STOCKS

News


వీటిల్లోకి ఫండ్స్‌ పెట్టుబడుల వరద!

Thursday 13th December 2018
personal-finance_main1544723034.png-22903

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నవంబర్‌లో 5 శాతం పెరిగాయి. ఇన్వెస్టర్లు రూ.1.4 లక్షల కోట్ల మేర వివిధ రకాల పథకాల్లో ఇన్వెస్ట్‌ చేశారు. ఈ ఏడాది ఇంత వరకు మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడుల మొత్తం రూ.2.23 లక్షల కోట్లుగా ఉన్నట్టు యాంఫి గణాంకాలు చెబుతున్నాయి. మరి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారో తెలుసుకునే ఆసక్తి ఇన్వెస్టర్లలో సహజంగానే ఉంటుంది. ఆ వివరాలను ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఓ నివేదికగా వెలువరించింది. 

 

లార్జ్‌క్యాప్‌
పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌, సీమెన్స్‌, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారికో స్టాక్స్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు పెట్టాయి. ఇక బాష్‌, లుపిన్‌, వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌లో వాటాలను కొంత మేర తగ్గించుకున్నాయి.

మిడ్‌క్యాప్‌
మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌, ఆల్కెమ్‌ ల్యాబ్స్‌, అజంతా ఫార్మా, ఇన్ఫో ఎడ్జ్‌, అదానీ పవర్‌, డిష్‌ టీవీ, ఏసీసీ, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, మైండ్‌ ట్రీ, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా స్టాక్స్‌ను మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎక్కువగా కొనుగోళ్లు చేశాయి. అదే సమయంలో మిడ్‌ క్యాప్‌ విభాగంలో టాటా కమ్యూనికేషన్స్‌, హెచ్‌ఈజీ, పేజ్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌బీసీసీ, అరవింద్‌లో వాటాలను తగ్గించుకున్నాయి. 

స్మాల్‌క్యాప్‌
స్మాల్‌క్యాప్‌ విభాగంలో ఏఎంసీలు కొనుగోలు చేసిన జాబితాలో ఓడిషా సిమెంట్‌, మహింద్రా లాజిస్టిక్స్‌, ఎఫ్‌డీసీ, ఆటోమోటివ్‌ యాక్సెల్స్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌, ఐఎఫ్‌జీఎల్‌ రిఫ్రాక్టరీస్‌, టెక్నో ఎలక్ట్రిక్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌, తేజాస్‌ నెట్‌వర్క్స్‌ ఉన్నాయి. ఈ విభాగంలో గ్రాన్యూల్స్‌ ఇండియా, మెర్క్‌, శ్రేయి ఇన్‌ఫ్రా, గార్వేర్‌ టెక్నికల్‌ ఫైబర్స్‌, లక్ష్మి మెషిన్‌ వర్క్స్‌ను విక్రయించాయి. You may be interested

బీజేపీ ఓడినా మార్కెట్లకు ఢోకాలేదు...!: జున్‌జున్‌వాలా

Thursday 13th December 2018

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి ఎదురుదెబ్బగా ప్రతి ఒక్కరూ చూస్తు‍న్నారని, వాస్తవానికి ఫలితాలు కాషాయ పార్టీకి మంచివేనని ప్రముఖ బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ జున్‌జున్‌వాలా అన్నారు. ‘‘బీజేపీ 15 ఏళ్లపాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉంది. అయినప్పటికీ భారీగా ఓట్లను సొంతం చేసుకుంది. 2019 సాధారణ ఎన్నికల ఫలితాలను ఇప్పుడే ఊహించడం కష్టం. అయినప్పటికీ బీజేపీ 2019లో తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్ముతున్నాను. భారత్‌ బాధ్యతాయుత ప్రజాస్వామ్య దేశం.

ఇండియా వృద్దిపై మూడీస్‌ హెచ్చరిక!

Thursday 13th December 2018

భారత ఆర్థిక వృద్ధికి ఎన్‌బీఎఫ్‌సీల సమస్యలు ప్రతిబంధకాలు కావచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మూడీస్‌ హెచ్చరించింది. ఎన్‌బీఎఫ్‌సీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ ఇక్కట్లు దేశ వృద్ధిరేటును కుంటుపరుస్తాయని అభిప్రాయపడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ కేవలం 7 శాతానికి కాస్త అటుఇటుగా ఉండొచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది ఆశిస్తున్న 7.4 శాతం వృద్ధి రేటు అంచనా కన్నా వచ్చే ఏడాది అంచనాలు తక్కువని మూడీస్‌ చీఫ్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌

Most from this category