STOCKS

News


ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే శరణ్యమా?

Thursday 4th October 2018
personal-finance_main1538634671.png-20851

ఎంఎఫ్‌ల నుంచి వైదొలగడం ఉత్తమమా?
డైలమాలో ఇన్వెస్టర్లు
ఈక్విటీల అధ్వాన్న ప్రదర్శన రిటైల్‌ ఇన్వెస్టర్లను చాలా భయపెడుతోంది. ఎకానమీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అంతర్జాతీయ పరిస్థితులు చూస్తే ఈక్విటీలంటే సగటు ఇన్వెస్టరు వణికిపోతున్నాడు. చాలా మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ఫండ్స్‌లో తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈక్విటీలను నమ్ముకోవడం కంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పొదుపు చేసుకోవడం మంచిదని చాలామంది భావిస్తున్నారు. నిజానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులను తీసుకువచ్చి భారీ రాబడుల కోసం ఈక్విటీ ఎంఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వారంతా ఇప్పుడు గోబ్యాక్‌ టు ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ అని భావిస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 
రిస్కురివార్డు చూసి వస్తే...
మ్యూచువల్‌ ఫండ్‌ ఫథకాలు గతంలో ఇచ్చిన రాబడులు చూసి తాజాగా వీటిలో పెట్టుబడులు పెట్టినవాళ్లకు గట్టి షాకే తగిలింది. గత నెల్లో మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ 8.4 శాతం, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ 11.3 శాతం నెగిటివ్‌ రాబడులు ఇచ్చాయి. గత సంవత్సరం ఈ ఫండ్స్‌ వరుసగా 36, 43 శాతం మేర రాబడులు ఇచ్చాయి. గత గణాంకాలు చూసి ఎక్కువ మంది ఈ ఏడాది ఎంఎఫ్‌ల్లోకి వచ్చారు. వీరంతా తిరిగి తమ పెట్టుబడులకు కనీస రక్షణనిచ్చే బ్యాంకు డిపాజిట్లే మేలని భావిస్తున్నారని లాడర్‌7 ఫిన్‌సర్వ్‌ సంస్థ తెలిపింది. దీనికి మూల కారణం ఇన్వెస్టర్లలో కనీస అవగాహన లోపించడమేనని తెలిపింది. స్టాక్స్‌పై భారీ రాబడులు ఆర్జించాలంటే కనీసం మిడ్‌ టు లాంగ్‌ టర్మ్‌ వేచిచూడాలని, కేవలం రెండు మూడు నెలల్లో లాభాలు రావాలంటే కష్టమని తెలిపింది. దీనికితోడు పెట్టుబడులను ఒకే సాధనంపై వెచ్చించకుండా డైవర్సిఫై(వివిధీకృతం) చేయాలని సూచించింది. కొంత మొత్తం ఈక్విటీలపై, కొంత ఫిక్స్‌డ్‌ రాబడినిచ్చే పథకాలపై పెట్టి కొంత మొత్తం నగదు రూపంలో ఉంచుకోవాలని సలహా ఇచ్చింది. మార్కెట్లు పడే ఇలాంటి తరుణంలో నాణ్యమైన స్టాకులను తక్కువ రేటు వద్ద కొనుగోలు చేసి లాంగ్‌టర్మ్‌ వేచిచూడాలని నిపుణులు సూచిస్తున్నారు. 
గాబరా నిర్ణయాలొద్దు..
మార్కెట్లో క్రాష్‌ కామన్‌ అని, ఇంత ర్యాలీ అనంతరం కొంత పతనం తప్పదని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఇతరులు అమ్మేస్తున్నారని భయంతో నాణ్యమైన స్టాకులను సైతం విచ్చలవిడిగా అమ్ముకుంటే పెట్టుబడి హరించుకపోతుందని హెచ్చరిస్తున్నారు. మిగులు నిధులుంటే పతనాల్లో కొంచెంకొంచెంగా కొనుగోళ్లు చేయాలని సూచిస్తున్నారు. మార్కెట్లు కోలుకునేవరకు ఆగి అప్పుడు అమ్మకం నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో పాటు కనీస అవసరాలు, అనుకోని అవసరాలకు కేటాయించిన నిధులను ఈక్విటీల్లో పెట్టవద్దన్నది వీరి ముఖ్య సూచన. మిగులు నిధులు ఉండి, ఇప్పట్లో పెద్దగా అర్జెంటు అవసరాలు లేనప్పుడే ఈక్విటీల వైపు చూడాలని సలహా ఇస్తున్నారు. 

 You may be interested

ఝున్‌ఝున్‌వాలాను ముంచేసిన మిడ్‌క్యాప్స్‌

Thursday 4th October 2018

కేవలం రిటైల్‌ ఇన్వెస్టర్లను మాత్రమే కాదండోయ్‌.. పీఎంఎస్‌ మేనేజర్లను, వారి హై-నెట్‌వర్త్‌ క్లయింట్స్‌ను కూడా మార్కెట్‌ దెబ్బకొట్టింది. అఖరికి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా వంటి సీజన్‌ ఇన్వెస్టర్లను కూడా మన ఈక్విటీ మార్కెట్‌ వదిలిపెట్టలేదు. ఈయన పోర్ట్‌ఫోలియో కూడా 2018లో బాగా నష్టపోయింది. మరీముఖ్యంగా మిడ్‌క్యాప్స్‌ హోల్డింగ్స్‌ 75 శాతం వరకు కరిగిపోయాయి. కాగా మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 16 శాతంమేర పతనమైంది. గత నాలుగేళ్లలో మిడ్‌క్యాప్స్‌ బాగా

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 6 శాతం పతనం

Thursday 4th October 2018

మార్కెట్‌ పతనంలో భాగంగా రియలన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 6.50శాతం నష్టపోయింది. నేడు ఎఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో రూ.1,189.50 ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో మార్కెట్‌ పతనంలో భాగంగా ఇన్వెస్టర్లు రిలయన్స్‌ షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఈ షేరు 5.38శాతం నష్టపోయి రూ.1128.00స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 98లక్షల వాల్యూమ్స్‌తో ట్రేడైంది. గత తొమ్మిది నెలల్లో ఒక్కరోజుల్లో ఇంతస్థాయిలో నష్టపోవడం ఇదే

Most from this category