STOCKS

News


మల్టీక్యాప్‌ ఫండ్స్‌ బెటర్‌..!

Wednesday 3rd April 2019
personal-finance_main1554231456.png-24937

రూ.24 లక్షల కోట్ల మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమకు 2018-19 ఆర్థిక సంవత్సరం రోలర్‌కోస్టర్‌ రైడ్‌ మాదిరిగా ఉందని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై కేంద్ర సర్కారు పన్ను వేయడం, మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల పునర్వ్యవస్థీకరణ దిశగా సెబీ తీసుకున్న చర్యలు, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం ఇలా ఎన్నో మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఈ అంశాలు ఇన్వెస్టర్ల పెట్టుబడులపై రాబడులను దెబ్బతీశాయి. మరి నూతన ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి?... ఎతికా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఎండీ గజేంద్ర కొఠారి, థింక్‌నిగమ్‌ డాట్‌ ఇన్‌ వ్యవస్థాపకులు తరున్‌ బిరాని సూచనలు ఇలా ఉన్నాయి. 

 

మోదీ తిరిగి అధికారంలోకి వస్తే... ఇన్‌ఫ్రా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చా?
గజేంద్ర కొఠారి: సెక్టార్‌ ఫండ్స్‌కు దూరంగా ఉండాలి. గత ఎనిమిది సంవత్సరాలుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్స్‌లో నాకు పెట్టుబడులు ఉన్నాయి. వీటిపై వార్షిక రాబడులు 6 శాతంగా ఉన్నాయి. ఎనిమిదేళ్ల క్రితం నేను ఇన్వెస్ట్‌ చేసినప్పుడు, 2008 నాటి పతనం తర్వాత చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రకటనల ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవచ్చు లేదా నిలిపివేయవచ్చు. రిటైల్‌ ఇన్వెస్టర్లు అయితే థీమ్యాటిక్‌ ఫండ్స్‌కు దూరంగా ఉండాలి. డైవర్సిఫైడ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, ఇన్‌ఫ్రా స్టాక్స్‌కు భవిష్యత్తు ఉందని ఫండ్‌ మేనేజర్‌ భావిస్తే 25 శాతం వరకు ఎక్స్‌పోజర్‌ తీసుకుంటారు. కానీ, రిటైల్‌ ఇన్వె‍స్టర్లకు ఎప్పుడు ఇన్వెస్ట్‌ చేయాలి, ఎప్పుడు వైదొలగాలి అన్నది తెలియదు. ఇదంతా సైక్లికల్‌. కనుక ఈ తరహా ఫండ్స్‌కు దూరంగా ఉండాలి. మల్టీక్యాప్‌ ఫండ్స్‌కు పరిమితం కావడం అనేది దీర్ఘకాలంలో మంచి బెట్‌ అవుతుంది. 

తరుణ్‌ బిరాని: గత 10 ఏళ్లలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్స్‌ వార్షిక రాబడులు 12 శాతంగా ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ విభాగం సగటు రాబడులు 18 శాతంగా ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ విభాగం సగటు రాబడులు 22 శాతంగా ఉన్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్స్‌లో రిస్క్‌ 20-25 శాతం ఉంటోంది. వీటితో పోలిస్తే మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇదే తరహా రిస్క్‌ ఉంది. కానీ, రిస్క్‌ తీసుకుంటే వచ్చే రాబడుల రేషియోనూ చూడాలి. ఇన్‌ఫ్రా అన్నది చాలా వరకు లార్జ్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఓ థీమ్‌గానే ఉంది.

 

సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌, భారత్‌ 22ఈటీఎఫ్‌లు రాబడులను ఇచ్చేట్టుగా లేవు కనుక ఎగ్జిట్‌ అవొచ్చా లేక కొనసాగాలా? 
గజేంద్ర కొఠారి: ఇవి ప్రభుత్వం నడిపించేవి కనుక వీటి నుంచి ఎగ్జిట్‌ అవడం మంచిది. అంతా విధానాలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం మారితే ఏ కొత్త విధానాలు వస్తాయో మనకు తెలియదు. కనుక వీటికి దూరంగా ఉండడం మంచిది. మల్టీక్యాప్‌ ఫండ్స్‌లో కొనసాగం మంచిది. పబ్లిక్‌ లేదా ప్రైవేటు అన్నది ఫండ్‌ మేనేజర్‌ చూసుకుంటారు. 
తరుణ్‌ బిరాని: గజేంద్ర కొఠారి అభిప్రాయంతో నేను సైతం ఏకీభవిస్తాను. 



You may be interested

మెట్రోపాలిస్‌ హెల్త్‌కేర్‌ ఐపీవో... వీటిని తెలుసుకోవాల్సిందే

Wednesday 3rd April 2019

డయాగ్నస్టిక్స్‌ సేవల్లో ఉన్న మెట్రోపాలిస్‌ హెల్త్‌కేర్‌ ఐపీవో ఈ నెల 3న ప్రారంభం అవుతోంది. ఈ ఐపీవో 5వ తేదీన ముగుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌వీఎన్‌ఎల్‌ తర్వాత వచ్చిన ఐపీవో ఇది. ఈ ఇష్యూకు జేఎం ఫైనాన్షియల్‌, క్రెడిట్‌ సూసే సెక్యూరిటీస్‌ ఇండియా, గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ మహింద్రా క్యాపిటల్‌ కంపెనీ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.   1,36,85,095 షేర్లను ఐపీవోలో భాగంగా విక్రయిస్తున్నారు.

4నెలల గరిష్టానికి టాటామోటర్స్‌

Tuesday 2nd April 2019

తన అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌(జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌) గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటిస్తుందనే అంచనాలతో  టాటామోటర్స్‌ కంపెనీ షేర్లు మంగళవారం నాలుగు నెలల గరిష్టాన్ని తాకాయి. నేడు బీఎస్‌లో టాటామోటర్స్‌ షేర్లు రూ.188.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ‘‘మెరుగైన నగదు ప్రవాహం కారణంగా మార్చి 31వ తేదితో ముగిసే చివరి త్రైమాసికంలో కంపెనీ ఆశించిన స్థాయిలో ఫలితాలను ప్రకటిస్తుందని మేము ఆశిస్తున్నాము.’’ అని జేఎల్‌ఆర్‌

Most from this category