టర్లు వీటికి దూరంగా

పిరమల్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌ సత్తా ఉన్న స్టాక్స్‌

Wednesday 5th September 2018

దీర్ఘకాల ఇన్వెస్టర్లకు పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పెట్టుబడులపై నష్టాలొచ్చే అవకాశం లేదని ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు, ఇండిపెండెంట్‌ అడ్వైజర్‌ వివేక్‌ మవానీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో అనలిస్టులకు పలు కంపెనీలు తమ భవిష్యత్తు ప్రణాళికలను దృశ్యరూపకంగా వివరించాయి. వాటిల్లో పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వృద్ధి అవకాశాలున్న స్టాక్స్‌ గురించి మవానీ తెలియజేశారు.    పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ భవిష్యత్తు వృద్ధి

Most from this category