News


గృహ రుణం ముందే తీరిస్తే లాభమేనా ?  

Monday 1st October 2018
personal-finance_main1538372671.png-20743

ప్ర: నేను ఏడాది క్రితం డీఎస్‌పీ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌లో రూ. 2 లక్షలు ఇన్వెస్ట్‌ చేశాను. ఇతర స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌తో పోల్చితే ఈ ఫండ్‌ పనితీరు బాగా లేదు. ఈ ఫండ్‌ నుంచి మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకొని కెనరా రెబొకో లేదా రిలయన్స్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. లేదంటే  డీఎస్‌పీ స్మాల్‌ క్యాప్‌ఫండ్‌ నుంచి వెనక్కి తీసుకున్న మొత్తాన్ని రెండు సమాన భాగాలుగా చేసి, ఈ రెండు ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమం‍టారా ? ఈ విషయమై తగిన సలహా ఇవ్వండి. 
-రంజాన్‌, విశాఖపట్టణం 
జ: డీఎస్‌పీ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ గతంలో మైక్రో ఫండ్‌గా మంచి పనితీరు కనబరిచింది. గత ఏడాది కాలంలో ఈ ఫండ్‌ పనితీరు బాగా లేదంటున్నారు. కానీ ఒక స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ పనితీరును అంచనా వేయడానికి ఏడాది కాలం సరైన ప్రాతిపదిక కాదు. అసలు ఒకటి లేదా రెండేళ్ల పనితీరును బట్టి స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ పనితీరును అంచనా వేయకూడదు.  ఎలాంటి అంతరాయాలు లేకుండా కనీసం ఐదేళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటేనే స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలే.. అంటే.. ఏడాది, రెండేళ్ల కాలంలో పనితీరు అంతంతమాత్రంగానే ఉండటం, అశించిన స్థాయిలో రాబడులు ఇవ్వలేకపోవడం వంటి సమస్యలే ఉంటాయి. వీటన్నింటికీ సిద్ధపడే స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. మరోవైపు మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న కెనరా రొబొకో లేదా రిలయన్స్‌ స్మాల్‌ క్యాప్‌ వంటి ఫండ్స్‌కు ఇలాంటి సమస్యలే ఉండొచ్చు. పైగా గతంలో ఈ రెండు ఫండ్స్‌ ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నాయి. ఏ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌కైనా ఇలాంటి ఇబ్బందులు తప్పవు. అందుకని ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో వచ్చే ఇలాంటి సమస్యలను, ఒడిదుడుకులను మీరు తట్టుకోలేకపోతే, ఈ ఫండ్‌ నుంచి వైదొలగండి. మంచి బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ను ఎంచుకోండి. పనితీరుతో పనిలేకుండా కనీసం మూడేళ్ల పాటు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. 


ప్ర: నేను గృహరుణం తీసుకొని ఇల్లు కొనుక్కున్నాను. ఈ గృహరుణంపై వడ్డీ రేట్లు 8.9 శాతంగా ఉంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో నాకు కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉన్నాయి. ఈ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ద్వారా గృహ రుణాన్ని ముందుగానే తీర్చివేయాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ?
-కిరణ్‌, ఖమ్మం 
జ: మీ నిర్ణయం దాదాపు సరైనది కాదు అనుకుంటున్నాను. దీర్ఘకాలం(కనీసం 8-10 ఏళ్లు మ్యూచువల్‌ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్‌ చేయగలిగితే) దృష్ట్యా చూస్తే, మీ నిర్ణయం ఒక్క శాతం కూడా కరెక్ట్‌ కాదు. మీకు నెలవారీ వచ్చే క్రమబద్ధమైన ఆదాయం ద్వారా మీరు గృహ రుణాన్ని చెల్లించడంలో ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు గృహ రుణాన్ని ముందుగానే చెల్లించాలన్న ఆలోచనను మానేయండి. అన్ని రుణాలతో(వ్యక్తిగత, వాహన, క్రెడిట్‌ కార్డ్‌ తదితర) పోల్చితే ఒక వ్యక్తి  తక్కువ వడ్డీకి తీసుకోదగ్గ ఏకైక రుణం.. గృహ రుణమే. ఈ రుణం ద్వారా ఒక ఆస్తిని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా, ఆ ఆస్తి విలువ కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది. మీరు కనుక ఆ ఇంట్లో నివసిస్తున్నట్లయితే, ఇది నా సొంత ఇల్లు, ఇది నా కష్టార్జితంతో సంపాదించుకున్న ఇల్లు అన్న భావనకు మించినది మరేదీ ఉండదు. మీ గృహరుణం కాలపరిమితి ఐదేళ్లకు మించి ఉన్నప్పుడు, గృహ రుణాన్ని ముందస్తుగానే చెల్లించడం సరైనది కాదు. పైగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే, ఇప్పుడు వచ్చే రాబడుల కంటే అధికంగానే రాబడులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. 

ప్ర: నేను లాయర్‌గా పనిచేస్తున్నాను. పన్ను ప్రయోజనాల కోసం నేను పీపీఎఫ్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌(ఈక్విటీ లింక్డ్‌  సేవింగ్స్‌ స్కీమ్స్‌)ల్లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంది. దేంట్లో ఎంతెంత ఇన్వెస్ట్‌ చేస్తే బాగుంటుంది ? ఇక ఈఎల్‌ఎస్‌ఎస్‌ల విషయానికొస్తే, ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కన్నా, రెండు ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది కదా ! 
-జగన్నాధ్‌ నండూరి, హైదరాబాద్‌ 
జ: దీర్ఘకాలం పాటు చూస్తే, ఈక్విటీ మంచి రాబడులనిచ్చే అసెట్‌ అని చెప్పవచ్చు. సంపద సృష్టి విషయంలో ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్‌) కన్నా, ఈఎల్‌ఎస్‌ఎస్‌(ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌) చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. స్వల్ప కాలంలో ఈక్విటీ ఫండ్స్‌లో నష్టభయం ఎక్కువ. పైగా ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. ఒక్కోసారి నష్టాలు రావచ్చు కూడా. ఐదేళ్లు, అంతకు మించిన కాలానికి మంచి రాబడులనే ఇస్తాయి. ఇక పీపీఎఫ్‌ విషయానికొస్తే, వీటి రాబడులు గ్యారంటీగా ఉంటాయి. అంటే మనం ఎంత ఇన్వెస్ట్‌ చేస్తే, ఎంత మొత్తం రాబడులు వస్తాయో ముందుగానే మనకు ఒక అంచనా ఉంటుంది. అయితే ద్రవ్యో‍ల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, పీపీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌  పెద్దగా చెప్పుకోదగిన రాబడులను ఇవ్వలేవని చెప్పవచ్చు. మీరు రెండు ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఇలా ఇన్వెస్ట్‌ చేస్తే, మీరు డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందవచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో  ఇన్వెస్ట్‌మెంట్స్‌కు లాక్‌-ఇన్‌ పీరియడ్‌ మూడేళ్లుగా ఉంటుంది. మూడేళ్ల లాక్‌-ఇన్‌ పీరియడ్‌ ఉన్న ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు డైవర్సిఫికేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే మీరు రెండు ఫండ్స్‌ను ఎంచుకోవాలి. You may be interested

పెన్షన్‌ కోసం... ఎల్‌ఐసీ జీవన్‌శాంతి!

Monday 1st October 2018

లేటు వయసులో నికరంగా నెలవారీ పెన్షన్‌ అందుకోవాలనుకునే వారి కోసం జీవిత బీమా రంగ సంస్థ ఎల్‌ఐసీ... ‘జీవన్‌ శాంతి’ పేరిట సరికొత్త పెన్షన్‌ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. దీన్లో పెన్షన్‌ నిమిత్తం ఒకేసారి ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలా పెట్టిన పెట్టుబడిని బట్టే పెన్షన్‌ ఎంత వస్తుందనేది ఆధారపడి ఉంటుంది. పెన్షన్‌ ఏ వయసు నుంచీ కావాలనుకుంటున్నారన్నది కూడా ఇందులో ముఖ్యమే. కాస్త ముందు నుంచే పెన్షన్‌

36,060-35,985 మద్దతు శ్రేణి కీలకం

Monday 1st October 2018

అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌ మొదలైన తర్వాత అమెరికాతో సహా ప్రపంచ మార్కెట్లన్నింటినీ తలదన్ని పెరిగిన భారత్‌ మార్కెట్‌...ప్రస్తుతం ఇతర మార్కెట్లు కోలుకునే ప్రయత్నం చేస్తుంటే. మన సూచీలు పడిపోతున్నాయి. దేశీయ బాండ్ల మార్కెట్లో కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల బాండ్లను ఫండ్స్‌ తెగనమ్మడం, ప్రభుత్వం ప్రకటించిన చర్యలు రూపాయి రికవరీకి సహకరించకపోవడం వంటి అంశాలు స్థానిక మార్కెట్‌ను దెబ్బతీసినట్లు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో మరో రెండు వారాల్లో ద్వితీయ త్రైమాసిక ఫలితాల వెల్లడి

Most from this category