STOCKS

News


రాబడులు మెరుగ్గా ఉండాలనుకుంటే...

Monday 5th November 2018
personal-finance_main1541392800.png-21696

హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ 100 
ప్రస్తుతం మార్కెట్లో అస్థిరతలు, ప్రతికూల రాబడుల సమయంలోనూ మంచి ప్రతిఫలాన్ని ఆశించే వారు... గతం నుంచీ పనిచేస్తూ పనితీరు పరంగా పేరున్న పథకాలను ఎంచుకోవడం మంచి ఆలోచనే అవుతుంది. ఆ విధంగా చూసినప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌-100 ముందు వరుసలో ఉంటుంది. సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో మార్పుల జరక్కముందు... ఈ ఏడాది మే వరకు హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌-200 పేరుతో కొనసాగింది. హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌-100 ప్రధానంగా లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. మొత్తం నిధుల్లో 80 శాతాన్ని మార్కెట్‌ విలువ పరంగా అగ్ర స్థానంలో ఉన్న 100 కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. అందుకే అటుపోట్లు ఎదురైన సమయాల్లోనూ పథకం పనితీరు కాస్త మెరుగ్గా ఉంటోంది. ఇతర పథకాలతో పోలిస్తే రిస్క్‌ కాస్త తక్కువే. 
పనితీరు
లార్జ్‌క్యాప్‌ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ 100 దీర్ఘకాలంలో టాప్‌ పనితీరును చూపిస్తూ వస్తోంది. గడచిన ఐదేళ్ల కాలంలో చూసుకుంటే వార్షిక రాబడులు 14.5 శాతంగా ఉన్నాయి. మరి ఇదే సమయంలో ఈ కేటగిరీకి ప్రామాణిక సూచీ నిఫ్టీ100 రాబడులు 12.7 శాతమే ఉన్నాయి. మూడేళ్ల కాలంలో చూసుకుంటే మాత్రం ఈ పథకం రాబడులు 8.5 శాతంగా ఉంటే, బెంచ్‌ మార్క్‌ నిఫ్టీ 100 రాబడులు కాస్త అధికంగా 8.7 శాతం చొప్పున ఉన్నాయి. ఏడాది కాలంలో ఈ పథకం 0.3 ప్రతికూల రాబడులను ఇచ్చింది. పదేళ్ల కాలంలో చూసుకున్నా ప్రామాణిక సూచీ కంటే ఈ పథకం రాబడులు ఎక్కువే ఉన్నాయి. అంటే దీర్ఘకాలం కోసం ఈ పథకం అనువైనదని భావించొచ్చు. బెంచ్‌ మార్క్‌తో స్వల్ప తేడానే  దీర్ఘకాలంలో పెట్టుబడులపై అధిక రాబడులకు కారణమవుతుందన్న సంగతిని మర్చిపోరాదు. అయితే ఓ పథకం గత పనితీరు భవిష్యత్తు పనితీరుకు హామీ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 
పెట్టుబడుల విధానం
అధిక నాణ్యతతో కూడిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ఈ పథకం అనుసరించే పెట్టుబడుల విధానంలో భాగం. ఈ పథకం ఎంచుకునే కంపెనీలు కూడా ఆయా రంగాల్లో పెద్ద సంస్థలే. గడ్డు పరిస్థితుల్లోనూ అటువంటి కంపెనీలు ఎదుర్కొని నిలబడగలవు. ముఖ్యంగా ఈ పథకం నిధుల్లో 60 శాతం పది కంపెనీల్లోనే పెట్టుబడి పెట్టడం గమనార్హం. వీటిలో రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ తదితర కంపెనీలు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియో స్టాక్స్‌ వ్యాల్యూషన్లను నిరంతరం గమనిస్తూ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని గమనించొచ్చు. ఇందుకు ఉదాహరణ... ఇటీవలి మార్కెట్‌ పతనానికి ముందే మారుతి సుజుకి స్టాక్‌ నుంచి వైదొలగడం. అలాగే, ఎక్కువగా నష్టపోయిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో పెట్టుబడులను పెంచుకుంది. ఇక దీర్ఘకాలంగా ప్రభుత్వరంగ స్టాక్స్‌ పట్ల అనుకూలతను కొనసాగిస్తోంది. దీంతో తాజా పతనంలో విలువల పరంగా ఆకర్షణీయంగా ఉన్న కొన్ని ప్రభుత్వరంగ కంపెనీల్లో అదనంగా ఇన్వెస్ట్‌ చేసింది. దాదాపు అన్ని మార్కెట్‌ పరిస్థితుల్లోనూ ఈ పథకం అధిక శాతం నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తూ కొనసాగుతోంది. అంటే పరిమిత నగదు నిల్వలనే కలిగి ఉంటోంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. 

టాప్‌ హోల్డింగ్స్‌
కంపెనీ    పెట్టుబడుల శాతం
ఇన్ఫోసిస్‌    8.64
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌    8.45
ఐసీఐసీఐ బ్యాంకు    7.22
ఎస్‌బీఐ    6.69
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు    6.15
ఎల్‌అండ్‌టీ    5.78
ఐటీసీ    5.66
ఎన్‌టీపీసీ    4.23
టీసీఎస్‌    3.70
యాక్సిస్‌ బ్యాంకు    3.44
 You may be interested

చీకట్లో చిరుదివ్వెలు...

Monday 5th November 2018

మన స్టాక్‌ మార్కెట్‌ ఈ ఏడాది ఎన్నడూ చూడనంత తీవ్రమైన ఒడిడుదుకులను చవిచూస్తోంది. ఆగస్టు వరకూ ఆకాశమే హద్దుగా చెలరేగి రోజుకో కొత్త ఆల్‌టైమ్‌ గరిష్టాలను తాకిన దేశీ సూచీలు... ఆ తర్వాత హఠాత్తుగా కుప్పకూలి ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం రూపంలో మార్కెట్లను తాకిన సునామీ దెబ్బకి బ్లూచిప్స్‌ షేర్లు కూడా 20–50 శాతం దాకా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లలో మరింత ఇన్వెస్ట్‌ చేయాలా? మార్కెట్లు

ఐటీసీ కొనచ్చు..

Monday 5th November 2018

భెల్‌     అమ్మేయండి  బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ. 73 టార్గెట్‌ ధర: రూ.60 ఎందుకంటే:  విద్యుదుత్పత్తి, పారిశ్రామిక యంత్రాలను తయారు చేసే ఈ ప్రభుత్వ రంగ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈపీసీ(ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) కార్యకలాపాలు కూడా నిర్వహించే ఈ కంపెనీ ఈ క్యూ2 ఫలితాల్లో అమ్మకాలు మినహా మరే ఇతర అంశాలు అంచనాలను అందుకోలేకపోయాయి. అమ్మకాలు 8

Most from this category