STOCKS

News


ఫండ్స్‌లోకి పెట్టుబడుల వెల్లువ

Thursday 12th July 2018
personal-finance_main1531404613.png-18257

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ వరకు మొదటి మూడు నెలల కాలంలో నికరంగా రూ.1.34 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.93,400 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే గనుక 43 శాతం వృద్ధి కనిపిస్తోంది. ముఖ్యంగా రిటైల్‌ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం బలంగా ఉంటోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ ‘యాంఫి’ గణాంకాల ప్రకారం చూస్తే... విరివిగా వచ్చి పడుతున్న పెట్టుబడులతో 42 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ కూడా కొత్త శిఖరాలకు చేరుతోంది. జూన్‌ చివరికి ఈ మొత్తం రూ.23.40 లక్షల కోట్లుగా ఉంది. 2017 జూన్‌ నాటికి ఉన్న రూ.20.40 లక్షల కోట్ల ఆస్తులతో పోలిస్తే 20 శాతం పెరుగుదల ఉంది. 
ఈ ధోరణి పెరుగుతుంది...
ఈ ఏడాది జూన్‌ క్వార్టర్లో పెట్టుబడుల తీరును గమనిస్తే... ప్రధానంగా లిక్విడ్‌, ఈక్విటీ పథకాల్లోకి ఎక్కువ నిధులు తరలివచ్చాయి. లిక్విడ్‌ ఫండ్స్‌లోకి రూ.1.22 లక్షల కోట్లు రాగా, రూ.33,000 కోట్ల మేర ఈక్విటీ విభాగంలోకి వెళ్లాయి. అయితే ఇదే సమయంలో ఇన్‌కమ్‌ ఫండ్స్‌ నుంచి రూ.38,000 కోట్లను ఉపసంహరించుకున్నారు. అలాగే బంగారం ఈటీఎఫ్‌ల నుంచి మరో రూ.146 కోట్ల మేర బయటకు వెళ్లిపోయాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల చేపడుతున్న అవగాహన కార్యక్రమాలే పెట్టుబడులు పెరగడానికి కారణమని యాంఫి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ తెలిపారు. నెలవారీగా సిప్‌ రూపంలో రూ.7,300 కోట్లు వస్తున్నాయని, దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చే సామర్థ్యం ఈక్విటీ పథకాలకు ఉందని ఇన్వెస్టర్లు గుర్తిస్తున్నందున, పెట్టుబడుల రాక ఇక ముందూ పెరుగుతుందని మార్నింగ్‌ స్టార్‌ ఇండియా రీసెర్చ్‌ డైరెక్టర్‌ కౌస్తభ్‌ బేలపుర్కార్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. You may be interested

షాపింగ్‌ మాలే ఆఫీసు!

Thursday 12th July 2018

 స్టార్‌ హోటళ్లలోనూ కార్యాలయాలు  20 లక్షల చ.అ.లకు కో–వర్కింగ్‌ స్పేస్‌  బెంగళూరు, ఎన్‌సీఆర్, హైదరాబాద్‌ల్లోనే డిమాండ్‌  హైదరాబాద్‌ మెట్రో మాల్స్‌లోనూ కో-వర్కింగ్‌ స్పే్‌స్‌? హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మాల్స్, స్టార్‌ హోటల్స్‌.. ఇపుడివి తినడానికో లేదా షాపింగ్‌ చేయడానికో మాత్రమే కాదు!! ఆఫీసులుగానూ మారుతున్నాయి. గతంలో ప్రత్యేకంగా ఒక వాణిజ్య భవనంలో కో–వర్కింగ్‌ స్పేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీలు... ఇప్పుడు షాపింగ్‌ మాల్స్, స్టార్‌ హోటళ్లనూ కార్యాలయాలుగా కేటాయిస్తున్నాయి. పనిచేసే చోటే రిటైల్, ఫుడ్‌ వసతులూ

పన్ను వివాదాలు తగ్గుతాయి: పియుష్ గోయల్

Thursday 12th July 2018

న్యూఢిల్లీ: పన్నుపరమైన వివాదాలపై ఆదాయ పన్ను శాఖ అప్పీళ్లకు సంబంధించిన పరిమితులను పెంచడంతో వ్యాజ్యాలు కొంత మేర తగ్గగలవని కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. న్యాయవ్యాజ్యాల్లో చిక్కుకున్న పన్ను మొత్తాల పరిమాణం రూ. 5,600 కోట్ల మేర తగ్గవచ్చని వివరించారు. ప్రస్తుతం వివిధ ట్రిబ్యునల్స్‌, హైకోర్టులు, సుప్రీం కోర్టులో సుమారు రూ. 7.6 లక్షల కోట్ల మేర పన్ను మొత్తాలు లిటిగేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యాజ్యాలను తగ్గించే

Most from this category