STOCKS

News


ఏప్రిల్‌ నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ చార్జీలకు కత్తెర

Tuesday 18th December 2018
personal-finance_main1545109860.png-23030

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫం‍డ్స్‌ పథకాల్లో ఇన్వెస్టర్ల నుంచి ఏఎంసీలు వసూలు చేసే చార్జీలకు కోత విధిస్తూ సెబీ నూతన నిబంధనలను విడుదల చేసింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువపై నిర్ణీత శాతం మేర టోటల్‌ ఎక్స్‌పెన్స్‌రేషియో (టీఈఆర్‌) పేరుతో ఏఎంసీలు వసూలు చేస్తుంటాయి. ఈ టీఈఆర్‌ చార్జీలపై పరిమితి విధించాలన్న ప్రతిపాదనకు సెబీ బోర్డు ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఆమోదం తెలియజేయగా, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వచ్చే ఏప్రిల్‌ నుంచి నూతన చార్జీలను ఏఎంసీలు విధిగా అమలు చేయాల్సి ఉంటుంది. క్లోజ్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకాల్లో గరిష్ట టీఈఆర్‌ 1.25 శాతం, ఇతర క్లోజ్‌ ఎండెడ్‌ పథకాలకు ఇది 1 శాతంగా ఇకపై అమలవుతుంది. ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకాల్లో టీఈఆర్‌ గరిష్టంగా 2.25 శాతం, ఇతర ఓపెన్‌ ఎండెడ్‌ పథకాల్లో 2 శాతంగా అమలుకానుంది. అయితే, మొదటి రూ.500 కోట్ల ఆస్తుల నిర్వణహ వరకే ఈ చార్జీలు. రూ.500 కోట్లకు మించి ఆస్తులను నిర్వహించే పథకాల్లో ఈ చార్జీలను సెబీ ఇంకా తగ్గించింది. 



You may be interested

‘కృత్రిమ మేధ’లో నిపుణులు కొరత

Tuesday 18th December 2018

ముంబై: ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్సీ (ఏఐ) రంగాన్ని నిపుణుల కొరత వేధిస్తోంది. మధ్య, సీనియర్ స్థాయిలో నిపుణుల కొరత మరీ అధికంగా ఉండటంతో ఈ స్థాయి పోస్టులు దాదాపు 4,000 వరకూ ఖాళీగానే ఉన్నట్లు ఒక సర్వేలో వెల్లడయింది. గడిచిన ఏడాదికాలంలో ఈ పరిశ్రమ 30 శాతం వృద్ధి చెంది 230 మిలియన్‌ డాలర్లకు చేరినప్పటికీ.. నిపుణుల లేమి మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని అనలిటిక్స్‌ ఇండియా మ్యాగజైన్‌, ఆన్‌లైన్‌ విద్యా సంస్థ

బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి లీలా హోటల్స్‌ !

Tuesday 18th December 2018

కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ భారత ఆతిథ్య రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ సంస్థ హోటల్‌ లీలా వెంచర్‌ను చెందిన హోటళ్లను, బ్రాండ్‌ను రూ.4,500 కోట్లకు కొనుగోలు చేయనున్నదని సమాచారం. భారీ రుణభారంతో కుదేలైన హోటల్‌ లీలా వెంచర్‌కు ఈ డీల్‌ ఊరట నిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హోటల్‌ లీలా వెంచర్‌కు రూ.3,799 కోట్ల మేర రుణభారం ఉంది.  తుది దశలో డీల్‌...!  ఈ డీల్‌లో భాగంగా హోటల్‌ లీలా

Most from this category