STOCKS

News


వీపీఎఫ్‌లో చందా పెంచుకునేందుకు సరైన తరుణమేనా?

Thursday 28th February 2019
personal-finance_main1551292838.png-24363

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) బోర్డు ప్రావిడెంట్‌ ఫండ్‌పై ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచుతూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరానికి ఇది 8.55 శాతం కాగా దానిపై పది బేసిస్‌ పాయింట్లు పెంచింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. కీలకమైన సాధారణ ఎన్నికల ముందు ఆర్థిక శాఖ దీనికి ఆమోదం తెలపడం లాంఛనమే. ఈపీఎఫ్‌కు అదనంగా ఉద్యోగులు స్వచ్చందంగా చేసే చందాలను వీపీఎఫ్‌గా పేర్కొంటారు. ఈపీఎఫ్‌కు అమలయ్యే వడ్డీ రేటే ఉద్యోగి స్వచ్చందంగా చేసే చందాలకూ వర్తిస్తుంది. సంప్రదాయ సాధనాలతో పోలిస్తే 8.65 శాతం వడ్డీ రేటు కాస్త మెరుగైనదే అని చెప్పుకోవాలి. ఇతర సాధనాలతో పోలిస్తే ఒక శాతం అధికంగా వడ్డీ రేటు లభిస్తోంది. మరి వీపీఎఫ్‌ చందా పెంచుకోవచ్చా...?

 

రిస్క్‌ లేకుండా పన్ను రహిత అధిక రాబడులు ఇచ్చే సాధణం వీపీఎఫ్‌. రిటైర్మెంట్‌కు మంచి సాధనం ఇది. కనుక ప్రతి ఒక్క వేతన జీవి డెట్‌ పోర్ట్‌ఫోలియోలో ఇది కూడా ఉండాలి’’ అని ఫిన్‌సేఫ్‌ ఇండియా వ్యవస్థాపకులు మ్రిన్‌ అగర్వాల్‌ తెలిపారు. వీపీఎఫ్‌ కింద చేసే పెట్టుబడులకూ సెక్షన్‌ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపులు ఉన్నాయి. కనుక పన్ను ఆదాకూ ఉపయోగపడే సాధనం. పీపీఎఫ్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఇన్వెస్ట్‌ చేసే పరిమితి ఉంది. కానీ, వీపీఎఫ్‌లో అటువంటి పరిమితి లేదని, సౌకర్యవంతమైన సాధనం కూడా అని అగర్వాల్‌ పేర్కొన్నారు. ‘‘వీపీఎఫ్‌ అన్నది వేతనం నుంచి వెళుతుంది. దీంతో ఇన్వెస్టర్లకు సౌకర్యంగా ఉంటుంది. ప్రతీ ఉద్యోగ సంస్థ ఏడాదిలో రెండు సార్లు వీపీఎఫ్‌ పెంచుకునేందుకు, తగ్గించుకునేందుకు, నిలిపివేసుకునే ఆప్షన్లను ఇస్తుంది’’ అని అగర్వాల్‌ తెలిపారు. 

 

అయితే, వీపీఎఫ్‌లో ఉపసంహరణల పరంగా పరిమితులు ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రిటైర్మెంట్‌ సమయంలోనే మొత్తం ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంటుంది. వీపీఎఫ్‌ మొత్తాన్ని పెంచుకునే వారు భవిష్యత్తు లక్ష్యాలు, వాటి కేటాయింపులను విస్మరించరాదని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న వయసులో ఉన్న వారికి ఎక్కువ భాగం ఈక్విటీ, తక్కువ భాగం డెట్‌కు కేటాయించుకోవాలన్నది సూత్రం. కనుక వీపీఎఫ్‌ అన్నది వారికి మంచి సాధనం కాబోదు. ‘‘వీపీఎఫ్‌ అనేది పెద్ద వయసులో ఉండి ఈక్విటీ వాటా తగ్గించుకుని, డెట్‌ వాటా పెంచుకోవాలనుకునే వారికి మంచి సాధనం అవుతుంది. ఇటువంటి వారు వీపీఎఫ్‌ చందాను పెంచుకోవడం ద్వారా ఈక్విటీ పెట్టుబడులు తగ్గించుకోవచ్చు’’ అని ఫిన్‌విన్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్స్‌ వ్యవస్థాపకులు మెల్విన్‌ జోసెఫ్‌ తెలిపారు.



You may be interested

మూలాలు బలంగా ఉంటే... కొనుగోళ్లకు అవకాశమిదే...

Thursday 28th February 2019

భారత్‌-పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యం... కశ్మీర్లో ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన వైమానిక చర్యతో కేంద్రంలో బీజేపీ విజయావకాశాలు మెరుగుపడ్డాయని ఎక్కువ మంది అనలిస్టులు భావిస్తున్నారు. దీనివల్ల ప్రస్తుత విధానాలు, సంస్కరణలు కొనసాగుతాయని, ఇది కచ్చితంగా మార్కెట్లకు సానుకూలమని ఎలారా క్యాపిటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ రవి ముత్తు కృష్ణన్‌ పేర్కొన్నారు. ఓ ఆంగ్ల ప్రతికకు ఆయన పలు అంశాలపై ఇంటర్వ్యూ ఇచ్చారు.    మార్కెట్లపై ఉద్రిక్తతల ప్రభావం...? భౌగోళిక రాజకీయ ప్రతికూల ప్రభావాలు

భారీ డివిడెండ్‌ వీటి నుంచే..!

Thursday 28th February 2019

రానున్న ఆర్థిక సంవత్సరంలో అధిక డివిడెండ్‌ ఆదాయం ప్రభుత్వరంగ కంపెనీల నుంచి వాటాదారులకు రానుంది. నిఫ్టీ-50 కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 5 శాతం అధికంగా వివిడెండ్‌ పంపిణీ చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లో డివిడెండ్‌ ఈల్డ్‌ 1.8 శాతంగా ఉంటుందని అంచనా. అస్థిర మార్కెట్లలో షేర్ల ధరలు కకావికలం అవుతుంటాయి. ఈ సమయాల్లో వాటాదారులకు కంపెనీల పట్ల భరోసాకు డివిడెండ్‌ ఉపకరిస్తుంది. మంచి డివిడెండ్‌ను

Most from this category