STOCKS

News


బాండ్లలోనూ రిస్క్‌ తీసుకుంటే అదనపు రాబడి

Monday 10th December 2018
personal-finance_main1544416955.png-22785

  • ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మీడియం టర్మ్‌ బాండ్‌

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ సంక్షోభం ఫలితంగా ఆ సంస్థ జారీ చేసిన డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసిన ఫండ్స్‌ ఎన్‌ఏవీపై చెప్పుకోతగ్గ ప్రతికూల ప్రభావం పడింది. అయితే, రిస్క్‌ తీసుకునే వారికి ఈ తరహా పథకాల్లో కాస్త అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. ఈ తరహా ఫండ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండడం కంటే సంక్షోభాల నుంచి పాఠాలు నేర్చుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం సరైనది. అధిక క్రెడిట్‌ రిస్క్‌ ఉన్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ముందు స్థిరమైన ట్రాక్‌ రికార్డు, రిస్క్‌తో కూడిన రాబడులను జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మీడియం టర్మ్‌ బాండ్‌ ఫండ్‌ను పరిశీలించొచ్చు. 
రాబడులు
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌ పేరుతో గతంలో ఈ పథకం కొనసాగగా, సెబీ మార్పుల తర్వాత పేరు మారింది. 50-60 శాతం నిధులను ఏఏ రేటింగ్‌, అంతకంటే తక్కువ రేటింగ్‌ కలిగిన సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఎక్కువ శాతం పెట్టుబడులను రిస్క్‌తో కూడిన, తక్కువ రేటింగ్‌ కలిగిన సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల కేటగిరీకి మించిన రాబడులను ఇస్తోంది. ఏడాదిలో 3.5 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 7 శాతం, పదేళ్లలో వార్షికంగా 8.5 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. కానీ, ఇదే కాలంలో ఈ విభాగం సగటు రాబడులు 3.7 శాతం, 6.9 శాతం, 8.3 శాతంగా ఉన్నాయి. రిస్క్‌ను పరిమితం చేసేందుకు గాను ఒక బాండ్‌లో గరిష్టంగా 3-4 శాతమే పెట్టుబడులను పెడుతుంది. అధిక రిస్క్‌ తీసుకునే వారు 2-3 ఏళ్ల కాలం కోసం ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. 
పెట్టుబడుల విధానం
కొన్ని డెట్‌ ఫండ్స్‌ పథకాలు... బాండ్ల ధరలు పెరగడం ద్వారా కంటే వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం ద్వారా రాబడికి ప్రాధాన్యం ఇస్తుంటాయి. అంటే తక్కువ రేటింగ్‌ కలిగిన బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక వడ్డీని పొందుతుంటాయి. గత మూడు సంవత్సరాలుగా చూసుకుంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మీడియం టర్మ్‌ బాండ్‌ ఫండ్‌ ఏఏ అంతకంటే తక్కువ రేటింగ్‌ కలిగిన సాధనాల్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసింది. 30-40 శాతం నిధులను ఏఏఏ, ఏఏప్లస్‌ రేటెడ్‌ బాండ్లలో పెట్టింది. మిగిలిన మొత్తాన్ని తక్కువ రేటింగ్‌ వాటిల్లో ఇన్వెస్ట్‌ చేసింది. దీంతో అన్ని కాలాల్లోనూ ఈ పథకం రాబడులు మెరుగ్గా ఉన్నాయి. సెబీ నిబంధనల ప్రకారం మీడియం టర్మ్‌ బాండ్‌ ఫండ్‌ మూడు, నాలుగేళ్లలో గడువు తీరే ఇనుస్ట్రుమెంట్లను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉండాలి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం పెట్టుబడుల కాల వ్యవధి సగటున 2-4 ఏళ్లలో తీరేవే ఉన్నాయి. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 32 శాతం ఏఏఏ, ఏఏప్లస్‌ రేటింగ్‌ కలిగినవి, 61 శాతం ఏఏ అంతకంటే తక్కువ రేటింగ్‌ సాధనాలు ఉన్నాయి. 

=============== టాప్‌ హోల్డింగ్స్‌ ===============
కంపెనీ    ఇనుస్ట్రుమెంట్‌    పెట్టుబడుల శాతం
వాల్వాన్‌ రెన్యువబుల్స్‌ ఎనర్జీ2022    4.53
బయోస్కోప్‌ సినిమాస్‌2020    4.09
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ హోటల్‌2022    3.58
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు2099    3.01
ఐసీఐసీఐ బ్యాంకు    2.88
గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌2020    2.75
జీఎంఆర్‌ ఎయిరో టెక్నిక్‌2024    2.56
టాటా రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా2019    2.55
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌2019    2.43
టీజీఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌2020    2.09You may be interested

మాల్యా అప్పగింతపై నేడు బ్రిటన్ కోర్టు తీర్పు

Monday 10th December 2018

లండన్‌:  రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించే అంశంపై బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం (నేడు) తీర్పునిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన అప్పగింతకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం భావించిన పక్షంలో తుదినిర్ణయం తీసుకునేందుకు ఈ కేసును బ్రిటన్ హోంశాఖకు పంపవచ్చని న్యాయనిపుణులు జైవాలా అండ్ కో మేనేజింగ్ పార్ట్‌నర్ పావని రెడ్డి తెలిపారు. ప్రతికూల ఉత్తర్వులు వచ్చిన పక్షంలో

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 10th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు యాక్సిస్‌ బ్యాంక్‌:- బోర్డు అదనపు డైరెక్టర్‌గా అమితాబ్‌ చౌదరిని నియమించింది. అలాగే స్వతంత్ర డైరెక్టర్లుగా సమీర్‌, సోమ్‌ మిట్టల్‌, రోహిత్‌ భగత్‌లను పదవికాలాన్నీ మరో 8ఏళ్ల పాటు పెంచుతున్నట్లు బోర్డు ప్రకటించింది. అలెంబిక్‌ ఫార్మా:-  ఎన్‌సీడీ కమిటీ డిసెంబర్‌ 14వ తేదిన సమావేశం కానుంది. ఈ సమావేశంలో రూ.350 కోట్ల విలువైన అన్‌సెక్యూర్డ్‌ లిస్టెడ్‌ రీడమబుల్‌ నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల(ఎన్‌సీడీ)ల జారీ కమిటీ ఆమోదం

Most from this category