STOCKS

News


ప్రస్తుత మార్కెట్లో ఫండ్‌ మేనేజర్ల వ్యూహం...?

Tuesday 5th March 2019
personal-finance_main1551725091.png-24426

ఆల్ఫా జనరేషన్‌ (మార్కెట్లతో పోలిస్తే మెరుగైన రాబడులు) కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌, పీఎంఎస్‌ మేనేజర్లు ఈ సమయలో ఏం చేస్తున్నట్టు? ఈ సందేహం సగటు ఇన్వెస్టర్లకు ఎదురుకావడం సహజమే. అయితే, సాధారణ ఇన్వెస్టర్ల మాదిరే గత 14 నెలలుగా ఫండ్‌ మేనేజర్లు సైతం రాబడుల విషయంలో తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగాల్లో అమ్మకాల ఒరవడి, కీలక సూచీల పనితీరు సానుకూలంగా లేకపోవడం దీని వెనుక కారణాలు. గడిచిన ఏడాది కాలంలో ఫండ్స్‌ పనితీరు 20 శాతం వరకు పడిపోయింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు ఇప్పటికీ అనిశ్చిత పరిస్థితుల మధ్యే ట్రేడవుతున్నాయి. దీనిపై ఫండ్‌ మేనేజర్ల అభిప్రాయాలను పరిశీలిస్తే...

 

ఫండ్‌ మేనేజర్ల విధానం...
‘‘మా విధానం దీర్ఘకాలానికి ఒకటే. కంపెనీలు, ఆయా రంగాలను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యాపారాల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తాం. వ్యాపారాలను చక్కగా నిర్వహిస్తూ, వాటాదారులతో పారదర్శకంగా వ్యవహరించే వ్యాపారాలపైనే విశ్వాసం ఉంచుతాం. అదే సమయంలో దీర్ఘకాలానికి ఆయా కంపెనీలు వ్యాపార పరంగా వృద్ధి చెందే విధంగా ఉండాలి. సహేతుక ధరల్లో ఉన్న వాటికే మా పోర్ట్‌ఫోలియోలో చోటు. లేదంటే నగదుతోనే ఉంటాం. విదేశాల్లోనూ ఇన్వెస్ట్‌ చేస్తాం. ఫండ్‌ పథకం మొదలైన దగ్గర్నుంచి ఈ విధానాన్నే అనుసరిస్తున్నాం’’ అని పీపీఎఫ్‌ఏఎస్‌ రీసెర్చ్‌ హెడ్‌ రౌనక్‌ఆంకార్‌ తెలిపారు. స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ సగటున గత ఏడాది కాలంలో 19.76 శాతం నష్టపోయాయి. మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ సగటున 11 శాతం,, మల్టీక్యాప్‌ ఫండ్స్‌ సగటున 5 శాతం నష్టాలపాలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 5 శాతం, లార్జ్‌క్యాప్‌ ఈక్విటీ ఫండ్స్‌ 1.24 శాతం నష్టపోయాయి. 

 

‘‘ఫండ్‌ మేనేజర్లు తమ పొజిషన్లతోనే కొనసాగుతున్నారు. అదే సమయంలో నాణ్యమైన స్టాక్స్‌లో అవకాశాల కోసం పోర్ట్‌ఫోలియోను మదింపు వేస్తున్నారు’’ అని ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయూర్‌జోషి తెలిపారు. క్యూ3కి సంబంధించిన కార్పొరేట్‌ ఫలితాలు నిరాశపరిచగా, జీడీపీ వృద్ధి మందగమనంతో కీలక రంగాల పనితీరు ఆశాజనకంగా లేని విషయం గమనార్హం. ‘‘ఓ శ్రేణికి లోబడిన మార్కెట్లో ఉన్నాం. మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగుపడితే ముందుగా లాభపడేవి లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌. కనుక ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్‌ను పరిశీలించాలి’’ అని మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ పోర్ట్‌ఫోలియో స్ట్రాటజిస్ట్‌ (ఈక్విటీ) వి. బాలసుబ్రమణియన్‌ తెలిపారు. కన్జ్యూమర్‌ రంగం ఇక ముందూ మంచి పనితీరు చూపిస్తుందని, ఇటీవలి బడ్జెట్‌ వినియోగదారునికి అనకూలంగా ఉందని పీఎంఎప్‌ ఆపరేటర్‌ మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ వ్యవస్థాపకుడు సౌరభ్‌ ముఖర్జియా తెలిపారు. వ్యాపార మూలాలు బలంగా ఉన్న మిడ్‌, స్మా్ల్‌క్యాప్‌ కంపెనీలు రానున్న కాలంలో మంచి పనితీరు చూపిస్తాయన్నారు.You may be interested

నష్టాల ప్రారంభానికి సంకేతాలు

Tuesday 5th March 2019

 అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు ఇండియాకు వాణిజ్య ప్రాధాన్యాన్ని తొలగించి, 5.7 బిలియన్‌ డాలర్ల దిగుమతులపై సుంకాలు విధిస్తామంటూ ట్రంప్‌ చేసిన హెచ్చరిక, ఇండోపాక్‌ ఉద్రిక్తతల నడుమ భారత్‌ సూచీలు మంగళవారం  నెగిటివ్‌గా ప్రారభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 80  పాయింట్లకుపైగా క్షీణించింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30  గంటలకు 10,835 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ

ఈక్విటీలతోనే అధిక సంపద!

Tuesday 5th March 2019

ఎంతో మంది ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. కానీ, సూక్ష్మ అంశాలపై అవగాహన పెద్దగా కనిపించదు. భవిష్యత్తు లక్ష్యాలైన పిల్లల విద్య, వివాహాలు, ఇల్లు, రిటైర్మెంట్‌ తదితర అవసరాల కోసం ఇన్వెస్ట్‌ చేసే వారు కొందరే ఉంటారు. అందులోనూ పెట్టుబడుల విలువను తినేసే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అవగాహన చేసుకునే వారు బహు కొద్ది మంది. చాలా మంది ఇన్వెస్ట్‌ చేసినా గానీ లక్ష్యాలను చేరుకోవడానికి దూరండా ఉండిపోవడం వెనుక కారణం ఇదే అయి

Most from this category