STOCKS

News


ఫండ్స్‌ లాభాలతో కారు లోన్‌ తీర్చేయవచ్చా ? (ధీరేంద్ర కాలమ్‌)

Monday 25th March 2019
personal-finance_main1553502725.png-24786

ప్ర: నేను గత మూడేళ్లుగా నెలకు రూ.15,000 చొప్పున రిలయన్స్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. మొదట్లో ఈ ఫండ్‌ మంచి రాబడులనే ఇచ్చేది.ఇప్పుడు మాత్రం నష్టాలు వస్తున్నాయి. నేను ఇప్పటిదాకా రూ.4.60,000 ఇన్వెస్ట్‌ చేయగా, ప్రస్తుతం రూ.30,000 నష్టం వచ్చింది. నేను ఈ ఫండ్‌ నుంచి వైదొలగి వేరే కొత్త ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. కొన్ని మంచి ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఫండ్స్‌ను సూచించండి. 
-హారిక, బెంగళూరు 
జ: మీరు ఇన్వెస్ట్‌ చేయడానికి చాలా పన్ను ఆదా ఫండ్స్‌ అందుబాటులో ఉన్నాయి. దాదాపు ప్రతీ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ కనీసం ఒక్కటైనా ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఇక రిలయన్స్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌ విషయానికొస్తే, మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు ఇతర ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌ కంటే కూడా మంచి రాబడులనే ఇచ్చింది. ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో అధిక భాగం స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఉండటమే దీనికి ప్రధాన కారణం. మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు చిన్న షేర్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోతాయి. అదే మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పుడు పాతాళమే అవధిగా పడిపోతాయి. అందుకే ఈ ఫండ్‌ ప్రస్తుతం మంచి రాబడులను ఇవ్వడం లేదు. మీరు ఈ ఫండ్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, ప్రస్తుత నష్టాలను పట్టించుకోకుండా ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. మార్కెట్‌ పతన బాటలో ఇన్వెస్ట్‌చేసిన సొమ్ములు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే ఈ ఫండ్‌లా కాకుండా నిలకడైన రాబడులు కావాలనుకుంటే యాక్సిస్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ పండ్‌, మిరా అసెట్‌ ట్యాక్స్‌ సేవర్‌ వంటి ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. 

ప్ర: నేను గత కొంత కాలంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. రెండేళ్ల క్రితం కారు కొనుగోలు కోసం రుణం తీసుకున్నాను. ఈ రుణాన్ని ఐదేళ్లలోపు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ రుణాన్ని తీర్చే మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ద్వారా సాధించాను. ఈ ఫండ్‌ లాభాలను కారు రుణం తీర్చడానికి వినియోగించుకోవాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ?
-నాగరాజు, విజయవాడ 
జ: భవిష్యత్తులో విలువ పెరిగే ఆస్తి కోసం అప్పు చేయచ్చు. ఉదాహరణకు మీరు ఇంటి కోసం రుణం తీసుకోవచ్చు. మరో మాటలో చెప్పాలంటే గృహ  రుణం తీసుకొని ఇంటిని కొనుగోలు చేయవచ్చు. భవిష్యత్తులో ఈ ఇంటి విలువ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అప్పు చేసైనా ఈ ఆస్తిని సమకూర్చకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇక తరిగే విలువ ఉన్న ఆస్తి కోసం అప్పు చేయడం తప్పు అని నా భావన. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తప్ప ఇలాంటి తరుగుదల ఆస్తి కోసం అప్పు చేయకూడదు. ఉదాహరణకు కారు కొనుగోలు చేయడం లాంటిది. అందుకని మీరు ఈ కారు రుణాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీర్చేయడం మంచిది. లక్కీగా మీరు ఇన్వెస్ట్‌​ చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌ కారు రుణాన్ని తీర్చే లాభాలను ఇచ్చాయి. కాబట్టి ఎలాంటి శషభిషలు లేకుండా ఈ కారు రుణాన్ని వీలైనంత త్వరగా తీర్చేయండి. 

ప్ర: నేను సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేశాను. ఈ ఈటీఎఫ్‌లో ఉన్న కంపెనీలు డివిడెండ్‌లు చెల్లించినా, షేర్ల బైబ్యాక్‌లు జరిపినా, ఒక రిటైల్‌ ఇన్వెస్టర్‌గా నాకు ఎలాంటి ప్రయోజనం లభిస్తుంది ? 
-జాకోబ్‌, సికింద్రాబాద్‌
జ: సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో మంచి ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లుంటాయి. ఈ కంపెనీల్లో ఏదైనా ఒక కంపెనీ డివిడెండ్‌ ప్రకటించిందనుకోండి.   అది ఈ ఫండ్‌ ఎన్‌ఏవీ(నెట్‌ అసెట్‌ వేల్యూ)లో ప్రతిఫలిస్తుంది. మార్కెట్‌  డిమాండ్‌, గిరాకీ అంశాలు కూడా ఎన్‌ఏవీపై ప్రతిఫలిస్తాయి. ఇక ఈ ఫండ్‌లోని ఏ కంపెనీ అయినా షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిందనుకోండి. ఆ ప్రభావం కూడా ఎన్‌ఏవీపై ఉంటుంది. డివిడెండ్‌లు, షేర్ల బైబ్యాక్‌ల ప్రభావం ఆ ఫండ్‌ ఎన్‌ఏవీలో ప్రతిఫలిస్తుంది. 

ప్ర: నా మిత్రుడు ఒకడు ప్రైవేట్‌ కంపెనీ బీమా ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. సదరు కంపెనీ యులిప్‌ తీసుకోమని ఒత్తిడి చేస్తున్నాడు. తీసుకోమంటారా ? 
-శంకర్‌, కర్నూలు 
జ:  బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌ కలగలసిన ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనమే యులిప్‌(యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌)లు. ఇవి పూర్తిగా బీమా రక్షణను ఇవ్వలేవు. అలాగని భారీ రాబడులనూ ఇవ్వలేవు.  బీమా ఏజెంట్లలో మన మిత్రులో, బంధువులో ఉంటారు. మొహమాటం కొద్దీ మనం కాదనలేక ఇలాంటి పాలసీలు తీసుకుంటాం. మరోవైపు ఇలాంటి పాలసీల విక్రయంపై ఏజెంట్లకు ఆకర్షణీయమైన కమీషన్లు వస్తాయి. కాబట్టి. ఈ పాలసీల రాబడులు గురించి వాళ్లంతా ఉన్నవీ, లేనివీ కల్పించి చెబుతుంటారు. మన వాళ్లే కదాని మనం కూడా పూర్తి అవగాహన లేకుండా ఈ పాలసీలకు ఓకే చెప్పేస్తాం. అందుకని ఇన్వెస్ట్‌మెంట్‌ విషయాల్లో మీరు ఎలాంటి మొహమాటానికి పోవద్దు, యూలిప్‌లను పూర్తిగా నిరాకరించండి. బీమా అవసరాల కోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌(టిప్‌) తీసుకోండి. వీటిల్లో ప్రీమియమ్‌ తక్కువగానూ, బీమా కవరేజ్‌ అధికంగానూ ఉంటుంది. ఇక ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం మంచి రేటింగ్‌ ఉన్న ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకోండి. రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు చేసుకోవడం, సొంత ఇల్లు సమకూర్చుకోవడం తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ ఫండ్స్‌ల్లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. మంచి రాబడులు పొందవచ్చు.You may be interested

భరోసా ఇస్తోందా? భయపెడుతోందా?

Monday 25th March 2019

ఫెడ్‌ వ్యాఖ్యలపై అయోమయం యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచనని గత డిసెంబర్‌లో నిర్ణయం తీసుకున్నప్పటినుంచి ఈక్విటీలు ర్యాలీ జరుపుతున్నాయి. కానీ గతవారం ఫెడ్‌ వ్యాఖ్యలు మార్కెట్లలో భయాలు రేకెత్తించాయి. రేట్ల పెంపుదలపై ఫెడ్‌ తీసుకున్న యూటర్న్‌ మార్కెట్లలో ఆయోమయం రేకెత్తిస్తోంది. రేట్లు పెంచరని ఆనందించాలా? మాద్యం తప్పదన్న సంకేతాలకు భయపడాలా? మదుపరులు తేల్చుకోలేకపోతున్నారు. ఈ ఏడాది రేట్ల పెంపు ఉండదని, బాండ్‌ కొనుగోలు కార్యక్రమానికి కత్తెరింపులు ఉండవని ఫెడ్‌ తాజాగా ప్రకటించింది.

37,700 మద్దతు కోల్పోతే డౌన్‌ట్రెండ్‌

Monday 25th March 2019

ప్రపంచ మార్కెట్లను అనుసరిస్తూ భారత్‌ మార్కెట్‌సైతం కదంతొక్కుతున్న సమయంలోనే... వడ్డీ రేట్ల పెంపుదలను, బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి నిధుల ఉపసంహరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అనూహ్యంగా అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చేసిన పాలసీ ప్రకటన ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. అలాగే అమెరికా వృద్ధి రేటు అంచనాల్ని కూడా ఫెడ్‌ తగ్గించింది. ఇప్పటికే యూరప్‌, చైనా, జపాన్‌ల వృద్ధి రేటు అంచనాల్లో కోతపడగా, అమెరికా కూడా ఈ బాటలోకి రావడంతో

Most from this category