STOCKS

News


ఈ పరిస్థితుల్లో ఎంఎఫ్‌ మదుపరులు ఏం చేయాలి?

Monday 24th September 2018
personal-finance_main1537778695.png-20524

కేవలం ఒక్క రోజులో యస్‌ బ్యాంక్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు భారీగా పతనమయి ఇన్వెస్టర్లను దెబ్బతీశాయి. రిటైల్‌ మదుపరులే కాకుండా పలు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ సైతం ఈ దెబ్బకు కుదేలయ్యాయి. యస్‌ బ్యాంక్‌, హౌసింగ్‌ఫైనాన్స్‌ కంపెనీలు(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఐబీ హౌసింగ్‌ తదితరాలు) శుక్రవారం దాదాపు 10- 60 శాతం మేర క్షీణించాయి. దీంతో పలు ఎంఎఫ్‌ల నికర ఆస్తుల విలువ(ఎన్‌ఏవీ) 2 శాతం వరకు పతనమైంది. కేవలం ఎంఎఫ్‌లే కాకుండా ఈపీఎఫ్‌ఓ ఈక్విటీ విభాగం సైతం ఈ పతనంతో నష్టం మూటకట్టుకుంది. ఎస్‌బీఐ, యూటీఐ ఈటీఎఫ్‌లతో ఈపీఎఫ్‌ఓ ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతుంటుంది.

హెచ్‌ఎఫ్‌సీ షేర్లు(హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు) ఈ స్థాయిలో పతనమయ్యేందుకు ఎలాంటి నిజమైన కారణంలేదని ఫండ్‌మేనేజర్లు చెబుతున్నారు. ఈక్విటీ ఎంఎఫ్‌ల్లో పెట్టుబడులున్న వాళ్లు ప్రస్తుతానికి ఎలాంటి భయాలకు లోనుకావద్దని సలహా ఇస్తున్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాలు మూటకట్టుకోవద్దని సలహా ఇస్తున్నారు. సరైన ఎంఎఫ్‌ పథకంలో పెట్టుబడులు పెట్టిఉంటే జంకు లేకుండా దీర్ఘకాలం వేచిచూడమని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను ఎలా తట్టుకోవాలో ఫండ్‌ మేనేజర్లకు తెలుసని, వాళ్లే సరైన మార్గంలో పెట్టుబడులను నడిపిస్తారని చెప్పారు. అయితే ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో అధిక పెట్టుబడులున్న ఎంఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు కొంత నష్టం భరించి బయటకు రావాలని, ఇతర ఎంఎఫ్‌లను ఎంచుకోవాలని కొందరి సలహా. ఎన్‌బీఎఫ్‌సీల్లో ఏర్పడిన బలహీనత మరికొంత కాలం కొనసాగవచ్చని వీరి అంచనా. 



You may be interested

220 షేర్లు - 52-వారాల కనిష్టానికి...

Monday 24th September 2018

ముంబై:- మార్కెట్‌ పతనం గంట గంటకు పెరుగుతోంది. మిడ్‌సెషన్‌ సమయానికి సెన్సెక్స్‌ 550 పాయింట్ల నష్టంతో 36,341 వద్ద, నిఫ్టీ 185 పాయింట్ల నష్టంతో 10955 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల, దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఎఫ్‌ఐఐల నిధుల ఉపసంహరణ, ఎన్‌బీఎఫ్‌సీ డెట్‌ సంక్షోభం, డాలర మారకంలో రూపాయి విలువ బలహీనపడటం...  తదితర కారణాలు సూచీల పతననానికి కారణవుతున్నాయి. మార్కెట్లో జరుగుతున్న అమ్మకాల

బేర్స్‌ పంజా..

Monday 24th September 2018

లాభాల్లో ప్రారంభమై నష్టాల్లో ముగిసే ట్రెండ్‌ను సోమవారం కూడా అనుసరిస్తోంది ఇండియన్‌ స్టాక్‌మార్కెట్‌.  సూచీలు బేర్స్‌ గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన ఇండెక్స్‌లు వెంటనే నష్టాల్లోకి వెళ్లిపోయాయి. సెన్సెక్స్‌ ఏకంగా 500 పాయింట్లు, నిఫ్టీ 175 పాయింట్లు పతనమయ్యాయి. మధ్యాహ్నాం 1:30 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 525 పాయింట్ల (1.43 శాతం) నష్టంతో 36,316 వద్ద, నిఫ్టీ 175 పాయింట్ల (1.57 శాతం) నష్టంతో 10.967 పాయింట్ల వద్ద

Most from this category