STOCKS

News


మార్కెట్లు పడినా... సిప్‌ పెట్టుబడుల హోరు

Friday 12th October 2018
personal-finance_main1539282789.png-21056

గత రెండేళ్లుగా సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చే పెట్టుబడులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. మార్కెట్లలో మంచి ర్యాలీ ఒక విధంగా సానుకూలతను ఇచ్చింది. అదే సమయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌పై అవగాహన కార్యక్రమాల పాత్ర కూడా ఉంది. కానీ, గత నెలన్నర రోజుల్లో మార్కెట్లు భారీ కరెక్షన్‌ను చవిచూసిన విషయం తెలిసింది. ఆగస్ట్‌ 29 తర్వాత మొదలైన కరెక్షన్‌ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు మాత్రం వణికిపోలేదు. వారి సిప్‌ పెట్టుబడులు కొనసాగుతూనే ఉన్నాయి. సెప్టెంబర్‌ నెలలోనూ రూ.7,727 కోట్ల పెట్టుబడులు సిప్‌ రూపంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చాయి.


  
ఆటుపోట్లతో కూడిన మార్కెట్లలోనూ సిప్‌ల పట్ల ఇన్వెస్టర్లు నమ్మకం ఉంచినట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు పేర్కొన్నారు. కానీ, ఇదే సమయంలో నెగెటివ్‌ రిటర్నులను చూసి (నష్టాలు) వారు సిప్‌లను ఆపొచ్చన్న భయం కూడా ఫండ్‌ మేనేజర్ల నుంచి వ్యక్తం అయింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు) సిప్‌ల రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.44,487 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో మొదటి ఆరు నెలల్లో వచ్చిన సిప్‌ పెట్టుబడులు రూ.29,266 కోట్లు, రూ.20,150 కోట్లతో పోలిస్తే మంచి పెరుగుదల కనిపిస్తోంది. నిజానికి అధిక వ్యాల్యూషన్ల కారణంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ భారీగా నష్టపోతూ వచ్చిన విషయం గమనార్హం. 2017 నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారికి ఇటీవలి మార్కెట్‌ క్రాష్‌ ముందు వరకు సానుకూల రాబడులు చూపించగా... తాజా పతనం తర్వాత రాబడులు పోయి, వాటి స్థానంలో నష్టాలు చూపిస్తుండడంతో ఇన్వెస్టర్లకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఉంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత డెట్‌ ఫండ్స్‌ కొన్నింటికీ ఇదే పరిస్థితి ఉంది. 

 

అయితే, సిప్‌ అనేది మార్కెట్‌ టైమింగ్‌ రిస్క్‌ను అధిగమించే సాధనమనే విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మార్కెట్‌ గరిష్టాల్లోనూ పెట్టుబడులు పెట్టడం, మార్కెట్లు పడినప్పుడు కూడా పెట్టుబడులు సిప్‌ రూపంలో తప్పకుండా కొనసాగించాలి. అప్పుడే గరిష్ట ధరలు, కనిష్ట ధరల్లోనూ పెట్టుబడులతో కొనుగోలు వ్యయం సగటున తగ్గుతుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫి గణాంకాల ప్రకారం గత మూడేళ్ల నుంచి సిప్‌ల పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయి. 2016-17లో సిప్‌ రూపంలో రూ.43,921 కోట్లు రాగా, 2017-18లో రూ.67,190 కోట్లకు పెరిగాయి. ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలకు 2.44 కోట్ల సిప్‌ ఖాతాలు ఉన్నాయి.  2017-18లో ప్రతీ నెలా 10.17 లక్షల చొప్పున సిప్‌ ఖాతాలు తోడయ్యాయి. సిప్‌ ప్రతీ వారం, ప్రతీ నెలా నిర్ణీత మొత్తంలో ఫలానా పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు వినియోగించుకునే ఉపకరణం.You may be interested

టాప్‌ పీఎంఎస్‌లకూ తప్పలేదు నష్టాలు

Friday 12th October 2018

పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సేవలు అందించే ప్రముఖ సంస్థలకు సైతం తాజా మార్కెట్‌ పతనం నష్టాలను మిగిల్చింది. సాధారణంగా మార్కెట్‌ కరెక్షన్లలో రిటైల్‌ ఇన్వెస్టర్లకు మాత్రమే నష్టాలు వస్తాయని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనం. అనుభవమున్న ఇన్వెస్టర్లు, పెట్టుబడి సంస్థలూ నష్టపోయిననట్టు గత నెలకు సంబంధించి సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి.    బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 6.25 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 12.54 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 16

వీటి బైబ్యాక్‌ దేనికి సంకేతం?

Thursday 11th October 2018

ఓ కంపెనీ షేర్లను బైబ్యాక్‌ చేస్తోందంటే, ఆ కంపెనీ ఆర్థికంగా పరిపుష్టంగా ఉందన్న సంకేతాన్నిస్తున్నట్టే. సదరు కంపెనీ షేరు ధర వాస్తవ విలువకు చాలా తక్కువ స్థాయికి చేరినా లేదా కంపెనీ వద్ద పెద్ద ఎత్తున నగదు నిల్వలు ఉండి, వ్యాపార అవసరాలకు అంతగా నిధుల అవసరం లేని సందర్భాల్లోనూ కంపెనీలు, షేర్లను ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేస్తుంటాయి. తద్వారా వాటాల విలువను పెంచే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో

Most from this category