STOCKS

News


2018లో శభాష్‌ అనిపించిన ఫండ్స్‌ ఇవే

Monday 24th December 2018
personal-finance_main1545674925.png-23206

ఈ ఏడాది ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు అంత ఆశాజనకంగా లేదనే చెప్పుకోవాలి. స్థానిక, అంతర్జాతీయ అంశాలతో మార్కెట్లు అస్థిరతల మధ్యే చలించాయి. అందుకే ఈ ఏడాది ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో చక్కని పనితీరు చూపించిన పథకం ఇచ్చిన రాబడులు కేవలం 5.8 శాతంగానే ఉన్నాయి. ఓ బాండ్‌లో వచ్చే రాబడి కంటే ఇది తక్కువ. అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం, చమురు ధరల పెరుగుదల, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలకు దిగడం, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సమస్య ఏర్పడడం తదితర అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. 

 

టాప్‌
ఈ ఏడాది ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకాల్లో చక్కని పనితీరు చూపించింది యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌. 5.8 శాతం రాబడులను ఇచ్చింది. ఈ పథకం నిర్వహణలో ఉన్న ఆస్తులు రూ.3,295 కోట్లు. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్‌ 3.2 శాతం రాబడులను ఇచ్చింది. ఈ పథకం నిర్వహణలో ఉన్న ఆస్తులు రూ.1,056 కోట్లు. యూటీఐ ఈక్విటీ ఫండ్‌ 3 శాతం రాబడులను ఇచ్చింది. ఈ పథకం కింద రూ.8,345 కోట్ల ఆస్తులు ఉన్నాయి. యాక్సిస్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌ 2.4 శాతం రాబడులను ఇచ్చింది. ఈ పథకం నిర్వహణలో ఉన్న ఆస్తులు రూ.17,626 కోట్లు. యాక్సిస్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ 2.4 శాతం రాబడులను ఇచ్చింది. ఈ పథకం కింద రూ.1,693 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 

 

బోటమ్‌
సుందరం స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ ఈ ఏడాది 29.4 శాతం నష్టాలను ఇచ్చింది. ఈ పథకం నిర్వహణలో రూ.1,042 కోట్ల ఆస్తులు ఉన్నాయి. హెచ్‌ఎస్‌బీసీ స్మాల్‌క్యాప్‌ ఈక్విటీ ఫండ్‌ 26 శాతం పడిపోయింది. ఈ పథకం నిర్వహణలోని ఆస్తులు రూ.744 కోట్లు. డీఎస్‌పీ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ 25 శాతం నష్టాలను మిగిల్చింది. ఈ పథకం కింద రూ.4,881 కోట్ల ఆస్తులు నిర్వహణలో ఉన్నాయి. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ప్యూర్‌ వ్యాల్యూ ఫండ్‌ 24 శాతం నష్టపోయింది. ఈ పథకం నిర్వహణలోని ఆస్తుల మొత్తం రూ.4,071 కోట్లు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ 23.6 శాతం నష్టపోయింది. ఈ పథకం కింద రూ.2,108 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.



You may be interested

ఐపీవోకు దరఖాస్తు చేసుకున్న శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌

Monday 24th December 2018

రియల్‌ ఎస్టేట్‌ సంస్థ  శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ సెబీ వద్ద ఐపీవో ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఈ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ.1,250 కోట్లను సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం. రూ.250 కోట్ల విలువ మేర తాజా షేర్లను ఈ ఐపీవోలో భాగంగా ఆఫర్‌ చేస్తారు. వీటికి తోడు ప్రస్తుత వాటాదారులు టాటా క్యాపిటల్‌ ఫైనాన్స్ సర్వీస్‌, టీపీజీ ఏషియాలు కలసి తమకున్న వాటాల నుంచి 4,24,03,271 షేర్లను విక్రయించనున్నాయి.

ఆటో ఇండెక్స్‌ డౌన్‌

Monday 24th December 2018

హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ అటో షేర్ల పతనంతో సోమవారం అటో షేర్లు నష్టాలతో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేడు 1.50శాతం నష్టపోయి 9,206.75 వద్ద ముగిసింది.  నేడు ఎన్‌ఎస్‌ఈలోని టాప్‌ -5 లూజర్లలో హీరోమోటోకార్ప్‌, బజాజ్‌ అటో షేర్లు చోటు దక్కించుకోవడం గమనార్హం. ఇండెక్స్‌లోని మొత్తం 11 షేర్లలో 8 షేర్లు నష్టాలతో ముగియగా, 3 షేర్లు మాత్రం లాభాల్లో ముగిశాయి.

Most from this category