STOCKS

News


లిక్విడిటీ ఫండ్స్‌కు లాకిన్‌?

Tuesday 13th November 2018
personal-finance_main1542085138.png-21928

న్యూఢిల్లీ: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం అనంతరం మార్కెట్లో లిక్విడిటీ (నిధుల లభ్యత) సమస్య నెలకొనడంతో లిక్విడిటీ ఫండ్స్‌ విషయంలో కఠిన నిబంధనలను తీసుకురావాలని సెబీ యోచిస్తోంది. లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు ప్రస్తుతం ఉంది. అయితే, స్వల్ప కాలం పాటు లాకిన్‌ తీసుకురావాలన్నది సెబీ ప్రతిపాదనగా తెలిసింది. 30 రోజులు అంతకంటే ఎక్కువ కాల వ్యవధి కలిగిన బాండ్ల విలువను మార్క్‌ టు మార్కెట్‌ చేయడాన్ని కూడా సెబీ తప్పనిసరి చేయాలనుకుంటోంది. ప్రస్తుతం 60 రోజులు, అంతకు మించి కాల వ్యవధి ఉన్న బాండ్లపైనే ఫండ్స్‌ సంస్థలు మార్క్‌ టు మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీనిపై సెబీ నియమించిన మ్యూచువల్‌ ఫండ్‌ అడ్వైజరీ కమిటీ చర్చిస్తుందని, అనంతరం సెబీ సంప్రతింపులు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలియజేశాయి. 
సంస్థాగత ఇన్వెస్టర్లపై ప్రభావం
లిక్విడ్‌ ఫండ్స్‌లో స్వల్పకాల లాకిన్‌ అనేది ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లపై ప్రభావం చూపిస్తుందని క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో జిమ్మీ పటేల్‌ తెలిపారు. అధిక లిక్విడిటీ (అవసరమైన సందర్భాల్లో నిధులను వెనక్కి తీసుకునే వెసులుబాటు) వల్లే ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి మొగ్గు చూపుతుంటారని పేర్కొన్నారు. ‘‘లిక్విడ్‌ ఫండ్స్‌లో ఎక్కువగా పాల్గొనేది కార్పొరేట్లు, బ్యాంకులు తదితర ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లే. లాకిన్‌ పీరియడ్‌ అన్నది వీరిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అదే సమయంలో స్థిరమైన ఎన్‌ఏవీ వల్ల రిటైల్‌ ఇన్వెస్టర్లకు లాభం కలుగుతుంది’’ అని బ్యాంక్‌ బజార్‌ హెడ్‌ ఆదిత్య బజాజ్‌ పేర్కొన్నారు. ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో ఊహించని నిధుల రాక, పోకల వల్ల ఎన్‌ఏవీలు ప్రభావితం అవుతాయని, దీన్ని నిరోధించడం వల్ల ఎన్‌ఏవీ స్థిరపడుతుందని చెప్పారాయన. సమస్యాత్మక సందర్భాల్లో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకోకుండా లాకిన్‌ అడ్డుకుంటుందన్నారు. అయితే, ఫ్లోటర్‌ ఫండ్స్‌ వంటి వాటినీ లాకిన్‌ పరిధిలోకి తీసుకురావాలని, లేకపోతే ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు ఇటువంటి ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతారని అభిప్రాయపడ్డారు. You may be interested

ట్రాయ్‌ పరిధిలోకి వాట్సాప్‌, గూగుల్‌ డూయో!?  

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: టెలికం సంస్థల మాదిరే మెస్సేజ్‌లు, కాల్స్‌కు అవకాశం కల్పిస్తున్న వాట్సాప్‌, స్కైప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ డుయో తదితర ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ) సేవలను నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలన్న అంశంపై ట్రాయ్‌ సంప్రతింపుల పత్రాన్ని విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ప్రస్తుత నియంత్రణ విధానంలో తేవాల్సిన మార్పులపై విశ్లేషణకు, చర్చకు అవకాశం కల్పించడం కోసం ఈ పత్రాన్ని తీసుకొచ్చింది. ఇంటర్నెట్‌ ఆధారంగా కాల్స్‌, మెస్సేజింగ్‌ సేవల అప్లికేషన్లను ఓటీటీగా

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 13th November 2018

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- తన కంపెనీ నెట్‌వర్క్‌ని మరింత వేగవంతం చేసుకోవడకానికి నెట్‌బ్రెయిన్‌ కంపెనీతో జట్టు కట్టింది. ఎన్‌బీసీసీ:- ఆయుష్‌ మంత్రిత్వశాఖ నుంచి రూ.260 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. లుపిన్‌:- అటోవాక్వోన్ ఓరల్ సస్పెన్షన్ యుఎస్‌పీ ఔషధాలకు అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. అరబిందో ఫార్మా:- తన అనుబంధ సంస్థ ఆస్ట్రేలియాకు చెందిన అడ్వెంట్ ఫార్మాస్యూటికల్స్ పీటీవై కంపెనీ ఆస్తులను సొంతం చేసుకుంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌

Most from this category