News


నిఫ్టీ 50ని మించి రాబడి

Monday 24th December 2018
personal-finance_main1545625178.png-23186

  •  యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌

మార్కెట్లు పెరిగినప్పుడు లాభాలు పొందడం సులభమే. దాదాపు అన్ని స్టాక్స్‌ చెప్పుకోతగ్గ రాబడులను ఇస్తుంటాయి. దీంతో అసలు ఏ తరహా స్టాక్స్‌లో లాభాలు వస్తాయనే ఫండమెంటల్స్‌ను ఇన్వెస్టర్లు పట్టించుకోరు. కానీ, మార్కెట్లు కరెక్షన్‌లోకి వెళ్లినప్పుడు అప్పటి వరకు ఉన్న లాభాలను కాపాడుకోవడంతోపాటు నష్టాలను పరిమితం చేసుకోవాలంటే, అందు కోసం నాణ్యమైన స్టాక్స్‌పై దృష్టి సారించాల్సి ఉంటుంది. మార్కెట్లలో ప్రతికూల సమయాల్లోనూ అధిక వృద్ధికి అవకాశాలు ఉండి, తక్కువ అస్థిరతలకు అవకాశం ఉన్న నాణ్యమైన స్టాక్స్‌ను ఎంచుకోవడం ప్రధానం. యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌ ఇదే పని చేస్తుంది. 

ఈ పథకం 2010 ఫిబ్రవరిలో మొదలైంది. ప్రధానంగా లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈ ఫండ్‌కు ఈక్విటీ మార్కెట్లలో 16 ఏళ్ల అనుభవం కలిగిన శ్రేయాస్‌ దేవల్కర్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ-50 ఈ పథకం పనితీరుకు ప్రామాణిక సూచీ. అంటే నిఫ్టీ 50 పనితీరుకు తగ్గకుండా రాబడులను అందించడం ఈ పథకం లక్ష్యం. అధిక నాణ్యతతో కూడిన వ్యాపారం, బలమైన పోటీ ఇవ్వగల సానుకూలతలు, మంచి క్యాష్‌ ఫ్లో, అలాగే, బలమైన బ్యాలన్స్‌ షీట్‌, విశ్వసనీయమైన ‍యాజమాన్యం ఉన్న కంపెనీలను పెట్టుబడులకు ఎంచుకోవడం ఈ పథకం అనుసరించే వ్యూహం. 

రాబడులు 
దాదాపు అన్ని కాలాల్లోనూ ఈ పథకం పనితీరు నిఫ్టీ-50 సూచీ కంటే ఎగువనే ఉండడం గమనార్హం. ఏడాది కాలంలో 6.51 శాతం, మూడేళ్లలో వార్షికంగా 12.81 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 14.56 శాతం చొప్పున ఈ పథకం రాబడులు ఇచ్చింది. కానీ, ఇదే కాలంలో నిఫ్టీ 50 రాబడులు ఏడాదిలో 4.46 శాతం, మూడేళ్లలో 12.61 శాతం, ఐదేళ్లలో 12.76 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లు ఇంకా కరెక్షన్‌ దశలోనే ఉన్నాయి. దీంతో అధిక ఆటుపోట్లతో కూడిన ఇతర పథకాల కంటే లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే యాక్సిస్‌ బ్లూచిప్‌ తరహా ఫండ్స్‌ అంతగా రిస్క్‌ వద్దనుకునే ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటాయి. లార్జ్‌క్యాప్‌ పథకమే అయినప్పటికీ, బెంచ్‌ మార్క్‌ను మించి మెరుగైన రాబడులను పంచే విధంగా ఈ పథకం పనిచేయడాన్ని గమనించాల్సిన అంశం. కనీసం ఐదేళ్లకు పైగా ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు తప్పకుండా దీనిపై దృష్టి పెట్టొచ్చు. సిప్‌ ద్వారా పెట్టుబడులతో మరింత స్థిరమైన రాబడులకు అవకాశం ఉంటుంది. ‘‘90 శాతం అంతకంటే ఎక్కువ నిధులను టాప్‌ 100 కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలన్న ఈ పథకం విధానం ఆకర్షించేది. స్టాక్‌ ఎంపికకు బోటమ్‌అప్‌ విధానాన్ని అనుసరిస్తుంది’’ అని ఫండ్స్‌ సూపర్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ రేణు పోతెన్‌ ఈ పథకం గురించి తన అభిప్రాయాన్ని తెలిపారు. ఓ మోస్తరు రిస్క్‌ భరించే వారికి ఈ పథకాన్ని సూచించారు. 

టాప్‌ హోల్డింగ్స్‌
కంపెనీ    పెట్టుబడుల శాతం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు    10.08
కోటక్‌ మహీంద్రా బ్యాంకు    7.83
బజాజ్‌ ఫైనాన్స్‌    6.82
మారుతి సుజుకీ    5.70
టీసీఎస్‌    4.89
ఐసీఐసీఐ బ్యాంకు    4.83
హెచ్‌డీఎఫ్‌సీ    4.41
అవెన్యూ సూపర్‌మార్ట్స్‌    3.92
హిందుస్తాన్‌ యూనిలీవర్‌    3.62
టైటాన్‌    2.95


 You may be interested

నెలాఖరుకు బీఓబీ, దేనా, విజయా బ్యాంకుల విలీన స్కీము ఖరారు..

Monday 24th December 2018

ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంకు, దేనా బ్యాంక్‌ల విలీన ప్రక్రియకు సంబంధించిన స్కీమ్ ఈ నెలాఖరు కల్లా ఖరారు కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందు కూడా దీన్ని ఉంచే అవకాశ౾ం ఉందని వివరించాయి. జనవరి 8 దాకా ఈ సమావేశాలు జరగనున్నాయి. స్కీమ్‌పై ప్రస్తుతం కసరత్తు జరుగుతుండగా, తర్వాత మూడు బ్యాంకుల బోర్డులు దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. షేర్ల

పబ్లిక్‌ క్రెడిట్‌ రిజిస్ట్రీ కోసం ఆరు ఐటీ కంపెనీలఎంపిక

Monday 24th December 2018

న్యూఢిల్లీ: డిజిటల్‌ పౌర క్రెడిట్‌ రిజిస్ట్రీ (పీసీఆర్‌/పౌరుల రుణాల సమాచార కేంద్రం) ఏర్పాటుకు గాను ఆర్‌బీఐ ఆరు అగ్ర స్థాయి ఐటీ కంపెనీలను షార్ట్‌ లిస్ట్‌ చేసింది. వీటిల్లో టీసీఎస్‌, విప్రో, ఐబీఎం ఇండియా, క్యాప్‌ జెమిని, డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌, మైండ్‌ట్రీ ఉన్నాయి. ఈ ప్రతిపాదిత పీసీఆర్‌లో సెబీ, కార్పొరేట్‌ వ్యహారాల శాఖ, జీఎస్టీ నెట్‌వర్క్‌, ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ బోర్డ్‌ల తరఫు నుంచి సమాచారం సైతం

Most from this category