STOCKS

News


గడువులోపు రిటర్నులు ఫైల్‌ చేయకపోతే...?

Thursday 30th August 2018
personal-finance_main1535569722.png-19769

గడువులోపు ఆదాయపన్ను రిటర్నులు ఫైల్‌ చేయకపోతే, ఆ తర్వాత ఇక చేయవద్దన్న అభిప్రాయంతో చాలా మంది ఉంటుంటారు. కానీ, ఈ గడువు అన్నది పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా అనుసరించాలి. లేకపోతే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయన్నది తెలుసుకుందాం.

 

ఆఖరి తేదీ

గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపన్ను రిటర్నులను ఏటా జూలై ఆఖరుకు దాఖలు చేయాలి. ఈ ఏడాది ఇది ఆగస్ట్‌ 31 వరకు పొడిగించారు. ఇది సాధారణ విభాగం(వేతన జీవులు అందరూ)లోని వారికి ఉద్దేశించిన గడువు. ఏదైనా వ్యాపారం లేదా వృత్తిలో ఉన్న వారు అయితే ఖాతాలు ట్యాక్స్‌ ఆడిట్‌ చేయాల్సి ఉంటుంది కనుక రిటర్నుల దాఖలు గడువు సెప్టెంబర్‌ 30వరకు పొడిగించారు. ధరల బదిలీ నిబంధన పరిధిలోని వ్యాపారులకు నవంబర్‌ 30 వరకు గడువు ఉంది.

 

ఫైల్‌ చేయకపోతే?

ఆగస్ట్‌ 31లోపు వేతన జీవులు రిటర్నులు ఫైల్‌ చేయడంలో విఫలమైతే, వచ్చే ఏడాది మార్చి 31 వరకు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అవకాశం ఉండదు. అప్పటికీ రిటర్నులు ఫైల్‌ చేయకపోతే, వ్యాపారంలో లేదా మూలధన లాభాల పరంగా నష్టాలు ఉంటే, వాటిని తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునే అవకాశం కోల్పోతారు. నష్టాలను బదిలీ చేసుకుంటే తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో వ్యాపార లాభాలు, మూలధన లాభాల నుంచి సర్దుబాటు చేసుకుని పన్ను భారం తగ్గించుకోవచ్చు. ట్యాక్స్‌ రిఫండ్‌కు అర్హులై ఉంటే, ఆలస్యం చేసిన కాలానికి వడ్డీ నష్టపోవాల్సి ఉంటుంది. టీడీఎస్‌ చెల్లించి ఉండి లేదా మొత్తం పన్నులో కొంత అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించి ఉన్న వారు ఆలస్యం చేసిన కాలానికి చెల్లించాల్సిన పన్ను మొత్తంపై పీనల్‌ ఇంటరెస్ట్‌ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఆగస్ట్‌ 31 తర్వాత వచ్చే ఏడాది మార్చి ముగిసేలోపు రిటర్నులు దాఖలు చేసే వారు లేట్‌ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లేటు ఫీజు అన్నది ఎప్పుడు రిటర్నులు ఫైల్‌ చేశారు, మీ ఆదాయం ఎంత అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆగస్ట్‌ 31 తర్వాత డిసెంబర్‌ 31లోపు రిటర్నులు దాఖలు చేశారనుకుంటే ఆలస్యపు ఫీజు కింద తప్పనిసరిగా రూ.5,000 చెల్లించాలి. డిసెంబర్‌ 31లోపు కూడా ఫైల్‌ చేయకుండా ఇంకా ఆలస్యం చేస్తే ఈ మొత్తం రూ.10,000కు పెరుగుతుంది. అయితే, వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉన్న వారికి వెసులుబాటు ఉంది. ఈ ఆదాయ కేటగిరీలోని వారు రూ.1,000 ఆలస్యపు ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది.

 

2019 మార్చి కూడా దాటితే..?

2017-18 ఆర్థిక సంవత్సరం రిటర్నులు 2019 మార్చి నాటికి కూడా దాఖలు చేయకపోతే, దీని గురించి ఆదాయపన్ను శాఖకు తెలుస్తుంది. దీంతో పన్ను అధికారులు సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయంలో 50 శాతాన్ని లెవీగా విధించే అవకాశం ఉంది. రిటర్నులు దాఖలు చేయని వారు వాస్తవంగా చెల్లించాల్సిన పన్ను రూ.3,000కు పైన ఉంటే అప్పుడు ఆదాయపన్ను శాఖ విచారణ కూడా చేపట్టొచ్చు. ఎగవేసిన పన్ను మొత్తాన్ని బట్టి రెండు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఈ సమస్యలను నివారించేందుకు గడువులోపు రిటర్నులు దాఖలు చేయడం మంచిది.You may be interested

ఈ స్టాక్స్‌కు నిఫ్టీలో చేరే చాన్స్‌

Thursday 30th August 2018

నిఫ్టీ50 ఇండెక్స్‌లోకి ఇటీవలి కాలంలో కొత్త షేర్లు చోటు దక్కించుకుంటున్నాయి. త్వరలోనే జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ వచ్చి చేరనుంది. లుపిన్‌ స్థానంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను నిఫ్టీ50లోకి చేరుస్తున్నట్టు ఆగస్ట్‌ 28న ఎన్‌ఎస్‌ఈ ప్రకటన చేసింది. 2012-13 నుంచి 2017-18 వరకు 25 స్టాక్స్‌ను నిఫ్టీ ఇండెక్స్‌లో మార్చడం జరిగింది. ఏషియన్‌ పెయింట్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, లుపిన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌లు 2013 ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీలో చేరగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, యునైటెడ్‌

ఈఎల్‌ఎస్‌ఎస్‌, యులిప్‌లో పన్ను ఆదాకు ఏది ఉత్తమం?

Thursday 30th August 2018

పన్ను ఆదా చేసే పెట్టుబడి సాధనాల విషయంలో చాలా మందిలో సందేహాలు ఉంటుంటాయి. ఈక్విటీల్లో పెట్టుబడులకు వీలు కల్పించే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌), యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ (యులిప్‌) వీటిలో ఏది మెరుగు? అన్న ప్రశ్న ఎదురైతే... అందుకు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ రెండు పథకాలకు కొన్ని సారూప్యాలు, కొన్ని విభేదాలూ ఉన్నాయి. ఈ రెండూ పన్ను ఆదాకు అర్హమైనవే. రెండింటికీ లాకిన్‌

Most from this category