STOCKS

News


ఎన్‌పీఎస్‌ మరింత ఆకర్షణీయం 

Wednesday 10th October 2018
personal-finance_main1539111176.png-20986

జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) ఇటీవలి చేసిన పలు మార్పులతో మంచి ఆకర్షణీణయమైన రిటైర్మెంట్‌ సాధనంగా మారిపోయింది. చందాదారులకు మరింత అనుకూలంగా ఉండేందుకు పీఎఫ్‌ఆర్‌డీఏ పలు చర్యలు తీసుకుంది. 

 

అస్సెట్‌ అలోకేషన్‌
అస్సెట్‌ అలోకేషన్‌లో మార్పులు చేయడం జరిగింది. గతంలో యాక్టివ్‌ చాయిస్‌ ఆప్షన్‌ (అంటే ఇన్వెస్టర్లు ఈక్విటీ, డెట్‌లో ఎంత మేర పెట్టుబడులన్నది సొంతంగా నిర్ణయించుకునేది)లో ఈక్విటీలకు గరిష్ట కేటాయింపు 50 శాతమే ఉండేది. కానీ, అక్టోబర్‌ 1 నుంచి ఇది కాస్తా 75 శాతానికి పీఎఫ్‌ఆర్‌డీఏ పెంచింది. ఇది చిన్న వయసులోని వారికి చాలా అనుకూలమైన అంశం. ఎందుకంటే రిటైరయ్యే నాటికి ఈక్విటీల్లో అధిక పెట్టుబడుల కారణంగా మంచి రాబడులను అందుకునే వీలుంటుంది.

70 ఏళ్ల వరకు
చందాదారులు 70 ఏళ్ల వరకు పథకంలో కొనసాగొచ్చు. 60 ఏళ్ల వరకు తప్పనిసరి. అయితే, 60 ఏళ్ల తర్వాత కొనసాగాలనుకునే వారు 60 ఏళ్లకు కనీసం 15 రోజుల ముందు తెలియజేయాల్సి ఉండేది. ఇకపై 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఆరు నెలల్లోపు తెలియజేయవచ్చు. 

పాక్షిక ఉపసంహరణ
ఆరోగ్యం, వివాహం, ఇల్లు, విద్య వంటి అవసరాల్లో పాక్షిక ఉపసంహరణలకు ప్రస్తుతం వీలుంది. అయితే, ఇకపై వీటికి అదనంగా నైపుణ్యాలు పెంచుకునేందుకు, వ్యాపారాలు, వెంచర్ల ప్రారంభం కోసం అనుభవం సాధించడానికి కూడా పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. ఇది మరింత మందిని ఆకర్షించే అంశం. 

పోర్టబుల్‌
రిటైర్మెంట్‌ అకౌంట్‌కు పోర్టబులిటీ ఉంటుంది. ఒక ఉద్యోగం మానేసి మరో చోట ఉద్యోగంలో చేరితే ఖాతాను బదిలీ చేసుకోవచ్చు.

పన్ను ఆదా
సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల పెట్టుబడికి అదనంగా ఎన్‌పీఎస్‌లో రూ.50,000 పెట్టుబడిపై పూర్తిగా పన్ను లేదు. ఉదాహరణకు రూ.4.50 లక్షల పన్ను కలిగిన వారు సెక్షన్‌ 80సీ సాధనాల్లో రూ.1.50 లక్షల మేర ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రూ.4 లక్షల ఆదాయం వరకు పన్ను ఉండదు. అప్పుడు రూ.50వేలపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. అదే ఆ రూ.50వేలను ఎన్‌పీఎస్‌లో పెడితే పన్ను మినహాయింపు పొందొచ్చు. 
 



You may be interested

మారుతి రివర్స్‌ జర్నీ ఎక్కడి వరకు?

Wednesday 10th October 2018

కార్ల రంగంలో రారాజు ‘మారుతి సుజుకి’ షేరు గత నెలన్నర రోజులుగా బేల చూపులు చూస్తోంది. గతేడాది డిసెంబర్‌లో నమోదైన గరిష్ట ధర రూ.9,996 నుంచి ఇప్పటికి 33 శాతం క్షీణించింది. మంగళవారం నాటి క్లోజింగ్‌ ధర రూ.6,691.90. మంగళవారం ఒక్కరోజే మూడు శాతం పడిపోయింది. బలమైన ఆర్థిక మూలాలు, అధిక మార్కెట్‌ వాటా కలిగిన మారుతి ఈ విధంగా పడిపోవడంతో... ఈ పతనం ఎంత వరకు? అన్న సందేహం

ఈ ఏడాది బాగా చితక్కొట్టుడు ఈ షేర్లకే...

Wednesday 10th October 2018

స్టాక్‌ మార్కెట్లకు 2018 బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే భారీ అస్థిరతలకు తోడు బలమైన బ్లూచిప్‌ షేర్లకు కూడా వరుసపెట్టి బాదుడు తప్పలేదు. పేరున్న కంపెనీల మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఎన్నో కారణాలతో ఇన్వెస్టర్ల సంపదను భారీగా కాలరాసేసిన షేర్ల వివరాలు (రూ.5 వేల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ కంటే ఎక్కువ ఉండి నష్టపోయినవి) చూస్తే...    పీఎన్‌బీ: 2017 డిసెంబర్‌లో మార్కెట్‌ క్యాప్‌ రూ.41,599 కోట్లు.

Most from this category