STOCKS

News


జూలైలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ కొన్న షేర్లివే..!

Saturday 25th August 2018
personal-finance_main1535194713.png-19647

ముంబై:- ప్రపంచదేశాల మధ్య వాణిజ్య వివాదాలు, చమురు ధరల పెరుగుదల కారణాలతో జూలైలో స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర అస్థిరతను ఎదుర్కోంది. ఫలితంగా ఈక్విటీ మ్యూచువల్‌ పండ్స్‌లోకి నిధుల ప్రవాహం వరుసగా మూడో నెల తగ్గుముఖం పట్టింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు ఈ జూలైలో రూ.10.45 లక్షల కోట్లకు చేరినట్లు ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసర్చ్‌తెలిపింది.  జూలై నెలలో సిప్‌(ఎస్‌ఐపీ) పెట్టుబడులు రూ. 7,554 కోట్లకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీ మ్యూచువల్‌ పండ్స్‌ జూలైలో ఏ కంపెనీల షేర్లను కొనుగోలు చేసాయో చూద్దాం..!
వాటాలు పెంచుకున్న కంపెనీలు
టాప్‌-5 లార్జ్‌ క్యాప్‌ కంపెనీలు:-
బజాజ్‌ అటో, హావెల్స్‌ ఇండియా, లుపిన్‌, ఆర్‌బీఎల్‌, డాబర్‌ ఇండియా కంపెనీల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తమ వాటాను 9.3శాతం నుంచి 16.8శాతానికి పెంచుకున్నాయి.
టాప్‌-5 మిడ్‌క్యాప్‌:-
ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌, ఇమామి, కజారియా సిరామిక్స్‌, అపోలో హాస్పిటల్స్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ల్లో  ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తమ వాటాను11శాతం నుంచి 69శాతానికి పెంచుకున్నాయి.
టాప్‌-5 స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు:-
రైట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అపోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, ఫైన్‌ ఆర్గానిక్స్‌, అదానీ పవర్‌కంపెనీల్లో  ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తమ వాటాను 114 శాతం నుంచి 594శాతానికి పెంచుకున్నాయి.



You may be interested

ఈఎంఐ డిఫాల్టయితే ఇంతే సంగతులు

Saturday 25th August 2018

క్రెడిట్‌ స్కోర్‌పై భారీ నెగిటివ్‌ ప్రభావం లోన్‌, క్రెడిట్‌ తీసుకున్న కస్టమర్లు తప్పనిసరిగా తమ నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్లను క్రమం తప్పక చెల్లించాలని క్లియర్‌స్కోర్‌ సీఈఓ జస్టిన్‌ బాసిన్‌ సూచించారు. నెలవారీ పేమెంట్స్‌(ఈఎంఐ) మిస్‌ చేస్తే క్రెడిట్‌ స్కోర్‌పై భారీగా నెగిటివ్‌ ప్రభావం ఉంటుందన్నారు. క్రెడిట్‌ యుటిలైజేషన్‌ నిష్పత్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలని ఆయన సూచించారు. వేతనం పెరగకపోయినా, ఒకదాని వెంట మరో లోన్‌ తీసుకుంటూ పోతున్నా, క్రెడిట్‌ కార్డు లిమిట్‌లో ఎక్కువ భాగాన్ని

తుఫాను ముందు నిశ్శబ్దం?

Saturday 25th August 2018

పొంచి ఉన్న భారీ పతనం  అప్రమత్తతే ఆయుధం ఈక్విటీ మార్కెట్లో భారీ కరెక‌్షన్‌ పొంచిఉన్న సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ సమయంలోనైనా నిఫ్టీ ధబేలున కుప్పకూలవచ్చని అంచనా వేస్తున్నారు. కరెక‌్షన్‌ చూపడానికి ముందు మార్కెట్లు ఐదైనా బహిర్గత కారణాన్ని ఎంచుకుంటాయి. అలాంటి కారణం ఇప్పటికి ఇంకా కనిపించనప్పటికీ, కరెక‌్షన్‌కు రెడీగా ఉన్న సిగ్నల్స్‌ మాత్రం బలంగా ఉన్నాయి. ముఖ్యంగా చిన్న స్టాకుల సూచీలు ప్రధాన సూచీలతో పాటు ర్యాలీ చేయడానికి

Most from this category