STOCKS

News


40 మంది డెవలపర్లకు టీ–రెరా నోటీసులు

Saturday 17th November 2018
personal-finance_main1542433707.png-22135

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) కొరడా ఝళిపించింది. టీ–రెరాలో నమోదు చేయకుండా ప్రాజెక్ట్‌ను అడ్వటయిజింగ్‌ చేసిన 40 మంది డెవలపర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20 తేదీలోపు వివరణ ఇవ్వాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని టీ–రెరా సెక్రటరీ కే విద్యాధర్‌ రావు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు.
నోటీసులు జారీ చేసిన 40 మంది డెవలపర్లలో ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రమోటర్లు కూడా ఉన్నట్లు సమాచారం. టీ–రెరాలో నమోదు చేయకుండా ప్రచారం చేయడమే కాకుండా విక్రయాలు కూడా జరిపినట్లు తెలిసింది. రెరాలో నమోదు చేయకుండా ప్రచారం చేసినా లేదా విక్రయించినా సరే సెక్షన్‌ 59 ప్రకారం.. ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం జరిమానా ఉంటుంది. అథారిటీకి సరైన వివరణ ఇవ్వకపోయినా లేదా అప్పటికీ రిజిస్టర్‌ చేయకపోయినా రెరా అథారిటీ సంబంధిత డెవలపర్‌కు మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా ప్రాజెక్ట్‌ వ్యయంలో 20 శాతం జరిమానా విధిస్తుంది.
రెరా జరిమానాలు, శిక్షలివే..
ప్రమోటర్లకు: 
– రెరా అథారిటీ ఆర్డర్లను ఉల్లంఘిస్తే.. సెక్షన్‌ 59 ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం జరిమానా.
– ప్రాజెక్ట్‌ లేదా అమ్మకాలకు సంబంధించిన తప్పుడు సమాచారం అందిస్తే.. సెక్షన్‌ 60 ప్రకారం ప్రాజెక్ట్‌ వ్యయంలో 5 శాతం జరిమానా.
ఏజెంట్లకు:
– నమోదు కాకుండా ఫ్లాట్లు/ప్లాట్లను విక్రయిస్తే.. సెక్షన్‌ 65 ప్రకారం విక్రయించిన ప్రాజెక్ట్‌ వ్యయంలో 5 శాతం జరిమానా.
– అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే.. సెక్షన్‌ 62 ప్రకారం ఏడాది పాటు జైలు శిక్ష లేదా ప్రతి రోజు రూ.10 వేలు, గరిష్టంగా ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం జరిమానా.
––––––
ఇంకా 14 రోజులే..
టీ–రెరాలో ప్రాజెక్ట్‌ల నమోదు గడువు ఈనెల 30తో ముగస్తుంది. అంటే ఇంకా 14 రోజులే మిగిలి ఉంది. రెరా గడువును పొడిగించే ప్రసక్తే లేదని, డిసెంబర్‌ 1 నుంచి ప్రాజెక్ట్‌లను నమోదు చేయని నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ చేసి సెక్షన్‌ 59 ప్రకారం ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం జరిమానా విధిస్తామని విద్యాధర్‌ రావు తెలిపారు. ఇప్పటివరకు టీ–రెరాలో 1,200 మంది ఏజెంట్లు, డెవలపర్లు రిజిస్టరయ్యారు. సుమారు 600ల ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి.
– 2017, జనవరి 1 తర్వాత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, టీఎస్‌ఐఐసీ, మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్ల కంటే ఎక్కువుండే ప్రతి ప్రాజెక్టూ రెరాలో నమోదు తప్పనిసరి. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గతేడాది జనవరి 1 తర్వాత ఆయా విభాగాల నుంచి సుమారు 5 వేల ప్రాజెక్ట్‌లను అనుమతి పొందాయి. కానీ, ఇప్పటివరకు కేవలం 600 ప్రాజెక్ట్‌లే నమోదవ్వటం గమనార్హం.
 



You may be interested

50 వేల చ.మీ. ప్రాజెక్ట్‌కు ఈసీ అక్కర్లేదు!

Saturday 17th November 2018

 సాక్షి, హైదరాబాద్‌: దేశీయ నిర్మాణ రంగానికి కాసింత ఉపశమనం లభించింది. 20 వేల చ.మీ. నుంచి 50 వేల చ.మీ. బిల్టప్‌ ఏరియాలో నిర్మించే నివాస ప్రాజెక్ట్‌లకు ఎన్విరాన్‌మెంటల్‌æ క్లియరెన్స్‌ (ఈసీ) స్థానిక మున్సిపల్‌ శాఖలోనే తీసుకునే వీలుంది. 20 వేల చ.మీ. నుంచి 1.50 లక్షల చ.మీ. బిల్టప్‌ ఏరియాలో నిర్మించే పారిశ్రామిక షెడ్లు, ఆసుపత్రులు, హోటల్స్‌ వంటి వాణిజ్య ప్రాజెక్ట్‌లకైతే (కేటగిరీ–బీ) కూడా స్థానికంగానే తీసుకునేలా కేంద్రం నిబంధనలను

కోలం, పొన్ను, చిట్టి ముత్యాలు!

Saturday 17th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కిరాణా సరుకులను కూడా ఆన్‌లైన్‌లో కొనే రోజులివి. కానీ ఏ గ్రాసరీ స్టార్టప్స్‌లోనైనా ఉప్పులు, పప్పుల వంటి వాటిల్లో లభ్యమయ్యేన్ని బ్రాండ్లు బియ్యంలో దొరకవు! ఇది చూశాక హైదరాబాద్‌కు చెందిన విక్రమ్‌ చక్రవర్తి... బియ్యాన్ని మాత్రమే విక్రయించే  ‘ఓన్లీ రైస్‌.కామ్‌’ను ప్రారంభించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... ప్రస్తుతం మేం కోలం, పొన్ను, జై శ్రీరామ్, చిట్టి ముత్యాలు, సోనా మసూరీ, సాంబ మసూరీ, ఇడ్లీ రైస్,

Most from this category