STOCKS

News


ఆర్‌డీ చేస్తున్నారా...? మరోసారి ఆలోచించండి!

Thursday 17th January 2019
personal-finance_main1547749206.png-23645

దీర్ఘకాలంలో మంచి పొదుపు సాధనం గురించి అడిగితే తల్లిదండ్రులు రికరింగ్‌ డిపాజిట్‌(ఆర్‌డీ) గురించి చెబుతారు. ఆర్‌డీ పోస్టాఫీసుతోపాటు బ్యాంకుల్లోనూ ప్రారంభించి ప్రతీ నెలా ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లొచ్చు. వడ్డీ రేటు ఎప్పటికప్పుడు మారుతుంటుంది. బ్యాంకును బట్టి ఇది కొంచెం వేర్వేరుగానూ ఉండొచ్చు. ప్రస్తుతం ఓ ప్రముఖ బ్యాంకులో ఆర్‌డీపై వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. మరి ఇది నిజంగా మంచి రాబడినిచ్చే సాధనమేనా? అని ప్రశ్నించుకోండి. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)లు కూడా ఇదే మాదిరిగా పనిచేస్తాయి. ఆర్‌డీలో ప్రతీ నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్‌ చేయగలిగిన వారు... దానికి బదులు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే...? దీర్ఘకాలంలో ఆర్‌డీతో పోలిస్తే ఈక్విటీ ఫండ్‌లో మంచి రాబడులు వస్తాయి. 

 

రికరింగ్‌ డిపాజిట్లు అన్నవి సంప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనం. ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌. ప్రతీ నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే అందుకు ఆర్‌డీ. ఈ రెండింటిలో ఇంతకు మించి ఉన్న తేడా ఏమీ లేదు. ప్రతీ నెలా ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ఆర్‌డీని ఎంచుకుంటుంటారు. అయితే, దీర్ఘకాలంలో మంచి సంపద సమకూరేందుకు ఆర్‌డీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వంటివి అక్కరకు రావనే నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఇవి ఆఫర్‌ చేసే రాబడులు తక్కువ. ద్రవ్యోల్బణ ప్రభావంతో సర్దుబాటు చేసి చూస్తే, ఆదాయపన్ను బాధ్యతను కూడా పరిగణనలోకి తీసుకుంటే మిగిలేది పిసరంత. ఆర్‌డీ 7 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తే, అదే సమయంలో ద్రవ్యోల్బణం 6 శాతం ఉందనుకుంటే మీకు మిగిలే రాబడి ఒక శాతమే. ఇందులో వచ్చిన వడ్డీపై పన్ను భారం ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మాదిరే, ఆర్‌డీపై రాబడి కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. 

 

పునరాలోచించాల్సిందే...
ఆర్‌డీకి బదులు సిప్‌ను ఎంచుకోవడం ఉత్తమ ఆలోచన. ఎందుకంటే దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్‌ మెరుగైన రాబడులు ఇస్తుంది. ప్రస్తుతం చూస్తే ఐదేళ్ల కాలంలో సిప్‌ రాబడులు మల్టీక్యాప్‌ విభాగంలో 12 శాతంగా ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఐదేళ్లలో సిప్‌ రాబడులు వార్షికంగా 12.8 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో 13.3 శాతం వరకు ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ను చూసినా... ఐదేళ్ల కాలంలో సిప్‌ పెట్టుబడులపై వార్షిక రాబడి 11.24 శాతం చొప్పున ఉంది. కనుక దీర్ఘకాలంలో ఆర్‌డీ కంటే ఈక్విటీ ఫండ్స్‌లో సిప్‌ మెరుగైన సాధనమని తెలుస్తోంది.  

 

రాబడులు ఇలా...
ఉదాహరణకు ప్రతీ నెలా రూ.10,000 చొప్పున ఆర్‌డీలో ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేశారనుకుంటే... 7 శాతం వడ్డీ రేటుపై సమకూరే మొత్తం రూ.7.20 లక్షలు. ఇంతే మొత్తాన్ని సిప్‌ రూపంలో ఈక్విటీ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌లో పెడుతూ పోతే.. రూ.7.89 లక్షలు వచ్చేవి. అదే మల్టీక్యాప్‌ ఫండ్‌లో అయితే రూ.7.98 లక్షలు, మిడ్‌క్యాప్‌ ఫండ్‌లో రూ.8.04 లక్షలు, స్మాల్‌క్యాప్‌ ఫండ్‌లో అయితే రూ.8.28 లక్షలు సమకూరి ఉండేవి. ఇక్కడ గమనించాల్సినవి ఏమిటంటే... ఈక్విటీల్లో పెట్టుబడులపై రాబడులకు, అసలుకు కూడా హామీ ఉండదు. స్వల్ప కాలంలో ఈక్విటీల్లో ఆటుపోట్లు ఉంటాయి. నష్టాలకు కూడా అవకాశం ఉంటుంది. అదే ఆర్‌డీలో అయితే అసలుకు, రాబడికి పూర్తి హామీ ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్‌లో సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేస్తే ఆటుపోట్లను అధిగమించి ఐదేళ్ల కాలంలో మెరుగై రాబడులే వస్తాయని ఇప్పటి వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 18th January 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు అర‌బిందో ఫార్మా:- అంకాలజీ వ్యాధి నివార‌ణ‌లో వినియోగించే ఏడు ఇంజెక్షన్‌ల‌ను అమెరికాకు చెందిన స్పెక్ట్రమ్ ఫార్మాస్యూటిక‌ల్స్ నుంచి కొనుగోలు చేసింది. మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.2,134 కోట్లు ఉంటుంది. లుపిన్‌:- ఇటీవ‌ల పీతాంబ‌రం యూనిట్లో త‌నిఖీలు పూర్తి యూఎస్ఎఫ్డీఏ అభ్యంత‌ర లెట‌ర్‌ను జారీ చేసిన‌ట్లు మీడియా వార్తలు వెలువ‌డ్డాయి. జెట్ ఎయిర్‌వేస్‌:- రెజుల్యూష‌న్ ప్రణాళిక‌లో భాగంగా ఎస్‌బీఐ ఆధ్వర్యంలో కన్షారియంకు న‌రేష్ గోయ‌ల్

ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ను అమ్మేస్తున్నారా..? ఒక్క నిమిషం!

Thursday 17th January 2019

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, ప్రభుత్వం ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కనుక ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడులపైనే పన్ను మినహాయింపు కానీ, అవిచ్చే రాబడులపై మాత్రం కాదన్న విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. కనుక ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ను విక్రయించే సమయంలో

Most from this category