STOCKS

News


రికార్డ్‌ స్థాయికి ఫండ్స్‌  ఆస్తులు

Saturday 8th September 2018
personal-finance_main1536380230.png-20069

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి రికార్డ్‌ స్థాయికి చేరాయి. ఈ ఏడాది జూలై నాటికి రూ.23 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణ ఆస్తులు గత నెల చివరి నాటికి రూ.25 లక్షల కోట్లకు పెరిగాయని యాంఫీ తెలిపింది. గత ఏడాది ఆగస్టు నాటికి ఈ ఆస్తులు రూ.21 లక్షల కోట్లుగా ఉన్నాయని యాంఫీ(ఆసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా) తెలిపింది. లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ జోరుగా పెరగడం, రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడం దీనికి ప్రధాన కారణాలని యాంఫీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌.ఎస్‌. వెంకటేశ్‌ చెప్పారు. మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ తీసుకుంటున్న సానుకూల సంస్కరణలు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం వల్ల కూడా ఫండ్స్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయని వివరించారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి వెంకటేశ్‌ వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు...
♦ సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయడానికి రిటైల్‌ ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. భారీ మొత్తాల్లో ఇన్వెస్ట్‌ చేసే అవసరం లేకుండా చిన్ని, చిన్న మొత్తాల్లో క్రమం తప్పకుండా ఇన్వె‍స్ట్‌ చేసే వీలు సిప్‌ల్లో ఉండటం దీనికి ప్రధాన కారణం. 
♦ మార్కెట్‌ ఒడిదుడుకులకు తట్టుకోవడమే కాకుండా, క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేసే అలవాటును సిప్‌ అలవాటు చేస్తోంది. 
♦ మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తులు 2014, మేలో తొలిసారిగా రూ.10 లక్షల కోట్లకు చేరాయి. 
♦ కేవలం మూడేళ్ల కాలంలోనే(2017, ఆగస్టు నాటికి) ఈ ఆస్తులు రెండు రెట్లు పెరిగి రూ.20 లక్షల కోట్లకు పెరిగాయి. 
♦ ఒక్క ఆగస్టు నెలలోనే మ్యూచువల్‌ ఫండ్స్‌లో రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 
♦ దీంట్లో రూ.1.71 లక్షల కోట్ల పెట్టుబడులు లిక్విడ్‌ ఫండ్స్‌లోనే రావడం విశేషం. ఈ లిక్విడ్‌ ఫండ్స్‌.... ట్రెజరీ బిల్లులు, డిపాజిట్‌ సర్టిఫికెట్స్‌, కమర్షియల్‌ పేపర్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. 
♦ ఈక్విటీ ఫండ్స్‌లో రూ.7,700 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయి. 
♦ ఇన్‌కమ్‌ ఫండ్స్‌ నుంచి రూ.6,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. 
♦ గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. గత నెలలో ఈ ఫండ్స్‌ నుంచి రిటైల్‌ ఇన్వెస్టర్లు రూ.45 కోట్ల మేర పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. 



You may be interested

స్వల్పంగా తగ్గిన క్యాడ్‌

Saturday 8th September 2018

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) 2.4 శాతంగా నమోదయ్యింది. 2017-18 ఇదే కాలంలో ఈ లోటు 2.5 శాతం. విలువలో క్యాడ్‌ 15 బిలియన్‌ డాలర్ల నుంచి 15.8 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఒక నిర్దిష్ట కాలంలో ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసమే

టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ జంప్‌..

Saturday 8th September 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం ఒకటి, రెండూ మినహా దాదాపుగా అన్నీ లాభాల్లోనే ట్రేడయ్యాయి. విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు తగ్గితే... టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ గరిష్టంగా 2 శాతానికిపైగా ఎగసింది.  విప్రో ఏడీఆర్‌ 0.75 శాతం క్షీణతతో 5.30 డాలర్లకి తగ్గింది. అలాగే

Most from this category