STOCKS

News


సీజన్‌ ఏదైనా.. సిప్‌ బెటర్‌..

Thursday 18th October 2018
personal-finance_main1539860322.png-21276

మార్కెట్లో మదుపరుల ఆలోచనలు విచిత్రంగా ఉంటాయి. లాభాలు వస్తున్నప్పుడు అమ్మకానికి తొందరపడడం, నష్టాల్లో ఉన్నప్పుడు మరింత కొని యావరేజ్‌ చేయాలని ఆలోచించడం గమనించవచ్చు. అలాగే సిప్స్‌(సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లో పెట్టుబడులు పెట్టిన వాళ్లలో కూడా ఒక చిత్రమైన ధోరణి గమనించవచ్చు. ఒక సిప్‌ ఆరంభించిన ఇన్వెస్టర్‌ దాన్ని కొనసాగించడంపై కన్నా ఎప్పుడు ఆపేయాలా అనే ఆలోచిస్తుంటాడు. మార్కెట్‌ బుల్లిష్‌గా ఉందా? సిప్‌ ఆపాలా? మార్కెట్‌ బేరిష్‌గా ఉందా? సిప్‌ ఆపాలా? మార్కెట్‌ ఎటూ కదలట్లేదా? సిప్‌ ఆపాలా?.. ఇలా ఏ సందర్భం వచ్చినా సిప్‌ ఆపాలా అని ఆలోచిస్తుంటారు. కానీ సిప్‌ ఆపాలంటే ఎంతకాలం అందులో ఉన్నామన్నదే కీలకం. కేవలం మార్కెట్‌ పరిస్థితులను బట్టి సిప్‌ కొనసాగించాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవడం మంచిది కాదు.

నిజానికి సిప్‌ ఒక క్రమశిక్షణాయుత పెట్టుబడి విధానం. సిప్‌ ద్వారా క్రమానుగతంగా పెట్టుబడి పెట్టే అలవాటు అలవడుతుంది. అయితే సిప్‌ ఫలవంతం కావాలంటే రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. 1. సిప్‌ పెట్టుబడి రాబడులు ఇచ్చేందుకు వేచిచూడాలి, 2. మనం ఊహించినట్లే సిప్‌ నడుచుకోవాలని రూల్‌ లేదు. సిప్‌ను దాని మానానికి దాన్ని కొంతకాలం వదలడమే మంచి పద్ధతి. ఉదాహరణకు లార్జ్‌ క్యాప్‌ఫండ్‌లోని ఒక సిప్‌ పనితీరు పరిశీలిస్తే 2005- 2009 మధ్య కాలంలో మంచి రిటర్న్‌ అందించింది. 2009-2014 కాలంలో కొంచెం తక్కువ రాబడి అందించింది. కానీ మొత్తం పదేళ్లకు తీసుకుంటే సూచీలతో సమానంగా రాబడినిచ్చింది. అందువల్ల సిప్‌ తీసుకునే వాళ్లు ఒక నిర్ణీత లక్ష్యం నిర్ధేశించుకొని అప్పటివరకు కదల్చకుండా ఉండడమే బెటర్‌.



You may be interested

హీరో మోటోకార్ప్‌ కొనొచ్చు

Thursday 18th October 2018

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సు కొత్త లాంచ్‌లు హీరోమోటోకార్‌‍్పకు మరింత కలిసివస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. దీర్ఘకాల ధృక్పథంతో హీరోమోటో షేరును కొనొచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ రూ. 3602. క్యు2 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది. క్యు2 విశేషాలు.. - బలమైన వాల్యూ వృద్ధితో దేశీయ ద్విచక్రవాహన (మోటర్‌సైకిల్‌)మార్కెట్లో 50.8 శాతం వాటాతో అగ్రస్థానం నిలబెట్టుకుంది. అయితే స్కూటర్‌ మార్కెట్లో వాటా 168 బీపీఎస్‌ మేర తగ్గింది. 125సీసీ స్కూటర్ల విభాగంలో

ఆనంద్‌ రాఠీ దసరా సిఫార్సులు

Thursday 18th October 2018

సంవత్సరం కాలపరిమితిలో మంచి రాబడులు ఇచ్చే ఐదు స్టాకులను ఆనంద్‌రాఠీ సెక్యూరిటీస్‌ రికమండ్‌ చేస్తోంది. 1. ఏసియన్‌ పెయింట్స్‌: టార్గెట్‌ రూ. 1471. ఇతర పెయింట్‌ కంపెనీలతో పోలిస్తే పెద్ద నెట్‌వర్క్‌ ఉంది. దేశీయ పెయింట్‌ పరిశ్రమ రాబోయే రోజుల్లో 12 శాతం వరకు వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. పెయింట్స్‌ రంగంలో డిమాండ్‌ కూడా ఊపందుకుంటోంది. 2. ఆదిత్య బిర్లా ఫాషన్‌ అండ్‌ రిటైల్‌: టార్గెట్‌ రూ. 237. కంపెనీ పోర్టుఫోలియోలో

Most from this category