STOCKS

News


జనవరిలో టాప్‌ ఎంఎఫ్‌ల అమ్మకాలు, కొనుగోళ్లు..

Tuesday 12th February 2019
personal-finance_main1549960390.png-24157

గత నెల దేశీయ ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి రెండేళ్లలో కనిష్ఠ నిధుల ప్రవాహం కనిపించింది. గతనెలతో పోలిస్తే 7 శాతం తక్కువగా రూ. 6160 కోట్లు ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి వచ్చాయి. మార్కెట్లో ప్రస్తుత డైలమా మరికొంత కాలం కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో టాప్‌ 3 మ్యూచువల్‌ ఫండ్స్‌ జనవరిలో ఏం కొన్నాయి? ఏం విక్రయించాయి? చూద్దాం..
1.  హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌:  వివిధ స్టాకుల్లో 1.2 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. అత్యధికంగా 32 శాతానికి మించిన పెట్టుబడులు ఫైనాన్షియల్‌ రంగంలో ఉన్నాయి. జనవరిలో స్పెన్సర్‌ రిటైల్‌, యూబీఐ, ఐటీసీ, ఇమామి, ఎన్‌టీపీసీ, ఛాలెట్‌ హోటల్‌ కౌంటర్లలో కొనుగోళ్లు జరిపింది. కేపీఐటీ టెక్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌హెచ్‌పీసీ కౌంటర్లలో విక్రయాలు జరిపింది. 

2. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్‌: వివిధ స్టాకుల్లో 1.2 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. అత్యధికంగా 26 శాతానికి మించిన పెట్టుబడులు ఫైనాన్షియల్‌ రంగంలో ఉన్నాయి. జనవరిలో స్పెన్సర్‌ రిటైల్‌, ఓఎన్‌జీసీ, సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌, ఐఓఎల్‌, ప్రుడెన్షియల్‌ ఐసీఐసీఐ ఇన్‌ఫ్రా ఫండ్‌ కౌంటర్లలో కొనుగోళ్లు జరిపింది. ఎస్‌బీఐ, గెయిల్‌, పవర్‌గ్రిడ్‌ కౌంటర్లలో విక్రయాలు జరిపింది. 
3. ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌: వివిధ స్టాకుల్లో 1.3 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. అత్యధికంగా 35 శాతానికి మించిన పెట్టుబడులు ఫైనాన్షియల్‌ రంగంలో ఉన్నాయి. జనవరిలో ఐటీసీ, భెల్‌, యాక్సిస్‌బ్యాంక్‌, సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌, గాయత్రి బయోఆర్గానిక్స్‌ కౌంటర్లలో కొనుగోళ్లు జరిపింది. నాల్కో, బీపీసీఎల్‌, సెయిల్‌, జిందాల్‌స్టీల్‌, ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లలో విక్రయాలు జరిపింది. 

 



You may be interested

మెటల్‌ షేర్ల ర్యాలీ

Tuesday 12th February 2019

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌ షేర్ల ర్యాలీ మార్కెట్‌ పతనానికి అడ్డుగా నిలుస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 3శాతం ర్యాలీ చేసింది. మెటల్‌ షేర్లలో అత్యధికంగా జిందాల్‌ స్టీల్‌ 9శాతం ర్యాలీ చేసింది. సెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందూస్థాన్‌ కాపర్‌, టాటాస్టీల్‌ షేర్లు 5శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. అలాగే వేదాంత, జేఎస్‌ఎల్‌హిస్సార్‌, వెల్‌స్పాన్‌కార్పోరేషన్‌, ఎన్‌ఎండీసీ షేర్లు

రూపాయి ర్యాలీ: నష్టాల్లో ఐటీ షేర్లు

Tuesday 12th February 2019

డాలర్‌ మారకంలో రూపాయి బలపడటంతో మంగళవారం ఐటీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల తగ్గుదల ప్రభావంతో దేశీయ కరెన్సీ గతఆరు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి లాభ పడుతోంది. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో 71.17 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన రూపాయి క్రమంగా పుంజుకుంటూ 21పైసలు బలపడింది. రూపాయి ర్యాలీతో డాలర్ల మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ రంగానికి

Most from this category