STOCKS

News


మ్యూచువల్‌ ఫండ్స్‌ ‘సిప్‌’ పెట్టుబడుల్లో భారీ వృద్ధి

Monday 15th October 2018
personal-finance_main1539581323.png-21152

న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లు కరెక్షన్‌లో ఉన్నాగానీ ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులు గుమ్మరించారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమకు సెప్టెంబర్‌ నెలలో సిప్‌ పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చాయి. గతేడాది ఇదే నెలలో వచ్చిన నిధులతో పోలిస్తే 40 శాతం అధికంగా రూ.7,727 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. అంటే, మార్కెట్ల కరెక్షన్‌ను ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అవకాశంగా చూసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో సిప్‌ పెట్టుబడులు రూ.7,658 కోట్లు, జూన్‌లో రూ.7,554 కోట్లు మేర రావడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో సిప్‌ మార్గంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడుల మొత్తం రూ.44,487 కోట్లకు వృద్ధి చెందింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఈ మొత్తం రూ.29,266 కోట్లుగా ఉంది. అయితే, గత మూడు నెలల కాలంలో సిప్‌ నమోదుల సంఖ్యలో వృద్ధి 2 శాతంగానే ఉంది. సెప్టెంబర్‌ నెలలో సెన్సెక్స్‌ ఆరు శాతం నష్టపోయిన విషయం తెలిసిందే. గడిచిన కొన్ని సంవత్సరాలుగా చూస్తే... సిప్‌ ద్వారా వచ్చే పెట్టుబడుల్లో మంచి వృద్ధి కనిపిస్తోంది. 2016-17లో రూ.43,900 కోట్లు రాగా, 2017-18లో రూ.67,000 కోట్లు రావడం గమనార్హం.  మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు పరిశ్రమ చేపడుతున్న అవగాహన కార్యక్రమాల ఫలింగా సిప్‌ సంఖ్యలో మంచి వృద్ధి నెలకొన్నట్టు మార్నింగ్‌స్టార్‌ డైరెక్టర్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ కౌస్తభ్‌ బేలపుర్కార్‌ తెలిపారు. 



You may be interested

డేటా లోకలైజేషన్‌కి నేటితో గడువు పూర్తి

Monday 15th October 2018

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు భారత్‌లోని తమ కస్టమర్లు నిర్వహించే లావాదేవీల డేటాను దేశీయంగానే స్టోర్ చేయాలంటూ (డేటా లోకలైజేషన్‌) రిజర్వ్ బ్యాంక్ విధించిన గడువు సోమవారంతో ముగుస్తోంది. ఆర్‌బీఐ దీన్ని మళ్లీ పొడిగించే అవకాశాలేమీ లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. డేటా లోకలైజేషన్‌ నిబంధనలను అమలు చేయడానికి అంతర్జాతీయ పేమెంట్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన ఆరు నెలల గడువు అక్టోబర్ 15తో ముగియనుంది. దేశీ సంస్థలు ఇందుకు

టెలికంకు మరో మూడు త్రైమాసికాలు నష్ట కాలమే: సీవోఏఐ

Monday 15th October 2018

న్యూఢిల్లీ: టెలికం రంగానికి మరో మూడు త్రైమాసికాల పాటు నష్టాలు తప్పవని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (సీవోఏఐ) తెలిపింది. అధిక లెవీలు, నిలకడలేని టారిఫ్‌లు నష్టం కలిగిస్తున్నట్టు పేర్కొంది. ‘‘ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం చూస్తే... కనీసం మరో మూడు క్వార్టర్లలో నష్టాలు ఉండనున్నాయి. ఎందుకంటే, ఈ పరిశ్రమ దీర్ఘకాల ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుత టారిఫ్‌లు దీర్ఘకాలం పాటు కొనసాగించడం సాధ్యం కాదన్నది నా అభిప్రాయం’’అని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌

Most from this category