STOCKS

News


టాప్‌ ఎంఎఫ్‌లు ఏం కొన్నాయి?

Thursday 13th December 2018
personal-finance_main1544686262.png-22895

దేశీయ ఈక్విటీలు నవంబర్‌లో కాస్త కోలుకున్నాయి. నిఫ్టీ ఈ నెల్లో దాదాపు 5 శాతం లాభపడింది. గత నెలతో పోలిస్తే ఈ నెల్లో దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నిధుల ప్రవాహం మెరుగైంది. నవంబర్‌లో రూ.1.4 లక్షల కోట్లు ఎంఎఫ్‌ల్లోకి వచ్చాయి. అయితే  గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈక్విటీ, ఈక్విటీలింక్డ్‌ ఎంఎఫ్‌ల్లోకి నిధుల ప్రవాహం మందగించింది. నవంబర్‌లో ఎంఎఫ్‌ల మొత్తం అసెట్స్‌ విలువ 8 శాతం పెరిగి 24 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇందులో ఈక్విటీ అసెట్స్‌ వాటా సుమారు 33 శాతం. 
నవంబర్‌ నెలలో టాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోళ్లు, అమ్మకాలు ఇలా ఉన్నాయి.
1. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్‌: 635 స్టాకుల్లో 1.1 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. అత్యధికంగా 26 శాతానికి మించిన పెట్టుబడులు ఫైనాన్షియల్‌ రంగంలో ఉన్నాయి. నవంబర్‌లో కోల్‌ఇండియా, ఎయిర్‌టెల్‌; హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌బ్యాంకు షేర్లను ఎక్కువగా కొనుగోలు చేసింది. ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంకు, సిప్లా షేర్లను ఎక్కువగా విక్రయించింది. కొత్త కౌంటర్లలో కొనుగోళ్లు, అమ్మకాలు ఏమీ చేపట్టలేదు.


 

 

 

 

 

 

 

 

 

 

2. హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌:  382 స్టాకుల్లో 1.25 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. అత్యధికంగా 31 శాతానికి మించిన పెట్టుబడులు ఫైనాన్షియల్‌ రంగంలో ఉన్నాయి. నవంబర్‌లో కోల్‌ఇండియా, ఆర్‌ఎఫ్‌సీ, పీఎఫ్‌సీ, టీసీఎస్‌; ఒరాకిల్‌ షేర్లను ఎక్కువగా కొనుగోలు చేసింది. ఎన్‌టీపీసీ, వేదాంత, ఆర్‌ఐఎల్‌, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లను ఎక్కువగా విక్రయించింది. కొత్తగా థైరోకేర్‌, భారత్‌ఫోర్జ్‌, అపోలో హాస్పిటల్స్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, డీసీబీ బ్యాంకు షేర్లను కొనుగోలు చేసింది. 


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

3. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఎంఎఫ్‌: 504 స్టాకుల్లో 75వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. అత్యధికంగా 31 శాతానికి మించిన పెట్టుబడులు ఫైనాన్షియల్‌ రంగంలో ఉన్నాయి. నవంబర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్ఐఎల్‌; ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఎంఅండ్‌ఎం షేర్లను ఎక్కువగా కొనుగోలు చేసింది. దాల్మియా భారతి, ఎల్‌అండ్‌టీ, యస్‌బ్యాంకు, హెచ్‌పీసీఎల్‌, మారుతీ షేర్లను ఎక్కువగా విక్రయించింది. కొత్తగా ఆర్‌కామ్‌, సిండికేట్‌ బ్యాంకు, భెల్‌ షేర్లను కొనుగోలు చేసింది. 



You may be interested

లోక్‌సభ ఎన్నికల ముందు...కొనుగోళ్లకు అవకాశం

Thursday 13th December 2018

సార్వత్రిక ఎన్నికలకు ఐదారు నెలల ముందు మార్కెట్‌లో కొనుగోలుకు మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఈక్విటీ అడ్వైజర్‌ హెడ్‌ దేవాంగ్‌ మెహతా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఒక్క విషయమైతే స్పష్టంగా తెలుస్తోంది. మార్కెట్లు అస్థిరతను కోరుకోవడం లేదు. గత రెండు రోజులను గమనిస్తే ఈ విషయం అర్ధమౌతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మార్కెట్‌లో చాలా

వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో...

Thursday 13th December 2018

బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త గవర్నర్‌ శక్తికాంత్‌ వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో గురువారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఈ నవంబవర్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం 2.33శాతం, ప్రతి ద్రవ్యోల్బణం 5.73శాతం నమోదైంది. అలాగే ఏప్రిల్‌ పాలసీ సమావేశంలో పావుశాతానికి మించి వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చు. కొత్త గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ రాక నిధుల కొరతతో కొట్టిమిట్టాడుతున్న బ్యాంకులకు మూలధన సాయంపై కూడా ఆశలు చిగురింపజేసిందని మార్కెట్‌ విశ్లేషకలంటున్నారు. పీఎస్‌యూ

Most from this category