STOCKS

News


మిడ్‌క్యాప్‌లో మంచి ట్రాక్‌ రికార్డు 

Monday 6th August 2018
personal-finance_main1533530797.png-18974

  • ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఫండ్‌

మిడ్‌ క్యాప్‌ విభాగం రిస్క్‌ అధికంగా ఉన్నా, దీర్ఘకాలంలో అధిక రాబడులను ఇచ్చే సామర్థ్యం కలది. ఈ విభాగంలో కాస్తంత భద్రత, అదే సమయంలో స్థిరమైన రాబడులను అందించే పథకాల్లో ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఫండ్‌ కూడా ఒకటి. కనీసం ఐదేళ్లు, ఆపై కాల వ్యవధి కోసం, మెరుగైన రాబడులను ఆశించే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఈ పథకం ప్రారంభించి 25 ఏళ్లు అయింది. ఇప్పటికీ అప్పటి నుంచి చూసుకుంటే రాబడులు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. 

రాబడులు
ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సగటున వార్షిక రాబడులు 20 శాతంగా ఉన్నాయి. ఎక్కువగా ఒకే స్టాక్‌, ఒకటే రంగంపై ఆధారపడకుండా, పెట్టుబడుల వికేంద్రీకరణ ద్వారా రిస్క్‌ను సాధ్యమైనంత వరకు తగ్గించడం ఈ పథకం పనితీరులో ఒకటిగా గమనించొచ్చు. ముఖ్యంగా రిస్క్‌ను తగ్గించేందుకు కొన్ని లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ను కూడా పోర్ట్‌ఫోలియోకు యాడ్‌ చేస్తుంటుంది. అదే సమయంలో, లార్జ్‌క్యాప్‌లో పెట్టుబడులను 15 శాతం మించనీయదు. మిడ్‌క్యాప్‌ విభాగంలో ఇన్వెస్ట్‌ చేసేవారికి ఓ మంచి ఎంపికగా, పనితీరు పరంగా మెరుగైన స్థానంలో ఉంది. నంబర్‌ 1 స్థానంలో లేకపోవచ్చు కానీ, మిడ్‌క్యాప్‌ విభాగం సగటు రాబడులకు మించిన పనితీరు ఈ పథకం సొంతం. మూడు, ఐదు, పదేళ్ల కాలంలో చూసుకుంటే ప్రామాణిక సూచీ నిఫ్టీ 500 కంటే ఈ పథకం పనితీరు ఎగువనే ఉంది. మూడేళ్ల కాలంలో బెంచ్‌ మార్క్‌ కంటే 2 శాతం, ఐదేళ్ల కాలంలో చూస్తే బెంచ్‌ మార్క్‌ కంటే 9 శాతం, పదేళ్ల కాలంలో 8 శాతం అధిక రాబడులను ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఫండ్‌ అందించింది. గత పదేళ్ల కాలంలో ఈ పథకం పోటీ పథకాలైన ఎస్‌బీఐ మిడ్‌క్యాప్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మిడ్‌క్యాప్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మిడ్‌క్యాప్‌ కంటే పనితీరులో ముందుంది. 

పోర్ట్‌ఫోలియో
విడిగా ఒక్కో స్టాక్‌లో పెట్టుబడులను 3-4 శాతం మించనీయకుండా ఫండ్‌ మేనేజర్లు జాగ్రత్త తీసుకుంటారు. పోర్ట్‌ఫోలియో 50-60 స్టాక్స్‌తో ఉండడాన్ని గమనించొచ్చు. మార్కెట్ ర్యాలీ సమయాల్లో ఈ పథకం రాబడులు కూడా మెరుగ్గానే ఉండడం, అలాగే కరెక్షన్‌లో పతనాన్ని పరిమితం చేసే విధంగా పోర్ట్‌ఫోలియో విధానాన్ని కొనసాగిస్తోంది. మార్కెట్లలో ఆటుపోట్లు పెరిగితే 7-9 శాతం మేర నగదు, డెట్‌ విభాగంలో పెట్టుబడులను ఉంచేస్తుంది. ఎక్కువ పెట్టుబడులను బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ స్టాక్స్‌లో పెట్టడాన్ని గమనించొచ్చు. అయినప్పటికీ ఈ విభాగంలో నాణ్యమైన స్టాక్స్‌గా పేరొందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ మహింద్రా బ్యాంకు, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, సిటీ యూనియన్‌ బ్యాంకులనే ఎంచుకుంది. గడిచిన ఏడాది కాలంలో ఆటో యాన్సిలరీ, పారిశ్రామిక ఉత్పత్తుల రంగాలకు చెందిన కంపెనీల్లో ఎక్స్‌పోజర్‌ పెంచుకుంది. అలాగే, కన్జ్యూమర్‌ నాన్‌ డ్యురబుల్స్‌లోనూ పెట్టబడులను పెంచుకుంది. కానీ, ఇదే సమయంలో ఐటీ స్టాక్స్‌లో ఎక్స్‌పోజర్‌ తగ్గించుకోవడం గమనార్హం. నిజానికి గత ఏడాది కాలంలో ఐటీ స్టాక్స్‌ ర్యాలీ చేయడంతో ఆ స్థాయి రాబడుల అవకాశాలను ఈ పథకం కోల్పోయింది. అయినప్పటికీ దీర్ఘకాలంలో విభాగానికి మించి రాబడులను అందించే సత్తా ఈ పథకానికి ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

 టాప్‌ హోల్డింగ్స్‌
కంపెనీ పేరు    పెట్టుబడుల శాతం
ఫినోలెక్స్‌ కేబుల్స్‌    3.81
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు    3.26
కోటక్‌ బ్యాంకు    2.86
యస్‌ బ్యాంకు    2.57
సిటీ యూనియన్‌ బ్యాంకు    2.57
అపోలో టైర్స్‌    2.56
వోల్టాస్‌    2.46
ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌        2.41
వాబ్కో ఇండియా    2.37
కన్సాయ్‌ నెరోలాక్‌    2.34



You may be interested

ఫారం 26ఏఎస్‌ తప్పుల తడకైతే.. 

Monday 6th August 2018

ఆదాయ పన్ను శాఖ నిర్వహించే వెబ్‌సైట్‌లో మీకు సంబంధించిన ఆదాయ పన్నుల రికార్డును ఫారం 26ఏఎస్‌ అంటారు. మీరు చెల్లించే టీడీఎస్‌, అడ్వాన్స్‌ ట్యాక్స్‌, సెల్ఫ్‌ అస్సెస్‌మెంట్‌ ట్యాక్స్‌ ఈ రికార్డులో నమోదవుతుంది. స్వయంగా చెల్లించే ముందస్తు పన్ను, ఆ తరువాత సెల్ఫ్‌ అస్సెస్‌మెంట్‌ ట్యాక్స్‌ వివరాలతో పాటు మీ పేరు, చిరునామా, పాన్‌ కార్డ్‌ నెంబర్‌ వివరాలు ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు బ్యాంకులో జమచేసిన మొత్తం

టెక్‌ మహీంద్రలో 4,000 కొత్త నియామకాలు

Monday 6th August 2018

న్యూఢిల్లీ: వచ్చే తొమ్మిది నెలలకాలంలో 4,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉందని టెక్‌ మహీంద్ర సీఈఓ సీపీ గుర్నానీ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1,800 మందిని నియమించుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. జూన్‌ 2018 నాటికి కంపెనీలో 1,13,552 మంది ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించిన ఆయన వీరిలో సాఫ్ట్‌వేర్‌ నిపుణుల సంఖ్య 72,462.. బీపీఓ విభాగంలో 34,700 మంది ఉద్యోగులు, సేల్స్‌లో 6,390 మంది

Most from this category