STOCKS

News


2018 ‘పన్ను’ జ్ఞాపకాలు

Sunday 23rd December 2018
personal-finance_main1545587720.png-23179

పన్ను ఆదా కోసం పెట్టుబడుల ప్రణాళికలు రచించుకునే వారు, ఈ ఏడాది పన్నుల పరంగా ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను తప్పుక పరిగణనలోకి తీసుకోవాలి. అవేంటంటే...

 

ప్రామాణిక తగ్గింపు
పన్ను శ్లాబుల్లో మార్పులేమీ లేవు. అయితే, వేతన జీవులకు స్థూల వేతనంలో ప్రామాణిక తగ్గింపు రూ.40,000ను తిరిగి ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దీన్ని ఫైనాన్స్‌ యాక్ట్‌ 2005లో రద్దు చేశారు. ప్రామాణిక తగ్గింపు అన్నది ఇంతకుముందు ఉన్న ప్రతీ నెలా రూ.1,600 ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్స్‌, ఏటా రూ.15,000 మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ స్థానంలో అమలవుతుంది. 

 

ఎన్‌పీఎస్‌ ఆకర్షణీయం
ఎన్‌పీఎస్‌ పథకం నుంచి రిటైర్మెంట్‌ సమయంలో ఉపసహరించుకునే 60 శాతం మొత్తంపైనా పన్ను మినహాయింపు కల్పించడం మరో కీలక నిర్ణయం. ఇప్పటి వరకు 40 శాతం ఉపసంహరణపైనే పన్ను మినహాయింపు ఉంది. 40 శాతాన్ని పెన్షన్‌ యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయడం తప్పనిసరి. మిగిలిన 20 శాతంపై పన్ను వర్తిస్తుండగా, ఇకపై ఈ పన్ను బాధ ఉండదు. 

 

ఎల్‌టీసీజీ
స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ)ను తిరిగి ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌, షేర్లు కొని ఏడాది దాటిన అనంతరం విక్రయించిన సందర్భాల్లో లాభం రూ.లక్ష దాటితే ఒక ఆర్థిక సంవత్సరంలో 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లాభానికి ద్రవ్యోల్బణ ప్రభావం మినహాయింపు కూడా కల్పించలేదు. 

 

సీనియర్‌ సిటిజన్లకు పన్ను ఊరట
60 ఏళ్లు దాటిన వృద్ధులకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం 50,000 వరకు పన్ను చెల్లించాల్సిన పని లేకుండా చేసింది కేంద్రం. దీంతో వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ అమలుకు పరిమితిని కూడా రూ.50,000 చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పరిమితి రూ.10,000. అలాగే, ఆరోగ్య బీమా కోసం వార్షికంగా రూ.50,000 ప్రీమియం చెల్లింపునకూ పన్ను మినహాయింపు పొందొచ్చు. గతంలో ఇది రూ.30,000గానే ఉంది. ఇక ఎంపిక చేసిన వైద్య చికిత్సల (కేన్సర్‌, మూత్ర పిండాల వైఫల్యం, రక్త సంబంధిత సమస్యలు తదితర) కోసం చేసే వ్యయాలు రూ.60,000కే పన్ను మినహాయింపు ఉండగా, దీన్ని రూ.లక్షకు పెంచడం జరిగింది.



You may be interested

స్వల్ప లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Monday 24th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:49 సమయంలో 9 పాయింట్ల లాభంతో 10,769 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,767 పాయింట్లతో పోలిస్తే 2 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

మంచి ఫండ్‌ కాదు... సరిపడే ఫండ్‌ ఎంపిక

Sunday 23rd December 2018

ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ పండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నప్పుడు... ఏ పథకంలో తాను ఇన్వెస్ట్‌ చేయాలని ప్రశ్నిస్తుంటారు. అంటే మంచి పథకం ఏదో తెలుసుకుని అందులో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటారు. కానీ, ఇది తప్పుడు ప్రశ్న అని వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ సీఈవో ధీరేంద్ర కుమార్‌ అంటున్నారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం లభించడం కష్టమంటున్నారు. దీనికి బదులు ఏ తరహా పథకంలో తాను ఇన్వెస్ట్‌ చేయాలన్నది సరైన ప్రశ్నగా ఆయన సూచించారు.     ‘‘మీ

Most from this category