ఇన్వెస్టర్ల సంపద హరించిన ఫండ్స్ ఇవే..
By Sakshi

సెప్టెంబర్‌లో చాలా వరకు ఈక్విటీ ఫండ్స్ నెట్ అసెట్ వ్యాల్యు (ఎన్ఏవీ) తగ్గిపోయింది. క్రూడ్ ధరల పెరుగుదల, రూపాయి బలహీనత, బాండ్ ఈల్ట్స్ పెరుగుదల, లిక్విడిటీ భయాల వల్ల గత నెలలో స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లైన సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 6 శాతానికిపైగా పతనమయ్యాయి. గత 31 నెలల కాలంలో ఈ స్థాయిలో ఇండెక్స్‌లు పడిపోవడం ఇదే ప్రథమం. ► మ్యూచువల్ ఫండ్స్ విభాగాన్ని గమనిస్తే.. బ్యాంకింగ్‌ను ఒక కేటగిరిగా చూస్తే 13.37 శాతంమేర క్షీణించింది. దీని తర్వాత స్మాల్‌క్యాప్స్ 12.19 శాతం, మిడ్‌క్యాప్స్ 11.37 శాతం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓరియెంటెడ్ ఫండ్స్ 11 శాతం నష్టపోయాయి. ఈక్విటీ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, మల్టీక్యాప్, ఈఎల్ఎస్ఎస్, వ్యాల్యు ఓరియెంటెడ్, లార్జ్‌క్యాప్, ఫార్మా ఫండ్స్ 4-10 శాతం శ్రేణిలో క్షీణించాయి. ►ఫండ్ పరంగా చూస్తే.. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ ఎక్కువగా 17 శాతంమేర పడిపోయింది. బ్యాంకింగ్ ఫండ్స్‌లో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన ఫండ్ ఇదే. దీని తర్వాత ఎల్ఐసీ ఎంఎఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, రిలయన్స్ బ్యాంకింగ్ ఫండ్ 15 శాతానికిపైగా క్షీణించాయి. ►బీఎస్ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లలో రెండంకెల క్షీణత నమోదయ్యింది. స్మాల్‌క్యాప్ ఈక్విటీ ఫండ్స్‌లో హెచ్ఎస్బీసీ స్మాల్‌క్యాప్ ఈక్విటీ ఫండ్, సుందరం స్మాల్‌క్యాప్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ స్మాల్‌క్యాప్ ఫండ్, డీఎస్పీ స్మాల్‌క్యాప్ ఫండ్ 13 శాతానికిపైగా పడిపోయాయి. ►మిడ్‌క్యాప్ ఓరియెంటెడ్ ఫండ్స్‌లో మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ 100 ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ 13.67 శాతం, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ 12.92 శాతం, టాటా మిడ్‌క్యాప్ గ్రోత్ ఫండ్ 12.44 శాతం, బరోడా పియనీర్ ఫండ్ 12.40 శాతం నష్టపోయాయి. ►ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో హెచ్ఎస్బీసీ ఇన్ఫ్రా ఈక్విటీ ఫండ్ 15.41 శాతం, హెచ్డీఎఫ్సీ ఇన్ఫ్రా ఫండ్ 14.85 శాతం, బీఐవో ఆక్సా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ఫ్రా ఫండ్ 14.10 శాతం తగ్గాయి. ►మల్టీక్యాప్ ఫండ్ విభాగంలో ఐఐఎఫ్ఎల్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ 14 శాతం, ఇన్వెస్కో ఇండియా మల్టీక్యాప్ ఫండ్ 12.59 శాతం, టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ 12.34 శాతం నష్టపోయాయి. ►లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ కేటగిరిలో.. బీఓఐ ఆక్సా లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఈక్విటీ ఫండ్, కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్, ఎల్ఐసీ ఎంఎఫ్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఈటీఎఫ్ ఎన్ఏవీ 10-16 శాతం శ్రేణిలో నష్టపోయాయి. ►ఫార్మా సంబంధిత ఫండ్స్‌లో యూటీఐ హెల్త్‌కేర్ ఫండ్ 6.44 శాతం, టాటా ఇండియా ఫార్మా ఫండ్ 6.28 శాతం, ఎస్బీఐ హెల్త్‌కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ 4.45 శాతం క్షీణించాయి. ►వ్యాల్యు ఓరియెంటెడ్ ఫండ్స్‌లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ప్యూర్ వ్యాల్యు ఫండ్, ఐడీఎఫ్సీ స్టెర్లింగ్ వ్యాల్యు ఫండ్, జేఎం వ్యాల్యు ఫండ్ 11 శాతంమేర పడిపోయాయి. ►ఇంటర్నేషనల్ ఫండ్స్ విషయానికి వస్తే..ఇవి గత నెల కాలంలో పాజిటివ్ రిటర్న్స్ అందించాయి. హెచ్ఎస్బీసీ బ్రెజిల్ ఫండ్ 8.83 శాతం, డీఎస్పీ వరల్డ్ మైనింగ్ ఫండ్ 7.86 శాతం, రిలయన్స్ జపాన్ ఈక్విటీ ఫండ్ 4.93 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. ‘సిప్‌లను తప్పక కొనసాగించాల్సిన సమయం ఇది. మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నాయి. ఇలాంటప్పుడే కాస్ట్ యావరేజ్ అవుతుంది. సిప్‌లను నిలిపివేయడాన్ని ఆపివేయాలి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్టర్లకు ఇదే మంచి సమయం. సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే.. ఫండ్ పనితీరు ఆధారంగా ప్రస్తుతం నిర్ణయం తీసుకోకూడదు. ఇప్పుడు లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, మల్టీక్యాప్ ఫండ్స్‌కు ప్రాధాన్యమివ్వొచ్చు’ అని ఫండ్స్ఇండియా హెడ్ ఆఫ్ రీసెర్చ్ విద్యా బాల తెలిపారు. ఐదేళ్ల దీర్ఘకాల లక్ష్యంతో సిప్ విధానంలో మల్టీక్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ పొందొచ్చని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ సీఐవో నవ్‌నీత్ మునోత్ పేర్కొన్నారు. సమీప కాలంలో బ్యాంకింగ్ స్టాక్స్ ఔట్లుక్ ఎలా ఉంటుందో అంచనా వేడయం కష్టమే కానీ బ్యాంకింగ్ స్టాక్స్‌లో కరెక్షన్ మరి కొంత కాలం కొనసాగే అవకాశముందని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ గౌతమ్ దుగ్గడ్ తెలిపారు. అయితే కార్పొరేట్ బ్యాంక్ స్టాక్స్ కొనుగోలుకు ఇది మంచి సమయమని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో బీఎస్ఈ బ్యాంక్ ఇండెక్స్ 12 శాతం, బీఎస్ఈ రియల్టీ ఇండెక్స్ 20 శాతం, బీఎస్ఈ ఆటో ఇండెక్స్ 13 శాతం క్షీణించాయి.
You may be interested
మిశ్రమంగా అటో అమ్మకాలు
Monday 1st October 2018వాహన విక్రయాలు సెప్టెంబర్‌లో మిశ్రమంగా నమోదయ్యాయి. ప్యాసింజర్ వాహన విక్రయాలకు డిమాండ్ లేకపోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, అటో పరిశ్రమపై కేరళ వరదల ప్రభావం ఇప్పటికీ తగ్గకపోవడం, దేశంలో పలు ప్రాంతాల్లో వర్షభావ ప్రభావం తక్కువగా నమోదుకావడం తదితర కారణాలు సెప్టెంబర్ వాహన విక్రయాలపై ప్రభావాన్ని చూపాయి. ఈ నెలలో (అక్టోబర్) పండుగ సీజన్ సందర్భంగా తిరిగి అటో విక్రయాలు పుంజుకుంటాయనే ఆశాభావాన్ని పలు కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. మారుతి
మూడు వారాల కోసం పది సిఫార్సులు
Monday 1st October 2018వచ్చే మూడు వారాల్లో మంచి రాబడినిచ్చే పది షేర్లను ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు రికమండ్ చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రికమండేషన్లు 1. ఇండియన్ హోటల్స్ కంపెనీ: కొనొచ్చు. టార్గెట్ రూ. 151. స్టాప్‌లాస్ రూ. 128. కొన్ని నెలలుగా కన్సాలిడేషన్‌లో ఉంది. ఎప్పటికప్పుడు రూ. 125 వద్ద మంచి మద్దతు పొందుతోంది. గత రెండు వారాల్లో లాంగ్ లోయర్ షాడోలు చార్టుల్లో ఏర్పరచడం ద్వారా దిగువ స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్నట్లు తెలియజేస్తోంది. ఆర్ఎస్ఐ