STOCKS

News


ఇంటర్వెల్‌ ఫండ్‌ అంటే?

Monday 18th March 2019
personal-finance_main1552892368.png-24662

ప్ర: నేను కొంత మొత్తాన్ని గత రెండేళ్ల నుంచి సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. కానీ ఈ ఫండ్‌ పనితీరు గత ఏడాది కాలంలో ఏమంత సంతృప్తికరంగా లేదు. ఈ ఫండ్‌ యూనిట్లన్నింటినీ విక్రయించి ఈ ఫండ్‌ నుంచి బైటపడాలా లేక కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆపేయాలా ? లేకుంటే సిప్‌లు కొనసాగించమంటారా? 
-ధీర, హైదరాబాద్‌ 
జ: ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ పనితీరును అంచనా వేసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి.  మార్కెట్‌ పనితీరుతో పోలిస్తే ఫండ్‌ తీరు ఎలా వుందనేది జాగ్రత్తగా అంచనా వేయాలి. ఉదాహరణకు మార్కెట్‌ పది శాతం పతనమై, మీ ఫండ్‌ 5 శాతమే నష్టపోయిందనుకుందాం. అప్పుడు ఈ ఫండ్‌ పనితీరు బాగున్నట్లు లెక్క. మీరు ఈ ఫండ్‌లో కొనసాగిన పక్షంలో స్వల్పకాలంలో నష్టాలు వచ్చినప్పటికీ, దీర్ఘకాలంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఒక వేళ మార్కెట్‌ పది శాతం పతనమై, మీ ఫండ్‌ 20 శాతం నష్టపోతే, అప్పుడు మీ ఫండ్‌ పనితీరు బాగాలేదని భావించవచ్చు. అయితే ఒక ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఫండ్‌ పనితీరును మదింపు చేయడం సరికాదు,  ఒక మార్కెట్‌ సైకిల్‌ కనీసం మూడు నుంచి ఐదేళ్లు ఉంటుంది. అందుకని కనీసం మూడేళ్ల పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పుడు నష్టపోయిన ఫండ్సే... మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు మంచి లాభాలు సాధించవచ్చు. 2017లో స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ 50 శాతం రాబడులనివ్వగా, మల్టీక్యాప్‌ ఫండ్స్‌ 35 శాతం మేర లాభాలనిచ్చాయి. 2018లో మాత్రం ఈ రెండు రకాల ఫండ్స్‌ చెరో 10 శాతం దాకా నష్టపోయాయి. అందుకని మీ ఫండ్‌ పనితీరు బాగా లేదా లేకుండా ఫండ్‌ విలువ పడిపోయిందా అన్న విషయమై సరైన మదింపు చేసి తగిన నిర్ణయాన్ని తీసుకోండి. 

ప్ర: వివిధ బ్యాంక్‌ల్లో మొత్తం రూ. కోటికి పైగా డిపాజిట్లు ఉన్నాయి. పన్ను ప్రయోజనాల నిమిత్తం ఈ మొత్తాన్ని ఆల్ట్రా-షార్ట్‌ డ్యురేషన్‌ డెట్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఈ ఫండ్స్‌కు చెందిన డివిడెండ్‌ ఆప్షన్‌లో ఇన్వెస్ట్‌ చేసి వచ్చే డివిడెండ్‌లను సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ సురక్షితంగానే ఉంటాయి కదా ! 
-జాన్సన్‌, సికింద్రాబాద్‌ 
జ: బ్యాంక్‌ల్లో ఉన్న రూ.కోటికి పైగా పెట్టుబడులను ఆల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ డెట్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం.. మంచి నిర్ణయమే. కానీ డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడమనేది సరైనది కాదు. డివిడెండ్‌లు ఇచ్చే డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల  అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు.  వచ్చే స్వల్ప లాభాలను డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ) తినేస్తుంది. అందుకని డివిడెండ్‌ ఆప్షన్‌కు బదులుగా గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి. ఈ గ్రోత్‌ ఆప్షన్‌లో వచ్చిన రాబడులను మాత్రమే ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఇలా ప్రతి నెలా ఎంతో కొంత మొత్తం ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మీకు పెట్టుబడుల రక్షణ కూడా లభిస్తుందని చెప్పవచ్చు. ఇలా గ్రోత్‌ ఆప్షన్‌ ఫండ్‌లో వచ్చిన రాబడులను ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మీ పెట్టుబడి స్థిరంగా ఉండే ప్రయోజనమూ మీకు లభిస్తుంది. మీరు కనుక అధిక ట్యాక్స్‌ బ్రాకెట్‌లో ఉంటే మీకు ఈ విధానం చాలా ప్రయోజనకరమని చెప్పవచ్చు. 

ప్ర: నేను ఇటీవలే ఐసీఐసీఐ ఇంటర్వెల్‌ ఫండ్‌ గురించి విన్నాను. ఇది 370 రోజుల ఇన్‌కమ్‌ ఫండ్‌ అని సదరు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ చెబుతోంది. అసలు ఇంటర్వెల్‌ ఫండ్‌ అంటే ఏమిటి ? ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే ఏమైనా ప్రయోజనాలుంటాయా ?
-ప్రసాద్‌, విశాఖపట్టణం 
జ: ఓపెన్‌ ఎండెడ్‌, క్లోజ్‌డ్‌ ఎండెడ్‌ ఫండ్స్‌ ఫీచర్లు కలగలపి డిజైన్‌ చేసిన ఫండ్‌గా ఇంటర్వెల్‌ ఫండ్‌ను చెప్పుకోవచ్చు. కొన్ని నిర్దేశిత సమయాల్లోనే ఈ ఫండ్‌ యూనిట్ల క్రయ, విక్రయాలు జరుగుతాయి. ఐసీఐసీఐ ఇంటర్వెల్‌ ఫండ్‌ విషయానికొస్తే, ప్రతి 370 రోజులకొకసారి మాత్రమే ఈ ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేయడమో, విక్రయించడమో చేయవచ్చు. అంటే మీరు ఈ ఫండ్‌ నుంచి వైదొలగడానికి పరిమిత అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఇది ఇన్‌కమ్‌ ఫండ్‌ కాబట్టి, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్ల పాటు ఈ ఫండ్‌లో కొనసాగిస్తేనే, మీ పెట్టుబడులపై వచ్చే లాభాలను  దీర్ఘకాల మూలధన లాభాలుగా పరిగణిస్తారు.  మీకు పన్ను పరంగా రాయితీ రేటు లభిస్తుంది. అలా కాకుండా మూడేళ్లలోపే మీ యూనిట్లను విక్రయించారనుకోండి. ఆ వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ లాభాలను మీకు మొత్తం ఆదాయానికి కలిపి పన్ను లెక్కిస్తారు. ఈ ఫండ్స్‌ తమ నిధులను ఈక్విటీ, డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. అయితే అధిక భాగాన్ని డెట్‌ సాధనాల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తాయి. వీటికి లిక్విడిటీ పూర్తిగా తక్కువ. రాబడులు కూడా తక్కువగానే ఉంటాయి. భారత్‌లో చాలా ఇంటర్వెల్‌ ఫండ్స్‌ ఐదేళ్ల వార్షిక రాబడి 6-8.5 శాతం రేంజ్‌లోనే ఉన్నాయి. 



You may be interested

సెన్సెక్స్‌ రికార్డుస్థాయికి చేరేముందు....

Monday 18th March 2019

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను లిక్విడిటీ ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత్‌కు సైతం హఠాత్తుగా విదేశీ నిధుల ప్రవాహం పెరిగింది. ఈ కారణంగా గతవారం పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ స్టాక్‌సూచీలు ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయికి కేవలం 3 శాతం దూరంలో వున్నాయి. మరోవైపు అటు విదేశీ, ఇటు స్వదేశీ ఫండ్స్‌ ఫెవరేట్‌ రంగమైన బ్యాంకింగ్‌ సూచి గతేడాది నెలకొల్పిన రికార్డుస్థాయిని అవలీలగా అధిగమించేసి, ఈ రోజుకారోజు కొత్త రికార్డుల్ని నెలకొల్పుతోంది. అమెరికా కేంద్ర

ఎఫ్‌ఐఐల పెట్టుబడులే కీలకం..

Monday 18th March 2019

-ఎఫ్‌ఐఐల పెట్టుబడులే కీలకం.. - మంగళ, బుధవారాల్లో అమెరికా ఫెడ్‌ సమావేశం - వడ్డీ రేట్లపై ప్రకటన, ఆర్థిక అంచనాల వెల్లడి - బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీఓఈ) వడ్డీ రేట్ల నిర్ణయం కూడా ఈవారంలోనే.. - మంగళవారం దేశీ క్యూ3 కరెంట్‌ ఖాతా లోటు ప్రకటన - ఈ అంశాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్న ఎఫ్‌ఐఐలు - హోలీ సందర్భంగా 21న (గురువారం) మార్కెట్లకు సెలవు ముంబై: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) భారత స్టాక్‌ మార్కెట్లలో

Most from this category