STOCKS

News


‘సిప్‌’ పెట్టుబడుల్లో 47 % వృద్ధి

Wednesday 12th September 2018
personal-finance_main1536729772.png-20187

న్యూఢిల్లీ: సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి కొనసాగిస్తున్న రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆగస్టులో సిప్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ఏకంగా రూ.7,658 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన రూ.5,206 కోట్ల సిప్‌ పెట్టుబడులతో పోల్చితే 47 శాతం వృద్ధి చోటుచేసుకున్నట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫి) తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. ఈ ఏడాది జూలైలో రూ.7,554 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌–ఆగస్టు) కాలానికి మొత్తం సిప్‌ పెట్టుబడులు రూ.36,760 కోట్లుగా ఉంటే, 2016–17 సంవత్సరంలో ఇదే కాలంలో వచ్చిన పెట్టుబడులు రూ.43,900 కోట్లుగా ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. 
సిప్‌ ప్రయోజనాలపై అవగాహన పెరగాలి
మార్కెట్‌ టైమింగ్‌ రిస్క్‌ను తగ్గించడంలో సిప్‌లు సత్ఫలితాలను ఇస్తున్న కారణంగా ఈ మార్గంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు ఊపందుకుంటున్నట్లు షేర్‌ఖాన్‌, బీఎన్‌పీ పారిబాస్ ఇన్వెస్ట్‌మెంట్‌ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌ స్టీఫన్‌ గ్రోనింగ్‌ అన్నారు. సంప్రదాయ పెట్టుబడి మార్గాలైన రియల్‌ ఎస్టేట్‌, బంగారం వంటి అసెట్‌ క్లాసుల్లో పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా లేరని వివరించారు. ‘‘ప్రత్యేకించి ఒడుదుడుల మార్కెట్‌లో సిప్‌లు ఎంతటి ప్రయోజనాన్ని చేకూరుస్తాయనే అంశంపై ఇన్వెస్టర్లలో అవగాహన పెరగాల్సి ఉంది. ప్రీమెచ్యూర్‌ క్యాన్సిలేషన్స్‌, మార్కెట్‌ పడిపోతున్న సమయంలో రద్దు చేసుకోవడం లాంటి అవగాహనా లేమి కొనసాగుతూనే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ముడిచమురు ధరల్లో పెరుగుదల, రూపాయి పతనం వంటి ఆందోళనల కారణంగా సిప్‌ పెట్టుబడులు జోరందుకున్నట్లు బజాజ్ క్యాపిటల్ సీఈఓ రాహుల్ పారిఖ్ అన్నారు. You may be interested

ప్రపంచంలోనే అతిపెద్ద శాంసంగ్‌ మొబైల్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్

Wednesday 12th September 2018

బెంగళూరు: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజమైన శాంసంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను మంగళవారం బెంగళూరులో ప్రారంభించింది. బ్రిటిష్ కాలం నాటి ఓపెరా హౌస్‌లో ఈ సెంటర్‌ ప్రారంభం కాగా, కస్టమర్లు కంపెనీకి చెందిన అన్ని రకాల ఉత్పత్తులను ఇక్కడ పరిశీలించవచ్చని కంపెనీ సౌత్ వెస్ట్ ఆసియా అధ్యక్షుడు సీఈఓ హెచ్‌ సీ హాంగ్ అన్నారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు, మొబైల్ యాక్సెసరీలను ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ప్యాసింజర్‌ వాహన అమ్మకాల్లో 2.46% క్షీణత

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు (పీవీ సేల్స్‌) వరుసగా రెండవ నెలలోనూ తగ్గుదలను నమోదు చేసినట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) వెల్లడించింది. హై బేస్‌ ఎఫెక్ట్‌, కేరళ వరదల ప్రభావం కారణంగా ఆగస్టులో 2.46 శాతం క్షీణత నమోదైనట్లు సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథూర్‌ అన్నారు. ఇంధన ధరల పెరుగుదల కూడా అమ్మకాలపై స్వల్ప ప్రభావం చూపాయని వ్యాఖ్యానించారు. గత నెలలో పీవీ

Most from this category