STOCKS

News


ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పరిమితికి మించి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చా?

Wednesday 5th December 2018
personal-finance_main1543949661.png-22626

పన్ను మినహాయింపులు కల్పించే ఈక్విటీ ఆధారిత సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మ్యూచువల్‌ ఫండ్స్‌ గురించి ఇన్వెస్టర్లకు తెలియంది కాదు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ నిబంధన కింద ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఆ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. బేసిక్‌ పన్ను మినహాయింపు రూ.2.5 లక్షలకు ఇది అదనం. అయితే, రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత ఇంకా తమ వద్దనున్న మిగులు నిల్వలను ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం లాభమేనా? ఇందుకు ఏంజెల్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ హెడ్‌ వైభవ్‌ అగర్వాల్‌ ఏం చెబుతున్నారో చూద్దాం...

 

ప్రయోజనాలు
ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. పీపీఎఫ్‌, యులిప్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసినా సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు. కానీ, వాటితో పోలిస్తే లాకిన్‌ పీరియడ్‌ ఈఎల్‌ఎస్‌ఎస్‌లోనే తక్కువ. పైగా లాకిన్‌ వల్ల ఇందులో పెట్టిన పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. మూడేళ్లు నిండిన తర్వాత తీసుకోవాల్సిన నిబంధన వల్ల ఇదొక నిర్బంధ పొదుపుగా మారుతుంది. పైగా పన్ను ఆదా పథకం కూడా కావడంతో దీర్ఘకాలంలో మంచి రాబడులకు అవకాశం ఉంటుంది. 

 

ఎంత మేరకు పరిమితి?
ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో పెట్టుబడులకు ఎటువంటి పరిమితి లేదు. ఎవరికి వారు వారికి వీలున్నంత మేరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. కేవలం రూ.1.5 లక్షలకే పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే, మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ నిబంధన కారణంగా అత్యవసరం ఏర్పడినా ఇందులో పెట్టిన పెట్టుబడులను ఆ లోపు వెనక్కి తీసుకునే ఆప్షన్‌ ఉండదు. ఉదాహరణకు రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత ఒక వ్యక్తి దగ్గర ఇంకా అదనంగా రూ.50వేలు ఉన్నాయని వాటిని కూడా ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. అత్యవసరం ఏ‍ర్పడితే వాటిని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. అందుకే దీనికి బదులు అదనంగా ఉన్న నిధులను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం సరైన నిర్ణయం. దీనివల్ల కాస్త అదనపు రాబడులతోపాటు అవసరమైనప్పుడు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. 

 

రాబడుల చరిత్ర
ఈక్విటీ లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ మూడేళ్లకాలంలో 11.46 శాతం, ఐదేళ్లలో 13.33 శాతం, పదేళ్లలో 15.88 శాతం చొప్పున వార్షికంగా రాబడులను ఇచ్చాయి. ఈక్విటీ మల్టీక్యాప్‌ విభాగం ఫండ్స్‌లో ఇదే కాలంలో రాబడులు 10.35 శాతం, 16.22 శాతం, 18.45 శాతం చొప్పున ఉన్నాయి. ఇక ఈక్విటీ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ రాబడులు సగటున వార్షికంగా 9.27 శాతం, ఐదేళ్లలో 21.02 శాతం, పదేళ్లలో 22.37 శాతం చొప్పున ఉన్నాయి. ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ మూడేళ్లలో వార్షికంగా 10.41 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 16.4 శాతం, పదేళ్లలో వార్షికంగా 17.81 శాతం చొప్పున రాబడులను ఇచ్చాయి.You may be interested

హార్లిక్స్‌, బూస్ట్‌లను ఎందుకు అమ్మేసినట్టు?

Wednesday 5th December 2018

బ్రిటిష్‌ దిగ్గజం గ్లాక్సోస్మిత్‌క్లయిన్‌ (జీఎస్‌కే) భారత్‌లోని తన పోషకాహార వ్యాపారాన్ని హిందుస్తాన్‌ యూనిలీవర్‌లో విలీనం చేయడానికి ఒప్పందం చేసుకుంది. 140 సంవత్సరాల చరిత్ర ఉన్న హార్లిక్స్‌తోపాటు ఎక్కువ మార్కెట్‌ వాటా కలిగిన బూస్ట్‌ను, వివా, మాల్టోవా బ్రాండ్లను జీఎస్‌కే వదులుకోవడానికి కారణమేంటన్న ప్రశ్న ఇన్వెస్టర్లకు ఎదురుకావచ్చు. ఇందుకు విశ్లేషకులు చెబుతున్న కారణాలు ఇవీ...   జీఎస్‌కే కంపెనీ భారత్‌లోని తన కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ ఇండియాను విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్న రోజునే... అమెరికా కేంద్రంగా

ఎడెల్వీజ్‌ నుంచి 24 బెట్స్‌

Wednesday 5th December 2018

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు మన మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఎడెల్వీజ్‌ ప్రొఫెషనల్‌ ఇన్వెస్టర్‌ రీసెర్చ్‌ మంచి రాబడులకు అవకాశాలున్న 24 స్టాక్స్‌ను ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది.    అక్రిసిల్‌: కాంపోజిట్‌ క్వార్ట్జ్‌ కిచెన్‌ సింక్‌లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. వీటికి మంచి వృద్ధి అవకాశాలున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ను చేరుకునేందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది.

Most from this category