STOCKS

News


టాప్‌ ఎంఎఫ్‌లు ఫిబ్రవరిలో ఏం చేశాయి?

Monday 11th March 2019
personal-finance_main1552298213.png-24533

ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి ఫిబ్రవరిలో నికర నిధుల ప్రవాహం గతేడాదితో పోలిస్తే 68 శాతం క్షీణించి రూ. 5122 కోట్లకు చేరాయి. దీంతో వరుసగా నాలుగో నెల సైతం ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి నిధులు తగ్గినట్లయింది. ప్రస్తుతం అన్ని ఎంఎఫ్‌ల ఏయూఎంల విలువ 23.16 లక్షల కోట్ల రూపాయలని ఏఎంఎఫ్‌ఐ డేటా వెల్లడించింది.

గత నెల టాప్‌ 5 ఎంఎఫ్‌లు వేటిని కొని, వేటిని విక్రయించాయో చూద్దాం..
1. హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌: ఈ ఫండ్‌ నిర్వహణలో 1.36 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఎక్కువగా ఫైనాన్షియల్స్‌, యుటిలిటీస్‌, ఇండస్ట్రీస్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. ఫిబ్రవరిలో ఎన్‌టీపీసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, కోల్‌ఇండియా, ఎస్‌బీఐ, ఆర్‌ఈసీ కంపెనీల్లో వాటాలను పెంచుకుంది. ఫెడరల్‌ బ్యాంక్‌, ఎన్‌హెచ్‌పీసీ, ఓఐఎల్‌, స్పెన్సర్‌, సీసీఐ కంపెనీల్లో వాటాలు తగ్గించుకుంది. ఆంబర్‌, డిష్‌టీవీ, జీఎంఆర్‌, జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌', కావేరీ సీడ్స్‌, పిరమల్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్స్‌లో పూర్తిగా వాటాలు వదిలించుకుంది.
2. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌: ఈ ఫండ్‌ నిర్వహణలో దాదాపు రూ. 1.20 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. ఫిబ్రవరిలో నాల్కో, ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఎస్‌బీఐ, బీఓబీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌హెచ్‌పీసీల్లో వాటాలు పెంచుకుంది. టెక్‌మహీంద్రా, సిప్లాలో వాటాలు తగ్గించుకుంది. సీఈఎస్‌సీ, స్పెన‍్సర్స్‌లో వాటాలు పూర్తిగా విక్రయించింది.
3. ఎస్‌బీఐ ఫండ్‌: ఫండ్‌ ఆధ్వర్యంలో రూ. 1.3 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. ఫిబ్రవరిలో ఎన్‌హెచ్‌పీసీ, ఇమామీ, టాటాపవర్‌, భెల్‌, యాక్సిస్‌బ్యాంక్‌, చాలెట్‌ హోటల్స్‌, ఐటీసీల్లో వాటాలు పెంచుకుంది. నాల్కో, అదానీ పోర్ట్స్‌', గృహ్‌ ఫైనాన్స్‌, వేదాంతల్లో వాటాలు తగ్గించుకుంది. 
4. ఆదిత్య బిర్లా ఏఎంసీ: ఫండ్‌ హౌస్‌ ఆధ్వర్యంలో రూ. 79.23 వేల కోట్ల ఆస్తులున్నాయి. ఫిబ్రవరిలో సంస్థ అహ్లువాలియా కాంట్రాక్ట్‌, బిర్లా సాఫ్ట్‌, చాలెట్‌ హోటల్స్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, దివిస్‌, హెక్సావేర్‌, ఐడీబీఐ, ఆర్‌ఈసీల్లో వాటాలను పెంచుకుంది. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, హెచ్‌ఏఎల్‌, జేకే బ్యాంక్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, సింటెక్స్‌, సన్‌టెక్‌ రియల్టీ, సుజ్లాన్‌ ఎనర్జీల్లో వాటాలు పూర్తిగా వదిలించుకుంది. ఐటీసీ, పీఎన్‌బీ, సౌత్‌ఇండియా బ్యాంకుల్లో వాటాలను తగ్గించుకుంది.
5. రిలయన్స్‌ నిప్పన్‌: ఫిబ్రవరిలో ఎంఎఫ్‌ కొత్తగా బలరామ్‌పూర్‌ చిని, గ్రాఫైట్‌ ఇండియా, వక్రంజీల్లో వాటాలు కొనుగోలు చేసింది. హాత్‌వే, జస్ట్‌డయిల్‌, కజారియా సిమెంట్‌, శ్రేయ్‌ ఇన్‌ఫ్రా, టాటా కమ్యూనికేషన్స్‌, టాటా ఎలక్సిల్లో వాటాలను పూర్తిగా విక్రయించింది. సెయిల్‌, చాలెట్‌ హోటల్స్‌, అశోక్‌లేలాండ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌, సన్‌ఫార్మా, ఎయిర్‌టెల్‌, కెనెరా బ్యాంక్‌ల్లో వాటాలు పెంచుకుంది. ఐఓసీ, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌ఫైనాన్స్‌ల్లో వాటాలను తగ్గించుకుంది. 



You may be interested

మార్కెట్‌ హైజంప్‌...6 నెలల గరిష్టం వద్ద ముగింపు

Monday 11th March 2019

దేశవ్యాప్తంగా మొదలైన ఎన్నికల సందడి స్టాక్‌ మార్కెట్‌లోనూ నెలకొంది. కేంద్రంలో తిరిగి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడవచ్చనే అంచనాలతో పాటు కీలక అవరోధ స్థాయిలను సూచీలు అధిగమించడంతో సూచీలు సోమవారం పరుగులు పెట్టాయి.  సెన్సెక్స్‌ 383 పాయింట్లు పెరిగి 37,054 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 141 పాయింట్లు లాభపడి 11,176 వద్ద స్థిరపడ్డాయి. ఇంతటి గరిష్టస్థాయిలో ముగియడం ఆరునెలల తర్వాత ఇదే ప్రధమం. రూపాయి బలపడటంతో ఒక్క ఐటీ షేర్లు మిగతా అన్ని

ఆల్‌టైంహైకి చేరువలో ఐసీఐసీఐ

Monday 11th March 2019

ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ సోమవారం జీవితకాల గరిష్టానికి చేరువలో ట్రేడ్‌ అవుతోంది. నేడు బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.370.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంజనీరింగ్‌, నిర్మాణ సంస పుంజ్‌ లాయిడ్‌ సంస్థ రూ.853.83 కోట్ల బకాయిలను చెల్లించటంలో విఫలమడంతో ఐసీఐసీఐ బ్యాంక్‌ దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. జస్టిస్‌ ఎంఎం కుమార్‌ సారథ్యంలోని ఇద్దరు సభ్యులతో కూడిన జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ప్రిన్సిపల్‌ బెంచ్‌..

Most from this category