STOCKS

News


పన్ను ఆదా కోసం... ఈ ఐదు ఫండ్స్‌

Friday 28th December 2018
personal-finance_main1545936613.png-23268

మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారి ముందున్న మెరుగైన సాధనాల్లో ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) కూడా ఒకటి. సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపునకు ఈఎల్‌ఎస్‌ఎస్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలంటూ వెల్త్‌ మేనేజర్లు ఎక్కువగా సూచిస్తుంటారు. ఎందుకంటే పన్ను ఆదా కోసం ఉపయోగపడే సాధనాల్లో తక్కువ లాకిన్‌ పీరియడ్‌ మూడేళ్లు కలిగి ఉన్న ఏకైక సాధనం ఈఎల్‌ఎస్‌ఎస్‌. పైగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే పథకం. దాంతో పన్ను ఆదాతోపాటు, ద్రవ్యోల్బణాన్ని అధిగమించి దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను పొందే అవకాశం ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పన్ను వర్తించే ఆదాయంపై అవగాహనకు వచ్చి, ప్రతీ నెలా సిప్‌ రూపంలో ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచి నిర్ణయం. అయితే, కొంత మందికి ఇది సాధ్యపడకపోవచ్చు. దాంతో వారు ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. మరి ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఏ పథకాలు పనితీరు పరంగా మెరుగ్గా ఉన్నాయని పరిశీలిస్తే...  

 

మిరే అస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌
మూడేళ్ల క్రితమే ఈ పథకం ఆరంభమైంది. అయినప్పటికీ మూడేళ్ల కాలంలో పనితీరు పరంగా ఈ విభాగంలో మెరుగైన పథకంగా నిలవడం గమనార్హం. ఏటా 18 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. మల్టీక్యాప్‌ విధానాన్ని పెట్టుబడులకు అనుసరిస్తుంది. నాణ్యమైన వ్యాపారం కలిగిన కంపెనీల్లో, షేరు ధరలు సరసమైన స్థాయిలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెడుతుంది. లార్జ్‌క్యాప్‌కు 73 శాతం పెట్టబడులు కేటాయించింది. మిడ్‌క్యాప్‌లో 21, స్మాల్‌క్యాప్‌లో 5 శాతానికి పైగా ఎక్స్‌పోజర్‌ తీసుకుంది. పోర్ట్‌ఫోలియోలో రిలయన్స్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ మెరుగైన రాబడులకు తోడ్పడ్డాయి. 

 

మోతీలాల్‌ ఓస్వాల్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ
నాణ్యమైన కంపెనీల షేర్ల ధరలు సరసమైన స్థాయిల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌ చేయడం ఈ పథకం కూడా అనుసరించే విధానం. మల్టీక్యాప్‌ విధానంలో అధిక వృద్ధికి అవకాశాశాలు ఉన్న కంపెలనే ఎంచుకుంటుంది. ఎక్కువ మొత్తంలో లార్జ్‌క్యాప్‌లో పెట్టుబడులు పెడుతుంది. టాప్‌ 5 స్టాక్స్‌లో పెట్టుబడులే 35 శాతంగా ఉన్నాయి. ఈ పథకం మూడేళ్ల రాబడులు వార్షికంగా 13.79 శాతం చొప్పున ఉన్నాయి.

 

ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ట్యాక్స్‌ రిలీఫ్‌ 96
మల్టీక్యాప్‌ విధానంలోనే ఈ పథకం కూడా ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌వైపు మొగ్గుచూపే పథకాల్లో ఇది కూడా ఒకటి. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో 60 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. మిగిలిన 40 శాతం లార్జ్‌క్యాప్‌నకు కేటాయించింది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం మీద 40-50 స్టాక్స్‌ను నిర్వహిస్తుంటుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగినది. గత 13 సంవత్సరాలుగా ఒకే ఫండ్‌ మేనేజర్‌ ఈ పథకానికి సారథ్యం వహిస్తున్నారు. మూడేళ్లలో వార్షిక రాబడులు 12 శాతంగా ఉన్నాయి. 

 

యాక్సిస్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌
ఆస్తుల నిర్వహణ పరంగా ఇది అతిపెద్ద ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకం. వృద్ధి ఆధారిత స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ప్రధానంగా బ్లూచిప్‌ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. విస్తరించే వ్యాపారం, అధిక రాబడులు, స్థిరమైన వృద్ధి అవకాశాలను చూసి ఫండ్‌ మేనేజర్లు ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. గత ఏడాది కాలంలో ఫైనాన్షియల్స్‌, ఆటోమొబైల్స్‌ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఎఫ్‌ఎంసీజీకి ప్రాధాన్యం తగ్గించింది. ఈ పథకం రాబడులు మూడేళ్ల కాలంలో వార్షికంగా 12 శాతంగా ఉన్నాయి.

 

ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్‌ ప్లాన్‌
పన్ను ఆదా కోసం చూసే, రిస్క్‌ తక్కువ కోరుకునే వారికి అనువైన పథకం. ఈ పథకం 60 శాతం లార్జ్‌క్యాప్‌స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. 40 శాతాన్ని మిడ్‌, స్మాల్‌క్యాప్‌నకు కేటాయిస్తుంది. అయితే, మిడ్‌క్యాప్‌ విలువలు పెరగడంతో గత ఏడాదిలో లార్జ్‌క్యాప్‌లో ఎక్స్‌పోజర్‌ పెంచుకుంది. ఫైనాన్షియల్స్‌, ఎనర్జీ, ఆటో స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇచ్చింది.You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 28th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌:- కంపెనీ చెందిన రూ.21వేల కోట్ల విలువైన ధీర్ఘకాలిక బ్యాంకు రుణానికి కేర్‌ రేటింగ్‌ సంస్థ ఎఎ(స్థిరత్వం) రేటింగ్‌ను కేటాయించింది. యూనైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- ఫ్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ క్యాపిటల్‌ రూపంలో రూ.2159 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. కన్సాయ్‌ నెరోలాక్‌ పెయింట్స్‌:- షేర్‌ పర్చే‍‍జ్‌ అగ్రిమెంట్‌ పద్ధతిలో ఫెర్మా కన్‌స్ట్రక్చన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 100శాతం

మీ పెట్టుబడి రెట్టింపు కావాలా... వెరీ సింపుల్‌!

Friday 28th December 2018

స్టాక్‌ మార్కెట్లో తమ పెట్టుబడి రెట్టింపు కావాలన్నదే ఎక్కువ మంది ఇన్వెస్టర్ల ఆకాంక్షగా కనిపిస్తుంది. తక్కువ వ్యవధిలోనే తమ పెట్టుబడి రెండింతలు కావాలన్న దృష్టితోనే స్టాక్స్‌ కొనుగోలు చేస్తుంటారు. కానీ, కొన్న తర్వాత ఆ స్టాక్‌ గమనం అనుకున్న విధంగా లేకపోయినా, రివర్స్‌లో నష్టపోతున్నా నిర్ణయాలు సరిగ్గా ఉండవు. దాంతో రెట్టింపు లాభం సంగతి దేవుడు ఎరుగు, అసలు లాభం బుక్‌ చేసుకునే వారు కొద్ది మందే ఉంటారు. ఈ

Most from this category