News


స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాల కోసం... ఫ్రాంక్లిన్‌ ఇండియా అల్ట్రా షార్ట్‌ బాండ్‌ ఫండ్‌

Monday 15th October 2018
personal-finance_main1539580909.png-21148

పెట్టుబడులపై రిస్క్‌కు భయపడేవారు, డెట్‌ సాధనాల్లోనూ కాస్తంత సురక్షితమైన సాధనం కోసం చూసే వారు ఫ్రాంక్లిన్‌ ఇండియా అల్ట్రా షార్ట్‌ బాండ్‌ ఫండ్‌ - సూపర్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. అధిక రేటింగ్‌ కలిగిన షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెడుతుంది. మనీ మార్కెట్‌ ఇనుస్ర్టుమెంట్లు, కమర్షియల్‌ పేపర్లు పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ వాటాను ఆక్రమిస్తాయి. ఈ కేటగిరీలో గత పదేళ్ల కాలంలో టాప్‌ పథకాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. ఇందులో రాబడులను చూసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏడాది కాలంలో బెంచ్‌ మార్క్‌ (క్రిసిల్‌ లిక్విడిటీ ఫండ్‌ ఇండెక్స్‌) రాబడులు 7.2 శాతంగా ఉంటే ఈ పథకంలో 7.5 శాతంగా ఉన్నాయి. అలాగే, ఈ పథకంలో మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 8.7 శాతం, ఐదేళ్లలో వార్షిక రాబడులు 9.2 శాతంగా ఉన్నాయి. కేటగిరీ రాబడులు మూడేళ్లలో 7.2 శాతం, ఐదేళ్లలో 7.9 శాతంగా ఉండడం గమనార్హం. కేటగిరీతో పోలిస్తే దీర్ఘకాలంలో 1.5 శాతం అధిక రాబడులను ఫ్రాంక్లిన్‌ ఇండియా అల్ట్రా షార్ట్‌ బాండ్‌ ఫండ్‌ ఇచ్చింది. ఎక్కువ సమయాల్లో బెంచ్‌ మార్క్‌ కంటే ఎక్కువ రాబడులను ఈ పథకం అందించిన చరిత్ర ఉంది. కనుక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకునేవారు ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా ఆ మొత్తంపై మంచి రాబడులను పొందొచ్చు. ఇక ఐదేళ్లు, పదేళ్ల కాలంలో మెరుగైన రాబడుల దృష్ట్యా దీర్ఘకాల అవసరాల కోసం ఇన్వెస్ట్‌ చేసుకోవాలని భావించే వారికి ఈ పథకం అనువుగానే ఉంటుంది. ఎందుకంటే డైనమిక్‌ బాండ్‌ లేదా క్రెడిట్‌రిస్క్‌ ఫండ్స్‌ కంటే ఇందులోనే రాబడులు అధికంగా ఉన్నాయి. 

పోర్ట్‌ఫోలియో
పేరులో ఉన్నట్టు... ఏడాదిలోపు కాల వ్యవధి తీరే సాధనాల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. పోర్ట్‌ఫోలియో ఈల్డ్‌ను కొన్నేళ్లుగా 8.5-8.7 శాతం మధ్య ఉండేలా చూస్తోంది. ఫ్రాంక్లిన్‌ ఇండియా అల్ట్రా షార్ట్‌ బాండ్‌ ఫండ్‌ తన పెట్టుబడుల్లో సగం మేర స్వల్ప కాల సాధనాలకు టాప్‌ రేటింగ్‌ అయిన ఏ1ప్లస్‌ వాటిల్లోనే ఇన్వెస్ట్‌ చేసింది. యాక్సిస్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు సర్టిఫికేట్‌ డిపాజిట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నాబార్డ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కమర్షియల్‌ పేపర్లు, ఐఆర్‌ఎఫ్‌సీ, రెన్యూ పవర్‌ తదితర కంపెనీల కార్పొరేట్‌ డెట్‌ సాధనాల్లో ఈ పథకం పెట్టుబడులు ఉన్నాయి. ఇటీవల రేటింగ్‌ స్వల్పంగా తగ్గిన సాధనాల్లోనూ పెట్టుబడులు కలిగి ఉంది. కాకపోతే వీటి వెనుక పెద్ద వ్యాపార గ్రూపులు ఉన్నాయి. పిరమల్‌ రియాలిటీ, టాటా మోటార్స్‌, రిలయన్స్‌ బ్రాడ్‌కాస్ట్‌ నెట్‌వర్క్‌ ఇందుకు ఉదాహరణలు. మొత్తం మీద 75-80 వరకు భిన్నమైన సంస్థల సెక్యూరిటీల్లో పెట్టుబడులు కలిగి ఉంది. నిజానికి అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ను స్వల్ప కాలం కోసమే సూచిస్తుంటారు. అయితే, దీర్ఘకాలంలో రాబడులు మెరుగ్గా ఉన్నప్పుడు దీర్ఘకాల అవసరాలకు కూడా వీటిని ఎంచుకోవడం తప్పేమీ కాదు. 

 టాప్‌ హోల్డింగ్స్‌
కంపెనీ    ఇనుస్ట్రుమెంట్‌    రేటింగ్‌ పెట్టుబడుల శాతం
9.6%    రెన్యూపవర్‌2021    డిబెంచర్‌    ఏప్లస్‌    4.42
హెచ్‌డీఎఫ్‌సీ 182-డీ 01/02/2019    కమర్షియల్‌పేపర్‌    ఏ1ప్లస్‌    4.30
9.2% డీఎల్‌ఎఫ్‌ హోమ్‌ డెవలపర్స్‌2019    డిబెంచర్‌    ఏ    3.89
ఆదిత్య బిర్లా రిటైల్‌ 2019    డిబెంచర్‌    ఏ-    3.19
నాబార్డ్‌ 91-డి 06/12/2018    కమర్షియల్‌ పేపర్‌ ఏ1ప్లస్        2.61
9.6% పిరమల్‌ రియాలిటీ2020    డిబెంచర్‌    ఏఏ-    2.31
బజాజ్‌ ఫైనాన్స్‌ 104-డీ 22/11/2018    కమర్షియల్‌ పేపర్‌    ఏ1ప్లస్‌2.22You may be interested

యాంఫీ చైర్మన్‌గా నిమేష్ షా

Monday 15th October 2018

న్యూఢిల్లీ: అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) నూతన చైర్మన్‌గా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో నిమేష్ షా ఎంపికయ్యారు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ ఎ.బాలసుబ్రమణ్యన్‌ స్థానంలో ఈయన్ని నియమించినట్లు యాంఫీ ప్రకటించింది. 2007 నుంచి మ్యూచువ‌ల్ ఫండ్స్ పరిశ్రమలో షా సేవలందిస్తున్నట్లు పేర్కొంది. ఇక వైస్‌ చైర్మన్‌గా ఎల్‌ అండ్‌ టీ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓ కైలాష్ కులకర్ణి

స్వల్పంగా పెరిగిన పసిడి ధర

Monday 15th October 2018

ఆసియా మార్కెట్లు నష్టాల ట్రేడింగ్ నేపథ్యంలో సోమవారం పసిడి ధర స్వల్పంగా లాభపడింది. భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:15ని.కు ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 3.40డాలర్లు లాభపడి 1,225.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచదేశాల మధ్య వాణిజ్యయుద్దం కొనసాగుతుండం, వడ్డీరేట్ల పెంపుపై యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సానుకూల ధోరణితో  ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు బ్రెగ్జిట్‌ ఆందోళనలు, యూరో పతనంతో డాలర్‌

Most from this category