STOCKS

News


పీపీఎఫ్‌ ఎప్పటికీ రాబడుల్లో రారాజే!

Friday 4th January 2019
personal-finance_main1546626037.png-23417

ఈక్విటీలు అధిక రాబడులు ఇ‍స్తాయని మన చుట్టూ ఉన్న వారిలో నమ్మేవారు తక్కువే. అందుకేనేమో... ఇప్పటికీ ఈక్విటీల్లోకి పెట్టుబడులు 5 శాతానికి మించలేదు. ఎప్పుడు మార్కెట్లు పెరుగుతాయో తెలియదు, ఎప్పుడు పడిపోతాయో అర్థం కాదు. ఓ స్టాక్‌ స్వల్ప కాలంలోనే రెట్టింపు అవుతుంది. కుడి ఎడమైతే సగానికి పైగా పడిపోనూ వచ్చు. అందుకే రిస్క్‌ తీసుకోలేని వారు ఎఫ్‌డీలు, పీపీఎఫ్‌ వంటి పథకాల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఎందుకంటే అవసరమైన సందర్భంలో ఈక్విటీల రిస్క్‌ను కొందరు భరించలేరు. ఉదాహరణకు నిఫ్టీ గతేడాది ఇచ్చిన రాబడులు కేవలం 2-3 శాతమే. కానీ, పీపీఎఫ్‌ పథకం ఇచ్చిన రాబడి 7.7 శాతం. ఈ మొత్తంపై రూపాయి పన్ను కూడా ఉండదు. ఈక్విటీ ఫండ్స్‌లో లాభాలపై పన్ను చెల్లించాల్సిందే. అందుకే సంప్రదాయ ఇన్వెస్టర్లకే కాదు, రిస్క్‌ తీసుకునే వారికీ పీపీఎఫ్‌ను పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోతగిన సాధనమేనంటున్నారు విశ్లేషకులు. 

 

పీపీఎఫ్‌ ఎంతో మంది మధ్యతరగతి ప్రజలకు ఆమోదనీయమైన పథకం. పన్ను ఆదా కోసం, దీర్ఘకాలంలో పన్ను రహిత అధిక రాబడుల కోసం దీన్ని మించిన సాధనం లేదనే చెప్పుకోవాలి. పీపీఎఫ్‌ కంటే కొంచెం ఎక్కువ రాబడులు ఇచ్చే డెట్‌ సాధనాలు లేవా...? ఎందుకు లేవు. అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌, లిక్విడ్‌ ఫండ్స్‌లో ఆరు నెలలు, ఏడాది రాబడులు 7.8 శాతం వరకూ ఉన్నాయి. కానీ, ఇవి హామీలేని రాబడులు. స్థిరంగా ఇంతే ఇస్తాయని చెప్పలేం. పీపీఎఫ్‌లో వడ్డీ రేటుకు కేంద్రం హామీ ఉంటుంది. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీ ఈల్డ్‌ కంటే పీపీఎఫ్‌లో వడ్డీ రేటు పావు శాతం ఎక్కువ. ద్రవ్యోల్బణం చెద ఒకటి ఉండనే ఉంది. 4 శాతం మేర రాబడులను ఇది తెలియకుండా తినేస్తుంది. దీనికితోడు లాభంపై పన్ను చెల్లిస్తే మిగిలేది శూన్యం... కానీ పీపీఎఫ్‌లో రాబడిపై పన్ను లేదు. వచ్చే 7.7 శాతంలో ద్రవ్యోల్బణ ప్రభావం పోను కొంత మిగులు కనిపిస్తుంది. రిస్క్‌ తీసుకోని వారికి పీపీఎఫ్‌ అన్నివేళలా అనువైన పథకమే. ఇక ఈక్విటీల్లో అగ్రెస్సివ్‌గా ఇన్వె‍స్ట్‌ చేసే వారు సైతం కొంత మేర డెట్‌లో పెట్టుబడి పెట్టుకోవడం సురక్షితమైన చర్య. అందుకోసం పీపీఎఫ్‌ వంటి పథకాలను పరిశీలించొచ్చు. You may be interested

రాబడులు పంచాలంటే... ఫండ్స్‌కు అయినా తెలివి ఉండాలె!

Friday 4th January 2019

గతేడాది మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఓ పాఠం వంటిది. దాదాపు అధిక శాతం పథకాలు రాబడులను పంచడంలో విఫలమయ్యాయి. కానీ, కొన్ని మాత్రం లాభాలను పంచాయి. ఎందుకని...? వాటికే ఆ ప్రత్యేకత ఎందుకు సాధ్యమైంది...? అందుకు ఫండ్‌ మేనేజర్లు ఏం చేశారో తెలుసుకోవాల్సిందే.   గతేడాది కొన్ని మల్టీక్యాప్‌ ఫండ్స్‌ సూచీలకు మించి రాబడులను అందించాయి. బ్యాంకింగ్‌, ఐటీ స్టాక్స్‌లో పెట్టుబడులే ఈ రాబడులకు కారణం. ఈ ఫండ్స్‌ బ్యాంకింగ్‌,

సెంట్రమ్‌ టాప్‌ పిక్స్‌

Friday 4th January 2019

వచ్చే సంవత్సర కాలానికి సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఐదు టాప్‌ స్టాక్స్‌ను రికమండ్‌ చేస్తోంది 1. ఏసీసీ: టార్గెట్‌ రూ. 1820. మంచి రిటర్న్‌ రేషియో, బలమైన నిధుల సరఫరా ఉండి ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ట్రేడవుతోంది. దశాబ్దం తర్వాత సామర్ధ్య విస్తరణ పనులు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇటీవల అంబుజాతో కుదుర్చుకున్న ఒప్పందం, డీజిల్‌ ధరల్లో క్షీణత కలిసివస్తాయి. 2. బజాజ్‌ఆటో: టార్గెట్‌ రూ. 3075. దేశంలో అగ్రగామి టు, త్రీవీలర్‌ సంస్థల్లో ఒకటి.

Most from this category