STOCKS

News


మార్చిలో ఎంఎఫ్‌ల అమ్మకాలు, కొనుగోళ్లు..

Friday 12th April 2019
personal-finance_main1555064186.png-25097

ఫిబ్రవరిలో పేలవ నిధుల ప్రవాహం చవిచూసిన మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి మార్చిలో మరలా సాధారణ స్థాయిలో నిధులు వచ్చాయి. ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి మార్చిలో రూ. 9014 కోట్ల నిధులు వచ్చాయి. గతేడాది అక్టోబర్‌ తర్వాత ఈ స్థాయిలో ఎంఎఫ్‌ల్లోకి నిధులు రావడం ఇదే తొలిసారి. దీంతో పాటు ఈక్విటీ ఏయూఎంల్లో సైతం ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో 10 శాతం పెరుగుదల కనిపించింది. మార్చిలో ఈక్విటీ ఏయూఎంల విలువ రూ. 9.76 లక్షల కోట్లకు చేరింది. ఈ నెల్లో సూచీలు భారీగా ర్యాలీ జరపడం కూడా ఎంఎఫ్‌ల ఏయూఎంలు పెరిగేందుకు దోహదం చేసింది. మార్చిలో మొత్తం ఎంఎఫ్‌ల ఏయూఎంల విలువ రూ. 23.80 లక్షల కోట్లుంది. ఫిబ్రవరితో పోలిస్తే ఇది దాదాపు 3 శాతం అధికం. మరోవైపు ఈక్విటీలో కొనుగోళ్లు జరిపిన ఎంఎఫ్‌లు సెకండరీ మార్కెట్లో నికర విక్రేతలుగా మారాయి. మార్చిలో ఎంఎఫ్‌లు సెకండరీ మార్కెట్‌ నుంచి రూ. 7665 కోట్ల విక్రయాలు జరిపాయి.
మార్చిలో ఎంఎఫ్‌లు కొనుగోలు చేసిన టాప్‌ స్టాకులు
ఎన్నికల సందిగ్ధత కారణంగా ఎంఎఫ్‌లు ఎక్కువగా వాల్యూ స్టాకులను, ఫైనాన్షియల్‌, టెక్స్‌టైల్‌, నిర్మాణ, హెల్త్‌కేర్‌, ఎనర్జీ, సిమెంట్‌, కెమికల్స్‌ రంగాల షేర్లను కొనుగోలు చేసాయి.


మార్చిలో ఎంఎఫ్‌లు విక్రయించిన టాప్‌ స్టాకులు
బలహీన సీజన్‌ నేపథ్యంలో ఎంఎఫ్‌లు ఐటీ, ఆటో రంగాల షేర్లతో పాటు బాగా ర్యాలీ జరిపిన ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐషర్‌, బీపీసీఎల్‌, టైటాన్‌ షేర్లను విక్రయించాయి. 



You may be interested

మార్కెట్‌ను గట్టిక్కించిన మిడ్‌సెషన్‌ కొనుగోళ్లు

Friday 12th April 2019

మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ శుక్రవారం లాభంతో ముగిసింది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 160 పాయింట్ల లాభంతో 38767 వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 11,643 వద్ద స్థిరపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం లాభపడి 29,938 వద్ద స్థిరపడింది. ప్రపంచమార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ నేడు లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 85 పాయింట్ల లాభంతో 38,692 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు

ఎన్నికల ఏడాది ఏవి మంచిది?

Friday 12th April 2019

లార్జ్‌క్యాప్స్‌ వర్సెస్‌ మిడ్‌క్యాప్స్‌ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో? స్థిర ప్రభుత్వం వస్తుందో రాదోనని మార్కెట్లలో ఎడతెగని చర్చలు నడుస్తుంటాయి. మరోపక్క ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్స్‌ మంచివా? మిడ్‌క్యాప్స్‌ మంచివా? అని రిటైలర్లు తెగ ఎంక్వైరీలు చేస్తుంటారు. గతేడాది రెండంకెల మేర నష్టాలను మూటకట్టుకున్న చిన్న, మధ్యతరహా స్టాకులను టచ్‌ చేయాలంటే చాలామంది ఇన్వెస్టర్లు భయపడుతుంటారు. లిక్విడిటీ సమస్యలు, ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభాలతో గతేడాది చిన్న స్టాకుల సూచీలు భారీ నష్టాలను అందించాయి.

Most from this category