STOCKS

News


ఎస్‌బీఐ క్యాప్‌ వెంచర్స్‌ నుంచి రెండు ఫండ్స్‌

Tuesday 20th November 2018
personal-finance_main1542683877.png-22196

ముంబై: ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐక్యాప్‌ వెంచర్స్‌ (ఎస్‌వీఎల్‌) ఎంఎస్‌ఈ రంగానికి, అందుబాటు ధరల ఇళ్ల రంగానికి ఒక్కో ఫండ్‌ను ప్రారంభించింది. ఎస్‌ఎంఈ ఫండ్‌ ద్వారా రూ.400 కోట్లు, అందుబాటు ధరల ఇళ్ల ఫండ్‌ ద్వారా రూ.350 కోట్లు సమీకరించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ‘‘ఎస్‌ఎంఈకి సంబంధించి రూ.400 కోట్ల ఫండ్‌ అన్నది ఈక్విటీ ఆధారితంగా ఉంటుంది. ఇందులో ఎస్‌బీఐ, ఎస్‌బీఐ క్యాప్‌/ ఎస్‌వీఎల్‌ యాంకర్‌ ఇన్వెస్టర్లుగా ఉంటాయి’’అని ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఎండీ, సీఈవో వర్ష పురంధరే విలేకరులకు తెలిపారు. ఇంటర్నల్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ 18- 22 శాతం మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 



You may be interested

యస్ బ్యాంక్ బోర్డుకు చంద్రశేఖర్ రాజీనామా..

Tuesday 20th November 2018

న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ బోర్డు నుంచి మరొక సభ్యుడు నిష్క్రమించారు. వ్యక్తిగత కారణాలతో స్వతంత్ర డైరెక్టర్‌ రెంటాల చంద్రశేఖర్ సోమవారం రాజీనామా చేసినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు సంస్థ తెలిపింది. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి అశోక్ చావ్లా, బోర్డులో సభ్యత్వం నుంచి ఎస్‌బీఐ మాజీ చైర్మన్ ఓపీ భట్‌ ఇటీవలే తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు, బోర్డును పునర్‌వ్యవస్థీకరించాలని బ్యాంకు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు

నిస్సాన్ చీఫ్ ఘోన్‌ అరెస్ట్‌

Tuesday 20th November 2018

టోక్యో: ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్‌ చైర్మన్‌ కార్లోస్ ఘోన్‌ అరెస్టయ్యారు. తన ఆదాయాన్ని తక్కువగా చూపించటం సహా పలు అవకతవకలకు పాల్పడినట్లు ప్రాసిక్యూటర్ల విచారణలో వెల్లడైందని, దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారని జపాన్‌ వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. "ఆర్థిక సాధనాలు, విదేశీ మారక చట్టం నిబంధనల్ని ఉల్లంఘించారన్న అభియోగాలతో నిస్సాన్ చైర్మన్ ఘోన్‌ను టోక్యో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అరెస్టు చేసింది" అని

Most from this category