News


ఫండ్స్‌కు స్టాప్‌-లాస్‌ వర్తిస్తుందా ?

Monday 15th October 2018
personal-finance_main1539583383.png-21157

ప్ర: స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే ఫలితాలు బాగా ఉంటాయని పలు పర్సనల్‌ ఫైనాన్స్‌ వెబ్‌సైట్‌లు పేర్కొంటున్నాయి.  స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ చాలా రిస్క్‌ అని తెలుసు. అయినప్పటికీ ఈ ఫండ్స్‌లో పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు నేను తీసుకోవలసిన జాగ్రత్తలేంటి ? 
-శ్రీధర్‌, కాకినాడ 
జ: స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కొంచెం రిస్క్‌తో కూడుకున్నదే.మార్కెట్‌ ప్రతికూల పరిస్థితుల్లో మీరు ఇన్వెస్ట్‌ చేసిన దాంట్లో 50-70 శాతం వరకూ కోల్పోయినా ఆశ్చర్యం లేదు. ఉదాహరణకు ఈ ఫండ్స్‌లో మీరు రూ.లక్ష వరకూ ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. మార్కెట్‌ బాగా లేని పరిస్థితుల్లో ఈ విలువ రూ.30,000కు పడిపోవచ్చు. అలాంటప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. ఈ ఫండ్స్‌ల్లో సిప్‌ విధానంలోనే ఇన్వెస్ట్‌ చేయడం శ్రేయస్కరం. మార్కెట్‌ పతనమైనప్పుడు కూడా సిప్‌లను ఆపేయకుండా, కొనసాగించండి. ధైర్యే సాహసే లక్ష్మి అంటూ సిప్‌లను ఎలాంటి శంకలు లేకుండా కొనసాగించండి.  రిస్క్‌ అధికంగానే ఉన్నా దీర్ఘకాలంలో ఈ ఫండ్స్‌ మంచి రాబడులే ఇస్తాయి. 

ప్ర: స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసే షేర్లకు స్టాప్‌-లాస్‌, లాభాల స్వీకరణ ఉంటాయి కదా ! అలాగే మ్యూచువల్‌ ఫండ్స్‌కు కూడా స్టాప్‌-లాస్‌, లాభాల స్వీకరణ వర్తిస్తాయా ?
-శ్రీలేఖ, హైదరాబాద్‌ 
జ: ఒక విధంగా చెప్పాలంటే మ్యూచువల్‌ ఫండ్స్‌కు స్టాప్‌-లాస్‌, లాభాల స్వీకరణ వర్తించవనే చెప్పాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌ను షేర్లలాగా స్పెక్యులేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌గా చూడొద్దు. సాధారణ షేర్లు ఒడిదుడుకులకు గురైనట్లుగా మ్యూచువల్‌ ఫండ్స్‌ తీవ్రమైన ఒడిదుడుకులకు గురి కావడం జరగదు. ఒక్కొక్క మ్యూచువల్‌ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో కనీసం 20 వరకూ షేర్లుంటాయి. ఈ షేర్లు కూడా వివిధ రంగాలకు చెందినవి కావడంతో డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు లభిస్తాయి. మీరు ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం విలువ తగ్గుతుందనే ఆందోళన ఉంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి.  ఇక ఇన్వెస్టర్లు తరుచుగా ఫండ్స్‌ను కొనుగోలు చేయడం, అమ్మేయడం చేయకూడదు. చాలా మంది ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేయగానే మంచి ధర వచ్చిందనో, లేకుంటే  పనితీరు బాగాలేదనో, ఆశించిన స్థాయిలో లేదనో  ఈ యూనిట్లను విక్రయించి మరో ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. ఇది తప్పు. ఇలా చేయడం వల్ల మీకు ఎగ్జిట్‌ లోడ్‌ భారం పడటమే కాకుండా, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. 

ప్ర: దసరా పండగకి  పెద్ద మొత్తంలోనే బోనస్‌ వచ్చింది.  ఈ మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఈ పెద్ద మొత్తాన్ని ఒకేసారి డెట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ? 
-ఫెర్నాండేజ్‌, సికింద్రాబాద్‌ 
జ: డెట్‌ ఫండ్స్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. సాధారణంగా అయితే పెద్ద మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఒకేసారి మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌  చేయకూడదు. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్‌లో అసలే ఇన్వెస్ట్‌ చేయకూడదు. కానీ డెట్‌ ఫండ్స్‌కు ఇది వర్తించదు. ఈక్విటీ ఫండ్స్‌ మాదిరి డెట్‌ ఫండ్స్‌ ఒడిదుడుకులకు గురి కావు. కాబట్టి డెట్‌ ఫండ్స్‌లో ఈ దసరా బోనస్‌ను ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయవచ్చు. స్వల్పకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌ అవసరాల కోసం మాత్రమే  డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. ఈ దసరా బోనస్‌తో మీకు తక్షణం అవసరం లేదనుకుంటే, ఈ మొత్తాన్ని రెండు సమభాగాలు చేయండి. ఒక దానిని బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లోనూ, మరో సగాన్ని ఈక్విటీ ఫండ్‌లోనూ ఇన్వెస్ట్‌ చేయండి. ఈ రెండు ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేసే మొత్తాన్ని కనీసం 12 సమభాగాలుగా చేసి, సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో మాత్రమే ఇన్వెస్ట్‌ చేయండి. డెట్‌ ఫండ్స్‌లో కన్నా ఈక్విటీ, బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తే మీకు మంచి రాబడులు వస్తాయి. 

ప్ర: నేను నెలకు కొంత మొత్తం చొప్పున ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)ల్లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. అయితే ఈఎల్‌ఎస్‌ఎస్‌లకు లాక్‌-ఇన్‌ పీరియడ్‌ మూడేళ్లుగా ఉంటుంది కదా ! ఈఎల్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు కొనుగోలు చేసిన మూడేళ్ల తర్వాత ఈ యూనిట్లన్నింటినీ ఒకేసారి  విక్రయించుకోవచ్చా ?
-కరీముల్లా, విజయవాడ 
జ: ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో మీరు కొనుగోలు చేసిన ప్రతి యూనిట్‌కు మూడేళ్ల లాక్‌-ఇన్‌-పీరియడ్‌ ఉంటుంది. మీరు సిప్‌ విధానంలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. మొదటి సిప్‌కు మూడేళ్ల దాటిన తర్వాతనే మీరు దానిని విక్రయించుకోవచ్చు. రెండో సిప్‌కు మూడేళ్లు.. ఇలా ప్రతి సిప్‌కు లాక్‌-ఇన్‌ పీరియడ్‌ మూడేళ్లుగా ఉంటుంది. ఉదాహరణకు మీరు 2015, జనవరిలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో సిప్‌ ప్రారంభించారనుకుందాం. మూడేళ్ల పాటు అంటే 2018, జనవరి వరకూ ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. 2015, జనవరిలో ఇన్వెస్ట్‌ చేసిన సిప్‌ యూనిట్లను 2018, జనవరి తర్వాతనే మీకు విక్రయించుకోగలుగుతారు. అలాగే మీ చివరి సిప్‌... 2018, జనవరిలో ఇన్వెస్ట్‌ చేసిన దానిని 2021, జనవరిలో మాత్రమే విక్రయించుకోగలుగుతారు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మార్కెట్‌​ఒడిదుడుకులకు గురి కాకుండా ఈ లాక్‌-ఇన్‌ పీరియడ్‌, సిప్‌ విధానం రక్షణ కల్పిస్తాయి. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మంచి రాబడులే కాకుండా, పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. You may be interested

ఈ స్టాక్స్‌ కొనచ్చు

Monday 15th October 2018

అరవింద్‌    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: కోటక్‌ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.330 టార్గెట్‌ ధర: రూ.450 ఎందుకంటే: కంపెనీ ప్రధాన వ్యాపారాలు-టెక్స్‌టైల్స్‌, అప్పారెల్స్‌, ఇంజినీరింగ్‌ మంచి వృద్ధిని సాధిస్తున్నాయి. అరవింద్‌ ఫ్యాషన్స్‌ పేరుతో బ్రాండెడ్‌ అప్పారెల్‌ వ్యాపారాన్ని, అరవింద్‌ పేరుతో టెక్స్‌టైల్స్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఫ్లైయింగ్‌ మెషీన్‌, కోల్ట్‌, రగ్గర్స్‌ వంటి సొంత బ్రాండ్స్‌తో పాటు యారో, టామీ హిల్‌ఫిగర్‌ చెరోకి వంటి విదేశీ బ్రాండ్ల దుస్తులను కూడా విక్రయిస్తోంది. అన్‌లిమిటెడ్‌ పేరుతో రిటైల్‌ చెయిన్‌ను

10290 పాయింట్ల వద్ద బలమైన మద్దతు

Monday 15th October 2018

నిఫ్టీపై నార్నోలియా అంచనా చాలారోజుల అమ్మకాల తర్వాత గత వారం స్టాకులు రిలీఫ్‌ ర్యాలీ చూశాయి. చార్టుల్లో బలమైన పాటర్న్‌ కనిపిస్తోంది. బ్యాంకు నిఫ్టీ చార్టుల్లో బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ పాటర్న్‌ కనిపించడంతో పాటు ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. నిఫ్టీలో సైతం ఆర్‌ఎస్‌ఐ డబుల్‌ బాటమ్‌ను ఖరారు చేసింది. ఇండియా వీఐఎక్స్‌ 18.62కు దిగివచ్చింది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు కచ్ఛితమైన స్టాప్‌లాస్‌తో లాంగ్స్‌ను తీసుకోవచ్చు. ఇకపై నిఫ్టీకి అడుగడుగునా నిరోధాలు కనిపిస్తాయి.

Most from this category