STOCKS

News


క్లిష్ట సమయాల్లోనూ స్థిరమైన పనితీరు

Monday 17th December 2018
personal-finance_main1545034319.png-22989

  • ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్‌ ఫండ్‌

మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలన్న తలంపుతో ఉన్న వారు ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్‌ ఫండ్‌ పథకాన్ని పరిశీలించొచ్చు. ఈ ఏడాది మార్కెట్‌ కరెక్షన్‌లో ఈ పథకం నష్టాలను సూచీలతో పోలిస్తే తక్కువకు పరిమితం చేయడాన్ని గమనించొచ్చు. మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ సగటున 10 శాతం నష్టాలను ఇవ్వగా, ఇన్వెస్కో ఇండియా కేవలం 3.8 శాతానికే నష్టాలను తగ్గించుకుంది. ఈ పథకం మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. మార్కెట్‌ క్యాప్‌ పరంగా 101 నుంచి 250వ స్థానం వరకు ఉన్న కంపెనీలను ఎంచుకుంటుంది. టాప్‌ 100 మార్కెట్‌ క్యాప్‌ ఉన్నవి లార్జ్‌క్యాప్‌ కిందకు వస్తాయి. 

ఈ పథకం రాబడులకు బెంచ్‌ మార్క్‌ సూచీ ‘మిడ్‌క్యాప్‌ 100’. ఈ పథకం పదేళ్ల కాలంలో సగటున 24.6 శాతం రాబడులతో ఈ విభాగంలో అగ్ర స్థాయి పథకాల్లో ఒకటిగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో నిఫ్టీ 100 సూచీ 12.3 శాతం నష్టపోతే, ఈ పథకంలో నష్టాలు 5.3 శాతమే ఉన్నాయి. మూడేళ్ల కాలంలో 11 శాతం, ఐదేళ్ల కాలంలో 21.9 శాతం చొప్పున వార్షిక సగటు రాబడులను ఈ పథకం ఇవ్వగా... నిఫ్టీ 100 సూచీ రాబడులు ఇదే కాలంలో 10.8 శాతం, 19.1 శాతం చొప్పున ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ అపార్చునిటీస్‌, ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మిడ్‌క్యాప్‌ పథకాల కంటే ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉండడం గమనార్హం. 

పోర్ట్‌ఫోలియో, పెట్టుబడుల విధానం
2013, 2014 సంవత్సరాల్లో మంచి పనితీరు చూపించగా, తర్వాతి సంవత్సరాల్లో కాస్త కళతప్పింది. అయితే, 2017 మళ్లీ మంచి పనితీరుతో అదరగొట్టింది. ఈ ఏడాది మార్కెట్‌ ఆటుపోట్ల నేపథ్యంలో పనితీరు ప్రతికూలంగానే ఉంది. ఈ పథకం 95 నుంచి 98 శాతం వరకు ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. వృద్ధికి అవకాశాలున్న మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. రంగాల వారీగా పెట్టుబడుల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేయడాన్ని కూడా గమనించొచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో కన్జ్యూమర్‌ నాన్‌ డ్యురబుల్స్‌, ఇండస్ట్రియల్‌ ప్రొడక్ట్స్‌, ఇండస్ట్రియల్‌ క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలకు ఎక్కువ  ప్రాధాన్యం ఇచ్చింది. కానీ, ఆ తర్వాత వీటికి ప్రాధాన్యాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. ఇండస్ట్రియల్‌ క్యాపిటల్‌ గూడ్స్‌ రంగం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంది. అలాగే, హోటల్స్‌, ఫెర్టిలైజర్స్‌, మీడియా రంగాల నుంచి కూడా గత ఏడాది కాలంలో వైదొలిగింది. వీటి స్థానంలో సాఫ్ట్‌వేర్‌, మెటల్స్‌, హెల్త్‌కేర్‌ సర్వీసులకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెంచుకుంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 40 స్టాక్స్‌ ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, టోరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ను యాడ్‌ చేసుకుంది. వీమార్ట్‌ రిటైల్‌, థెర్మాక్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నుంచి తప్పుకుంది.

టాప్‌ హోల్డింగ్స్‌
కంపెనీ    పెట్టుబడుల శాతం
ఆర్‌బీఎల్‌ బ్యాంకు    4.07
ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌    4
అపోలో హాస్పిటల్స్‌    3.91
ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌    3.58
ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌    3.39
సిటీ యూనియన్‌ బ్యాంకు    3.24
చోళమండలం ఇన్వెస్ట్‌    3.21
వోల్టాస్‌    3.18
టోరెంట్‌ ఫార్మా    3.17
ఇంద్రప్రస్థ గ్యాస్‌    2.98
 You may be interested

ఈ షేర్లపై కన్నేయండి..

Monday 17th December 2018

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.293 టార్గెట్ ధర: రూ.366 ఎందుకంటే: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 18 మిలియన్‌ టన్నులు.  మూడేళ్లలో  వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని  25 మిలియన్‌ టన్నులకు పెంచుకోవాలని కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం రూ.44,400 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ కంపెనీకి చెందిన 12 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల విజయనగర్‌ స్టీల్‌ ప్లాంట్‌ అన్ని

అంతర్జాతీయ సర్వర్ల నుంచి భారత యూజర్ల డేటా తొలగింపు

Monday 17th December 2018

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలకు అనుగుణంగా భారత యూజర్ల డేటాను స్థానికంగానే భద్రపర్చేందుకు చర్యలు తీసుకున్నట్లు చెల్లింపు లావాదేవీల సంస్థ మాస్టర్‌కార్డ్‌ వెల్లడించింది. ఇందులో భాగంగా తమ అంతర్జాతీయ సర్వర్ల నుంచి ఈ డేటాను డిలీట్ చేస్తున్నట్లు సంస్థ భారత విభాగం ప్రెసిడెంట్ పొరష్‌ సింగ్‌ తెలిపారు. అయితే, కాలక్రమంలో ఇది డేటా భద్రతను బలహీనపర్చే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మాస్టర్‌కార్డ్‌ సుమారు 200 పైగా దేశాల్లో కార్యకలాపాలు

Most from this category