STOCKS

News


బ్యాంకుల్లో తగ్గిన ఫండ్స్‌ పెట్టుబడులు

Monday 22nd October 2018
personal-finance_main1540183930.png-21346

న్యూఢిల్లీ: మార్కెట్లో కరెక్షన్‌ నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగ స్టాక్స్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు సెప్టెంబర్‌లో 21,600 కోట్ల మేర తగ్గిపోయాయి. సెప్టెంబర్‌ చివరికి మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు రూ.1,88,620 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు నెల ఆగస్ట్‌ నాటికి రూ.2,10,251 కోట్లుగా ఉండడం గమనార్హం. జూన్‌ నుంచి చూసుకుంటే ఇదే తక్కువ. జూన్‌లో బ్యాంక్‌స్టాక్స్‌లో ఫండ్స్‌ పెట్టుబడులు 1.87 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. శాతం వారీగా చూసుకుంటే ఫండ్స్‌ మొత్తం పెట్టుబడుల్లో బ్యాంకింగ్‌ రంగంలో ఎక్స్‌పోజర్‌ సెప్టెంబర్‌ నాటికి 19.78 శాతంగా ఉంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు పెట్టుబడుల తగ్గింపు కంటే మార్కెట్‌ కరెక్షన్‌ కారణంగానే పెట్టుబడుల శాతం ఎక్కువగా తగ్గినట్టు ఫండ్స్‌ఇండియా రీసెర్చ్‌ హెడ్‌ విద్యాబాల తెలిపారు. సెప్టెంబర్‌లో బీఎస్‌ఈ బ్యాంకెక్స్‌ 12 శాతం పడిపోయిన విషయం గమనార్హం. అయినప్పటికీ ఫండ్‌ మేనేజర్లకు ఇప్పటికీ బ్యాంకింగ్‌ మిక్కిలి ప్రాధాన్య రంగంగానే కొనసాగుతోంది. ఆ తర్వాత ఫైనాన్స్‌ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫైనాన్స్‌ రంగ స్టాక్స్‌లో రూ.87,519 కోట్ల పెట్టుబడులు కలిగి ఉండగా, సాఫ్ట్‌వేర్‌ రంగ స్టాక్స్‌లో రూ.88,453 కోట్లు ఇన్వెస్ట్‌ చేసి ఉన్నారు. నాన్‌ డ్యురబుల్స్‌, ఆటోమొబైల్‌ రంగాలకు ఆ తర్వాత ప్రాధాన్యం ఇచ్చారు. 



You may be interested

పర్సిస్టెంట్ లాభం 7 శాతం అప్‌

Monday 22nd October 2018

న్యూఢిల్లీ: టెక్నాలజీ సంస్థ పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 88 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ. 82.6 కోట్లతో పోలిస్తే 7 శాతం అధికం. ఇక కంపెనీ ఆదాయం రూ. 795 కోట్ల నుంచి రూ. 859 కోట్లకు పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి కంపెనీని మూడు విభాగాలుగా విభజించినట్లు సంస్థ తెలిపింది. ఇందులో

రూపాయి పతనం, మొండిబకాయిలతో ఇబ్బందే

Monday 22nd October 2018

న్యూఢిల్లీ: అంతకంతకూ పడిపోతున్న రూపాయి విలువ, బ్యాంకుల్లో మొండిబకాయిలు పేరుకుపోతుండటం ఆందోళనకలిగించే అంశాలేనని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు పనితీరుపై మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. పాలనపరమైన లోపాలు, పలు రాష్ట్రాల్లో ప్రజా ఆందోళనలు, లౌకికవాదాన్ని దెబ్బతీసేవిధంగా చేస్తున్న ప్రకటనలతో దేశం సతమతమవుతోందని జలాన్‌ వ్యాఖ్యానించారు. అయితే, మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు కీలక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చుతాయన్నారు. ప్రధానంగా

Most from this category